Site icon NTV Telugu

Sunrisers Hyderabad: హ్యారీ బ్రూక్‌ని తొలగించి.. అతనికి అవకాశం ఇవ్వండి

Harry Brook Pakkana

Harry Brook Pakkana

Akash Chopra Suggests SRH To Give Chance Glenn Philips: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోని అత్యంత ఖరీదైన ఆటగాడు.. ఒక్క సెంచరీ మినహాయిస్తే, మరే గొప్ప ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. క్రీజులోకి ఇలా అడుగుపెట్టి, అలా వెళ్లిపోతున్నాడే తప్ప.. జట్టుకి అతని వల్ల పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. మొదట్లో కనీసం 10-15 పరుగులైనా చేసే బ్రూక్.. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆడుతున్నాడు. ఒకట్రెండు పరుగులు చేయడం కూడా గగనం అయిపోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెంచరీ చేసినప్పుడు గొప్ప మాటలు మాట్లాడి, ఇప్పుడు ఇంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నావేంటి? అంటూ ఏకిపారేస్తున్నారు. మాటలు కాదు, చేతల్లో చేసి చూపించాలంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. అంతేకాదు.. అతడ్ని తొలగించి, మరో మంచి ప్లేయర్‌ని రంగంలోకి దింపాలని కోరుతున్నారు.

Adah Sharma: ఆ వివాదం ఏమో కానీ.. ఈ చిన్నదానికి ఇన్నాళ్లకు స్టార్ డమ్ వచ్చింది

తాజాగా భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. వరుసగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్‌ని జట్టులో నుంచి తొలగించి, అతని స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్‌కు ఉన్న మ్యాచ్‌కు ముందు అతడు ఈ సూచన ఇచ్చాడు. ‘‘రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోతే, ఈ సీజన్‌లో హైదరాబాద్ కథ ఇక పూర్తిగా ముగిసినట్లే. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ ఉన్న పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడం దాదాపు చాలా కష్టం. హైదరాబాద్ జట్టులో చాలా లోపాలున్నాయి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కూడా కొన్ని సమస్యలున్నాయి. హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది. అతడి స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‌కు అవకాశం ఇవ్వాలి. అదే విధంగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మను ఓపెనర్లుగా కొనసాగించాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి, ఇతని సూచన మేరకు గ్లెన్ ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇస్తారా? లేక హ్యారీ బ్రూక్‌నే కొనసాగిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Unemployement: అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిన టాప్-10 దేశాలు

Exit mobile version