టీమిండియా ఓపెనర్ కమ్… కీపర్ కేఎల్ రాహుల్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఓపెనర్ గా అయినా… మిడిల్ ఆర్డర్ లోనైనా…ధాటిగా ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ రాహుల్. నిన్న స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ తో ఆదరిగొట్టాడు కేఎల్ రాహుల్. ఇది ఇలా ఉండగా.. తాజాగా తన లవర్ ను రివీల్ చేశాడు కేఎల్ రాహుల్.
గత కొన్ని రోజులగా డేటింగ్ చేస్తున్న రాహుల్, అతియాశేట్టవిలు తాము ప్రేమించుకుంటున్నామని నిన్న అఫిషీయల్ గా వెల్లడించారు. అతియాశేట్టి బర్త్ డే నిన్న జరిగిన నేపథ్యంలో… ఆమెతో కొనసాగిస్తున్న ప్రేమాయాణం గురించి… ఒక్కపోస్ట్ ద్వారా చేప్పేశాడు రాహుల్. రాహుల్ తన లేడీ లవ్ కు హార్ట్ ఎమోజీతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శేట్టి కుమార్తెనే ఈ అతియా శేట్టి. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారని సమాచారం అందుతోంది.
