Puja Tomar : అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత్ ఫైటర్ పూజా తోమర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puja Tomar : భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. బ్రెజిల్ లోని లూయిస్విల్లే వేదికగా జరిగిన గేమ్‌లో ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ప్రత్యర్ధిపై 30-27 స్కోర్‌తో పూజా పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్లో అమండా శాంటోస్.. పూజాను సమర్ధంగా ఎదుర్కొని 27-30 పాయింట్లతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చింది. మూడో రౌండ్లో హోరాహోరీగా తలపడిన ఇద్దరు.. ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి వరుస కిక్‌లతో అమండాను వెనక్కి నెట్టింది. దీంతో మూడో రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న ఆమె యూఎఫ్‌సీ చాంపియన్‌గా నిలిచింది.
Also Read; IND vs PAK Clash: న్యూయార్క్‌లో బేస్ బాల్ ఆడేస్తున్న సచిన్, రవిశాస్త్రి.. వీడియో
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
- Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
గేమ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. చాలా గర్వంగా ఉందని చెప్పింది. గెలుస్తాననే నమ్మకంతో తాను ఇక్కడి వచ్చానని తెలిపింది. చాలా కష్టపడినందువల్లే తాను ఈ స్థాయికి చేరానని వెల్లడించింది. ప్రేక్షకులు తనకు మద్దతుగా నిలిచారని 28 ఏండ్ల పూజా పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించిన పూజా.. చైనీస్ యుద్ధ కళ అయిన వుషుతో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశించింది.
HISTORY CREATED BY PUJA TOMAR. 🇮🇳
– She becomes the first ever Indian woman to win the UFC match. pic.twitter.com/j4PkN04z8k
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!