Site icon NTV Telugu

Ajinkya Rahane: టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడు.. ఆసియా కప్ మనదే!

Rahane

Rahane

Ajinkya Rahane: ఆసియాకప్‌ -2025 కోసం టీమిండియా సన్నాహాకాలను స్టార్ట్ చేసింది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న సూర్య సేన ఇవాళ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనింది. మరో 3 రోజుల పాటు ఐసీసీ అకాడమీలో ఏర్పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో భారత ప్లేయర్లు శ్రమించనున్నారు. అయితే, టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడబోతుంది. ఈ నేపథ్యంలో వెటరన్ ఆటగాడు అజింక్య రహానే మాట్లాడుతూ.. భారత జట్టు తరపున అక్షర్ పటేల్ అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, అతడికి తగినంత గుర్తింపు రాలేదన్నాడు. ఇక, అక్షర్ ఒక అండర్‌రేటెడ్‌ ప్లేయర్.. గత మూడేళ్లలో ఒక క్రికెటర్‌గా అతడు చాలా మెరుగుపడ్డాడు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చాలా అద్బుతంగా ఆడుతున్నాడు.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటర్‌గా, బౌలర్‌గా తన మార్క్‌ను చూపిస్తున్నాడని రహానే పేర్కొన్నారు.

Read Also: Little Hearts : లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్

ఇక, పవర్ ప్లేలో కొత్త బాల్ తో బౌలింగ్ చేసే సత్తా కూడా అక్షర్‌ పటేల్ కు ఉంది అని అజింక్య రహానే తెలిపారు. మిడిల్ ఫేజ్‌లో కూడా బౌలింగ్ చేస్తాడు.. అవసరమైతే డెత్ ఓవర్లలో బంతితో మ్యాజిక్ చేయగలడు. అక్షర్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే కెప్టెన్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అక్షర్ ఫీల్డింగ్‌లో కూడా అద్భుతాలు సృష్టిస్తాడు.. ఆసియాకప్ దుబాయ్‌లో జరగబోతుంది.. అక్కడి పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయి.. కాబట్టి అక్షర్ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడని ఓ యూట్యూబ్ ఛానల్‌లో రహానే వెల్లడించాడు. అయితే, ఆసియాకప్‌కు ఎంపిక చేసిన జట్టులో అక్షర్ సభ్యుడు.. కానీ, టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి మాత్రం పటేల్‌ను బీసీసీఐ తప్పించింది. అతడి ప్లేస్ లో శుబ్‌మన్ గిల్‌కు బాధ్యతలను అప్పగించింది.

Exit mobile version