Akash Chopra On Virat Kohli: ఆసియా కప్‌లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీతో కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. కానీ, టెస్టుల్లో అతడు సెంచరీ సాధించి 1000 రోజులపైనే అవుతోంది. దీంతో.. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో సత్తా చాటాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఈసారి శతకం చేయాలని గట్టిగా కసరత్తు చేస్తున్నాడు. నాగ్‌పూర్‌లోని ఓల్డ్ విదర్భ క్రికెట్ ఆసోషియషన్ గ్రౌండ్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. అటు అభిమానులు కూడా ఈసారి కోహ్లీ శతక్కొట్టడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు.
NTR: ఇది అసలు ఊహించని సినిమా అవుతుంది…
ఈ నేపథ్యంలోనే కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే కోహ్లి చెలరేగిపోతాడని, ఈ టెస్టు సిరీస్‌లో అతడు కనీసం రెండు సెంచరీలైనా సాధిస్తాడని అభిప్రాయపడ్డాడు. ‘‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడూ తీవ్రమైన పోటీనే ఉంటుంది. ఇదొక చారిత్రత్మక సిరీస్ కాబట్టి, ఇందులో కోహ్లీ పరుగుల వర్షం కురిపించడం తప్పనిసరి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. గతంలోనూ అతడు ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లోనూ అతడు విరుచుకుపడతాడని నమ్ముతున్నాను. ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లి కనీసం రెండు సెంచరీలైనా చేస్తాడు’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
Sajjala Ramakrishna: రాష్ట్రాభివృద్ధికి.. మూడు రాజధానులే మార్గం
అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తాను ఒక విషయం గమనించానని, స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కోహ్లీ కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించిందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. బంగ్లా సిరీస్‌లో స్పిన్నర్ తైజుల్ ఇస్లాంకు కోహ్లీ రెండు సార్లు తన వికెట్ సమర్పించుకున్నాడని గుర్తు చేశాడు. రీసెంట్‌గానే న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ.. స్పిన్‌లోనే కోహ్లీ తన వికెట్‌ని కోల్పోయాడన్నాడు. కాబట్టి.. స్పిన్నర్లపై కోహ్లీ దృష్టిపెడితే చాలు అని చోప్రా సూచించాడు.