Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!

  • బాబర్ వన్డే జట్టుపై సోషల్ మీడియాలో రచ్చ
  • తన జట్టులో దిగ్గజ టీమిండియా ప్లేయర్స్ చోటు కల్పించని బాబర్
Babar Azam

Babar Azam

Babar Azam: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం తాజాగా ఎంపిక చేసిన తన కలల వన్డే జట్టు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

బాబర్ ఎంపిక చేసిన జట్టు ఇదే..
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (ఓపెనర్లు), దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్, కగిసో రబాడ, న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్, పాకిస్థాన్: షాహీన్ అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, ఆఫ్ఘనిస్థాన్: రషీద్ ఖాన్

ఈ జట్టుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బాబర్‌ను ఓ రేంజ్‌లో ఆట ఆడుకుంటున్నారు. “విరాట్ కోహ్లీ లేకుండా వన్డే జట్టును ఊహించలేం” అంటూ చివరకు పాక్ అభిమానులు కూడా బాబర్‌ను విమర్శిస్తుండటం గమనార్హం. ఈ జట్టులో ఇండియా నుంచి ఏ క్రికెటర్ కూడా లేడు.

ఫైనల్లో హైదరాబాద్ కింగ్స్‌తో పెషావర్ జల్మీ ఢీ!
మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జల్మీ, హైదరాబాద్ కింగ్స్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఈ లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచిన పెషావర్ జల్మీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన హైదరాబాద్ కింగ్స్, తిరిగి అద్భుత రీతిలో పుంజుకుంది. ఎలిమినేటర్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను, క్వాలిఫైయర్-2లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.