Site icon NTV Telugu

ఐపీఎల్ 2022 కోసం మెగా ఆక్షన్ జరిగేనా…?

ఐపీఎల్‌ 2022 ను ఎనిమిది జట్లతో కాకుండా 10 జట్లతో నిర్వహిస్తామని ఈ ఏడాది ఆరంభంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే 14వ సీజన్‌ ముగిశాక వీటి కోసం టెండర్లు పిలవాలని భావించారు. కానీ తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన మెగా ఆటగాళ్ల వేలం కూడా ఉండకపోవచ్చని, ఈ ఏడాది జరిగిన మినీ వేలం లాంటిదే నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2021 సగం మ్యాచ్‌ల తర్వాత అర్ధంతరంగా లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ దృష్టంతా మిగిలిన సీజన్‌ను ఎలా నిర్వహించాలనే దానిపైనే ఉన్నట్టు సమాచారం. ‘కొత్త జట్ల చేరికపై ప్రస్తుతం బీసీసీఐ ఎలాంటి ఆలోచన చేయడం లేదు. జూలై వరకైతే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు” అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

Exit mobile version