భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే పీవీ సింధు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఈ ఏడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సింధుకు 2015లో పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 119 పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఏడు పద్మ విభూషణ్ అవార్డులు ఉండగా… పది పద్మభూషణ్, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
పద్మ భూషణ్ అందుకున్న పీవీ సింధు…
