Akash Chopra On Mayank Agarwal SRH Captaincy: ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అతడ్ని కెప్టెన్‌గా నియమించాలని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఆ జట్టుకి కెప్టెన్ లేకపోవడం, మయాంక్‌కి ఆల్రెడీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉండటంతో.. అతడినే కెప్టెన్ చేయాలని ఎస్ఆర్‌హెచ్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. అతడ్ని కెప్టెన్ చేయొద్దంటూ తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బాంబ్ పేల్చాడు. ఒకవేళ అతడ్ని కెప్టెన్ చేస్తే, ఆ ఒత్తిడికి అతడు సరిగ్గా ఆడలేడని అతని అభిప్రాయం. మయాంక్‌ని కాకుండా భువనేశ్వర్ కుమార్‌ని కెప్టెన్ చేస్తే, బాగుంటుందని సూచిస్తున్నాడు.
Waltair Veerayya: ఆ తప్పు రిపీట్ చెయ్యకూడదనే మైత్రీ ఆ నిర్ణయం తీసుకుందా?
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘మయాంక్ ఒక గొప్ప ఆటగాడు. అతడు చాలా ఆడతాడు. కానీ.. అతడు కెప్టెన్‌గా ఉన్న సీజన్‌లో మాత్రం పరుగులు సాధించలేదు. కెప్టెన్సీ అనే బాధ్యత అతనిపై ఒత్తిడిని పెంచి, పరుగులు చేయనివ్వకుండా చేసింది. కాబట్టి, ఈసారి అతడ్ని కెప్టెన్ చేయొద్దు. ఒకవేళ కెప్టెన్ చేస్తే మాత్రం, అతడు ఆ ఒత్తిడికి పరుగులు చేయలేక, మునుపటిలాగే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచే అవకాశం ఉంది. మయాంక్‌కి బదులు భువనేశ్వర్ కుమార్‌ని కెప్టెన్ చేయాలి. మయాంక్ కేవలం ఒక ఆప్షన్ మాత్రమే’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఆకాశ్ చోప్రా చెప్పినట్లుగా గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మయాంక్ పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. మరోవైపు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం.. ఏరికోరి మరీ మినీ వేలంలో మయాంక్‌తో పాటు హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు)లను భారీ రేట్లకు కొనుగోలు చేసింది. మరి, ఈసారి సన్‌రైజర్స్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
CM Stalin: ‘రాహుల్ ప్రసంగం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది’ : జోడో యాత్రపై స్టాలిన్ ప్రశంసలు