NTV Telugu Site icon

ఫ్రీ హిట్ లాగే ఫ్రీ బాల్ ఇవ్వాలి : అశ్విన్

బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ ఇచ్చినట్లే.. బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశాడు. వివాదాస్పద కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌.. కొన్ని నిబంధనలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. అందులో ఫ్రీ హిట్ ఒక్కటని, దాన్ని రద్దు చేయాలనీ అభిప్రాయపడ్డాడు. అలాగే దీని పై తమ తమ అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ వేదికగా క్రికెటర్లను, విశ్లేషకులను కోరాడు. దీనిపై స్పందించిన అశ్విన్.. ఫ్రీబాల్ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. అందులో ‘సంజయ్‌, ఫ్రీహిట్‌ అనేది గొప్ప మార్కెటింగ్‌ టూల్‌. అభిమానులు దానికి ఆకర్షితులయ్యారు. అందుకే నాన్‌స్ట్రైకర్‌ బంతి వేయక ముందే క్రీజు దాటిన ప్రతిసారీ ఫ్రీ బాల్‌ ఇవ్వాలి. ఆ బంతికి వికెట్‌ రావాలి లేదా పది పరుగులను స్కోరు నుంచి తీసేయాలి’ అని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ‘ బంతి చేతుల్లోంచి వదిలాకే నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటాలి’అని మరో ట్వీట్ చేశాడు. దాంతో ఈ ఫ్రీ బాల్ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.