Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..

Ben Stoke

Ben Stoke

ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్‌కు సంబంధించిన తాజా విజువల్స్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మైదానంలో ఎప్పుడూ సింహంలా గర్జిస్తూ, అసాధ్యమైన మ్యాచ్‌లను సైతం ఒంటిచేత్తో గెలిపించే ఈ స్టార్ క్రికెటర్.. ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించడం అభిమానుల గుండెలను పిండేస్తోంది.

నెట్ ప్రాక్టీస్‌లో ఊహించని ప్రమాదం..
ఈ ఏడాది (2026) ఫిబ్రవరి మాసంలో బెన్ స్టోక్స్ ఒక ప్రమాదానికి గురయ్యారు. ఇంగ్లాండ్ జట్టు నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుండగా.. ఒక బంతి నేరుగా వచ్చి ఆయన ముఖానికి బలంగా తాకింది. ఈ ప్రమాదంలో స్టోక్స్ దవడ ఎముక తీవ్రంగా విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. ఈ మేజర్ సర్జరీ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు బెన్ స్టోక్స్ బాహ్య ప్రపంచానికి, మీడియాకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే.. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ కోసం మీడియా ముందుకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సర్జరీల ప్రభావం వల్ల ఎప్పుడూ ఎంతో ఫిట్‌గా, ఆకర్షణీయంగా ఉండే స్టోక్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖంలో పూర్వపు కాంతి తగ్గి, వృద్ధుడిలా ఆయన దర్శనమిచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

×
×
Ad

క్రికెట్ భవిష్యత్తుపై అభిమానుల ఆందోళన..
బెన్ స్టోక్స్ కొత్త అవతారాన్ని చూసిన కొందరు క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఆయన కెరీర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఇంతటి నరకయాతన అనుభవించిన తర్వాత ఆయన మళ్లీ పాత ఫిట్‌నెస్‌ సాధించి క్రికెట్ ఆడటం అంత సులువు కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, మెజారిటీ అభిమానులు మాత్రం “గాయం నీ రూపాన్ని మార్చవచ్చు కానీ, నీలోని పోరాట పటిమను కాదు” అంటూ ఆయనకు అండగా నిలుస్తున్నారు.

జోఫ్రా ఆర్చర్‌కు మద్దతుగా స్టోక్స్ కౌంటర్..
ఇదిలా ఉంటే, ముఖం దెబ్బతిన్నా తనలోని దూకుడు తగ్గలేదని స్టోక్స్ నిరూపించారు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరమవ్వడంపై ఇంగ్లాండ్ మాజీలు విమర్శలు గుప్పించారు. దేశం కంటే ఐపీఎల్ ఎక్కువైందా అంటూ ప్రశ్నించారు. దీనిపై బెన్ స్టోక్స్ ఘాటుగా స్పందించారు. “రెండు నెలల పాటు ఐపీఎల్‌లో కష్టపడిన ఆర్చర్‌కు విశ్రాంతి చాలా అవసరం. రెస్ట్ లేకుండా టెస్టులు ఆడితే మళ్లీ గాయపడతాడు. దేశం కోసం ఆడనని అతడు తెగేసి చెబితే మీరేం చేస్తారు?” అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహచర ఆటగాడికి మద్దతుగా నిలిచిన స్టోక్స్, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.