Site icon NTV Telugu

Charlie Dean: బాబోయ్.. జీవితంలో మరోసారి అలాంటి పని చేయను

Charlie Dean On Mankading

Charlie Dean On Mankading

Charlie Dean Reacts On Mankading Runout: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో చార్లీ డీన్‌ను భారత జట్టు మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడంపై ఎంత దుమారం రేగిందో అందరికీ తెలిసిందే! ఆ సంగతిని అటుంచితే.. ఈ రనౌట్‌పై చార్లీ డీన్ ఎట్టకేలకు స్పందించింది. ఇంకోసారి తాను క్రీజు వదిలి బయటకు వెళ్లనని, క్రీజులోనే ఉంటానంటూ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా రాసుకొచ్చింది. ‘‘ఈ వేసవికి ఇది ఆసక్తికర ముగింపు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జెర్సీలో ఆడటాన్ని నేను ఎనలేని గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి నేను నా క్రీజులోనే ఉంటానని అనుకుంటున్నా’’ అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కి ఆ మూడో వన్డే మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలను సైతం ఎటాచ్ చేసింది.

ఇదిలావుండగా.. ఈ మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడం మీద సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, దీప్తి శర్మ ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ ఆమెను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే దీప్తి అలా ఎందుకు ఔట్ చేయాల్సి వచ్చిందో స్పష్టం చేసింది. చార్లీ డీన్ పదే పదే ముందుకెళ్లడంపై తాను చాలాసార్లు హెచ్చరించానని.. అయినా ఆమె పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో ఔట్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఔట్ చేయడానికి ముందు అంపైర్లకు కూడా చెప్పామని పేర్కొంది. అయితే.. దీప్తి వ్యాఖ్యల్ని ఇంగ్లండ్ కెపటెన్ హీథర్ నైట్ ఖండించింది. మన్కడింగ్‌కు ముందు ఆ జట్టు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని, తన చర్యని సమర్థించుకోవడం కోసం భారత్ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేసింది.

ఈ తరుణంలోనే మన భారత మాజీలు సైతం దీప్తి శర్మకి మద్దతుగా.. ఇంగ్లండ్‌కి కౌంటర్లు ఇచ్చారు. మన్కడింగ్ అనేది నిబంధనలకు విరుద్ధమేమీ కాదని, దీప్తి శర్మ నిబంధనల ప్రకారమే ఔట్ చేసిందని తెలిపారు. ఇక సెహ్వాగ్ అయితే ఎప్పట్లాగే స్పందిస్తూ.. గట్టి కౌంటరే ఇచ్చాడు. క్రికెట్ క్రీడను కొనుగొన్న ఇంగ్లండ్ జట్టు.. తాను పెట్టిన నిబంధనల్నే మరిచిపోయిందంటూ సెటైర్లు వేశాడు.

Exit mobile version