NTV Telugu Site icon

CCL2023 : దంచికొట్టిన తమన్.. ఫైనల్ కు తెలుగు వారియర్స్..

Ccl

Ccl

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చివరి దశకు చేరుకుంది. శుక్రవారం సెమీ ఫైనల్స్ జరిగాయి. విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హోరహరీగా సాగాయి. రెండో సెమీ ఫైనల్ లో తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పైనల్ కు దూసుకెళ్లింది. తెలుగు వారియర్స్ కు అఖిల్ అక్కినేని సారథ్యం వహించారు. కర్ణాటక బుల్డొజర్స్ కు ప్రదీప్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

Also Read : Saturday Recitation: సంతాన సౌభాగ్యాలు చేకూరాలంటే ఈస్తోత్ర పారాయణం చేయండి

రెండో సెమీ ఫైనల్ లో కర్ణాటక జట్టు తొలి ఇన్సింగ్స్ లో పది ఓవర్లలో.. ఆరు వికెట్ల నష్టంతో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన తెలుగు వారియర్స్.. అదే ఆరు వికెట్ల నష్టంతో 95 పరుగులే చేసింది. దీంతో మూడు నాలుగు పరుగులు ఆధిక్యంతో సుదీప్ సేన నిలిచింది. తెలుగు వారియర్స్ బౌలర్ సామ్రాట్ మొదటి ఇన్సింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. రెండో ఇన్సింగ్స్ లో కర్ణాటక టీమ్.. 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేసి 103 పరుగుల లక్ష్యాన్ని ఛేధించారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లారు. రెండో ఇన్సింగ్స్ లో తమన్ ( 25 పరుగులు ) సాధించి ధనాధన్ ఆటతో మ్యాచ్ ను ముగించాడు.

Also Read : Akshay Kumar: షూటింగ్‌లో అపశృతి.. అక్షయ్ కుమార్‌కి గాయాలు

అంతకు ముందు భోజ్ పురి దబాంగ్స్, ముంబయి హీరోస్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక బంతి.. ఐదు పరుగులు చేయాల్సిన దశలో భోజ్ పురి దబాంగ్స్ జట్టు బ్యాటర్ ఆస్గర్ ఖాన్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. రెండో ఇన్సింగ్స్ ల్లో కలిపి ముంబయి హీరోస్ 171 పరుగులు చేయగా.. భోజ్ పురి దబాంగ్స్ జట్టు 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భోజ్ పురి దబాంగ్స్ విజయం సాధించింది. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్, భోజ్ పురి దబాంగ్స్ జట్లు తలపడతాయి.

Also Read : Parrot : యజమానిని చంపిన వాళ్లను పట్టించిన చిలుక.. తొమ్మిదేళ్ల తర్వాత ఇద్దరికి జీవిత ఖైదు

కొవిడ్ కారణంగా మూడేళ్ల వాయిదా పడిన సీసీఎల్.. రీలోడెడ్ పేరుతో ఈ ఏడాది సందడి చేస్తోంది. తెలుగు వారియర్స్, ముంబయి హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబాంగ్స్, పంజాబ్ దే షేర్స్, ఇలా ఎనిమిది టీమ్ లతో సెలబ్రిటీ లీగ్ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ -2023కి వచ్చిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని సీసీఎల్ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఇందూరి అన్నారు. ఈ సీజన్ లో ప్రతి జట్టుకు 10 ఓవర్ల చొప్పున 2 ఇన్సింగ్స్ లతో కూడి టీ20 ఫార్మాట్ నిర్వహించాం.. దాంతో వారు మరింత వినోదాన్ని అందించారు.. ఫైనల్స్ లో అంతకు మించిన పన్ ఉంటుందని. మరి ఈసారి విజేత ఎవరో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే అని మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఇందూరి వెల్లడించారు.