బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రానాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు మందలించారు. అయితే ఆ తప్పు ఏంటన్నది మ్యాచ్ రిఫరీ వెల్లడించలేదు. నితీష్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు. లేకుంటే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడేది.
మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. అతడు కూడా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో మందలింపుతో వదిలేశారు. బుమ్రాకు ఎలాంటి జరిమానా విధించలేదు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం బుమ్రా, నితీష్ రానా మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయో బబుల్ నిబంధనలను బ్రేక్ చేశారా అనే సందేహం కూడా కలుగుతోంది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఇరు జట్ల నిర్వాహకులు సదరు ఆటగాళ్లు చేసిన తప్పిదంపై అధికారికంగా వెల్లడించలేదు.
