Charlie Dean: బాబోయ్.. జీవితంలో మరోసారి అలాంటి పని చేయను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlie Dean Reacts On Mankading Runout: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో చార్లీ డీన్‌ను భారత జట్టు మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడంపై ఎంత దుమారం రేగిందో అందరికీ తెలిసిందే! ఆ సంగతిని అటుంచితే.. ఈ రనౌట్‌పై చార్లీ డీన్ ఎట్టకేలకు స్పందించింది. ఇంకోసారి తాను క్రీజు వదిలి బయటకు వెళ్లనని, క్రీజులోనే ఉంటానంటూ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా రాసుకొచ్చింది. ‘‘ఈ వేసవికి ఇది ఆసక్తికర ముగింపు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జెర్సీలో ఆడటాన్ని నేను ఎనలేని గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి నేను నా క్రీజులోనే ఉంటానని అనుకుంటున్నా’’ అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కి ఆ మూడో వన్డే మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలను సైతం ఎటాచ్ చేసింది.
ఇదిలావుండగా.. ఈ మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడం మీద సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, దీప్తి శర్మ ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ ఆమెను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే దీప్తి అలా ఎందుకు ఔట్ చేయాల్సి వచ్చిందో స్పష్టం చేసింది. చార్లీ డీన్ పదే పదే ముందుకెళ్లడంపై తాను చాలాసార్లు హెచ్చరించానని.. అయినా ఆమె పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో ఔట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఔట్ చేయడానికి ముందు అంపైర్లకు కూడా చెప్పామని పేర్కొంది. అయితే.. దీప్తి వ్యాఖ్యల్ని ఇంగ్లండ్ కెపటెన్ హీథర్ నైట్ ఖండించింది. మన్కడింగ్‌కు ముందు ఆ జట్టు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, తన చర్యని సమర్థించుకోవడం కోసం భారత్ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్‌పై భారీ జరిమానా, నిషేధం..
- ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
ఈ తరుణంలోనే మన భారత మాజీలు సైతం దీప్తి శర్మకి మద్దతుగా.. ఇంగ్లండ్‌కి కౌంటర్లు ఇచ్చారు. మన్కడింగ్ అనేది నిబంధనలకు విరుద్ధమేమీ కాదని, దీప్తి శర్మ నిబంధనల ప్రకారమే ఔట్ చేసిందని తెలిపారు. ఇక సెహ్వాగ్ అయితే ఎప్పట్లాగే స్పందిస్తూ.. గట్టి కౌంటరే ఇచ్చాడు. క్రికెట్ క్రీడను కొనుగొన్న ఇంగ్లండ్ జట్టు.. తాను పెట్టిన నిబంధనల్నే మరిచిపోయిందంటూ సెటైర్లు వేశాడు.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!