Site icon NTV Telugu

Boycott IND vs PAK: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్లోకి బాయ్‌కాట్ భారత్- పాక్ మ్యాచ్

Boycot

Boycot

Boycott IND vs PAK: ఆసియా కప్‌ 2025లో భాగంగా ఇవాళ ( సెప్టెంబర్ 14న) భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో మ్యాచ్ ఆడొద్దని భారత ఫాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. బాయ్‌కాట్ ఆసియా కప్‌ 2025, బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్‌ మ్యాచ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు ఆడుతున్నామని బీసీసీఐ చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ లో ‘బాయ్‌కాట్ ఆసియా కప్‌’ అని ట్రెండింగ్ లోకి వచ్చింది.

Read Also: INDIA vs PAK : మ్యాచ్ పై IFTDA చీఫ్ ఆగ్రహం.. ప్రధాని మోడీకి ఈ విజ్ఞప్తి

ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు భారత్- పాకిస్థాన్ మ్యాచ్ పై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ ​కు బోర్డు పెద్దలు ఒక వ్యక్తిని మాత్రమే భారత ప్రతినిధిగా పంపినట్లు సమాచారం. బీసీసీఐ నుంచి కేవలం ఒకరే దుబాయ్‌కు వెళ్లారు, మిగిలిన వారెవరూ రాలేదని జాతీయ మీడియా కోడైకూసింది. అయితే, ఏ టోర్నమెంట్ అయినా భారత్- పాక్ మ్యాచ్ అంటే ఫుల్ హైప్ నెలకుంటుంది. కానీ, ఈసారి ఈ మ్యాచ్ మాత్రం​ కాంట్రవర్సీ అవుతోంది. కొంతమంది ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటే, మరికొందరు బాయ్ కట్ చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇలా వివాదాల మధ్యే మ్యాచ్ జరిగేలా కనిపిస్తుంది. ఇంకా, ఆపరేషన్ సింధూర్​ తర్వాత పాక్ తో భారత్ ఈరోజు​తొలిసారి తలపడుతుండం ఆసక్తి రేపుతుంది. అలాగే, పాక్ ప్లేయర్స్ తో ‘నో షేక్ హ్యాండ్’ కూడా ట్రెండ్ అవుతుంది. అంటే, మ్యాచ్​ తర్వాత వాళ్లతో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయరని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. మరి మ్యాచ్ లో ఏం జరగనుందో చూడాలి!

Exit mobile version