ఇప్పుడు ఎక్కడా చూసినా.. చిన్న నుంచి పెద్ద వరకు.. సందర్భం ఏదైనా కావొచ్చు తగ్గేదే లే అంటూ డైలాగ్ వదులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మధ్యే విడుదల పుష్ఫ సినిమా ఎఫెక్టే.. కథ, కథనం, మాటలు, పాటలు, డైలాగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ మాత్రం అందరి నోళ్లలో నానుతోంది.. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అన్నట్టు అంతా పుష్ప మేనియాలో పడిపోయారు..
ఇక, ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు కూడా ఈ డైలాగ్‌కు ఫిదా అయిపోయి.. తాము కూడా ఆ డైలాగ్ చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా సహా మరికొందరు టీమిండియా క్రికెటర్లు కూడా ఈ మేనియాలో పడిపోయారు.. ఇప్పుడు ‘పుష్ప’ మేనియా బంగ్లాదేశ్ క్రికెటర్లను కూడా తాకేసింది.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో సిల్‌హెట్ సన్‌రైజర్స్ బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ వేసిన బాల్‌ను సిక్సర్‌గా మలిచేందేరకు ప్రయత్నించాడు ప్రత్యర్థి బ్యాటర్.. కానీ, డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డర్ చేతికి చిక్కాడు. అది చూసిన నజ్ముల్‌లో జోష్ కనిపించింది.. వికెట్ తీసిన ఆనందంలో పుష్ప స్టైల్‌లో తగ్గేదే లే అంటూ.. తల కింది నుంచి చెయ్యిని అలా తిప్పేశాడు.. అయితే, ఇప్పుడా వీడియో సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తోంది.. దీంతో.. బన్నీ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.