Site icon NTV Telugu

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 44 ఏళ్ల తర్వాత సంచలనం సృష్టించిన బార్టీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన ఆప్లే బార్టీ నిలిచింది. శనివారం మధ్యాహ్నం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అమెరికన్ ప్లేయర్ కొలిన్స్‌పై 6-3, 7-6 తేడాతో బార్టీ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత కొలిన్స్ ఓ బ్రేక్ పాయింట్ సాధించినా.. ఆ తర్వాత బార్టీ ఆధిపత్యం మొదలైంది. ఓ దశలో 1-5 తేడాతో వెనుకబడ్డ బార్టీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం వైపు అడుగులు వేసింది.

Read Also: అంపైర్‌పై ఆగ్రహం.. టెన్నిస్ ఆటగాడికి భారీ జరిమానా

సొంత గడ్డ కావడం, ప్రేక్షకుల మద్దతు లభించడం ఆప్లే బార్టీకి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. వరుస బ్రేక్ పాయింట్లతో కొలిన్స్ దూకుడుకు కళ్లెం వేసింది. తొలి సెట్‌ను 5-5తో ముగించడంతో ట్రై బ్రేకర్‌లో 6-3 తేడాతో సత్తా చాటింది. ఇక రెండో సెట్‌ను 7-6 తేడాతో బార్టీ కైవసం చేసుకుని మరో సెట్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. కాగా 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కడం విశేషం. చివరిసారిగా 1978లో ఆస్ట్రేలియా ప్లేయర్ క్రిస్టినా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది.

Exit mobile version