NTV Telugu Site icon

Womens IPL: విమెన్స్ ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి 600 కోట్లు!

For Starters The Biggest Challenge For Women S Ip 1674156828035

For Starters The Biggest Challenge For Women S Ip 1674156828035

గత 15 ఏళ్లుగా క్రికెట్​ అభిమానులను ఊర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అలాగే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా క్యూ కడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ మెగా లీగ్​ కారణంగా రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెటే ఆగిపోతుందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లను ప్రవేశపెట్టి వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకున్న బీసీసీఐ.. ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్​ను (డబ్ల్యూఐపీఎల్‌) నిర్వహించి తమ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసుకోబోతుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న విమెన్స్ ఐపీఎల్‌ కోసం ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తొలి ఏడాది ఐదు జట్లతో ఈ లీగ్‌ను ప్రారంభించనుంది. ఈ మహిళల జట్లను కొనుగోలు చేసేందుకు బడా కంపెనీలు కూడా ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే దీనికి సంబంధించి ఐదు టెండర్లను ఆహ్వానించింది బీసీసీఐ. దాదాపు 30కు పైగా అగ్ర శ్రేణి కంపెనీలు టెండర్ల దరఖాస్తులను కొనుగోలు చేశాయి. ఇందులో మెన్స్ ఐపీఎల్‌ జట్లను కొనుగోలు చేసిన 10 కంపెనీలతో పాటు ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, భారత స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్ కూడా పోటీలో ఉన్నాయి. 25వ తేదీన ఫ్రాంచైజీ విజేతల్ని ప్రకటించనున్నారు.

Sunil Gavaskar : అలా చేస్తే టీమిండియా వరల్డ్‌కప్ గెలవలేదు: గవాస్కర్

అయితే, తాజా సమాచారం ప్రకారం విమెన్స్ ఐపీఎల్‌ ఒక్కో జట్టు దాదాపు రూ.600 కోట్లు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేవేళ ఈ రేంజ్​లో ఒక్కో జట్టు ధర పలికితే.. మొత్తంగా మరో నాలుగు వేల కోట్ల వరకు బీసీసీఐ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. ఇదే విషయమై మాట్లాడుతూ “విమెన్స్ ఐపీఎల్‌కు మంచి ఆదరణ రాబోతుంది. ఈ బిడ్స్​ ద్వారా ఒక్కో జట్టు రూ.500 నుంచి రూ.800కోట్ల వరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది” అని ఇంతకుముందు పురుషులు ఐపీఎల్​ బిడ్స్ టీమ్​లో పని చేసిన ఓ అధికారి తెలిపారు. కాగా, ఐపీఎల్‌ ప్రసార (మీడియా) హక్కుల్ని వయాకామ్‌ 18 సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి గాను రూ.951 కోట్లకు ప్రసార హక్కులు వయాకామ్‌ 18 చేతికి చిక్కినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఒక్కో మ్యాచ్‌కు వయాకామ్‌.. రూ.7.09 కోట్లు చెల్లించనున్నట్లు బోర్డు పేర్కొంది. ఇక విమెన్స్ ఐపీఎల్‌లో గెలిచిన జట్టుకు బీసీసీఐ నుంచి రూ. 28.08 కోట్లు దక్కుతుందని సమాచారం. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.27.20 కోట్లు, ఆ తర్వాత స్థానాల్లో రూ.26.33 కోట్లు, రూ.25.45 కోట్లు, రూ.24.57 కోట్లు లభిస్తాయి. అయితే ఇది 2027 వరకు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది.

Show comments