Site icon NTV Telugu

IND vs AFG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్.. భారత్ బ్యాటింగ్

Ind Vs Afg

Ind Vs Afg

IND vs AFG: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరుగుతోన్న ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి, కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశాలను కోల్పోయిన ఇరు జట్లు గౌరవప్రదంగా ఆడనున్నాయి. భారత్‌, ఆఫ్ఘనిస్తాన్ తమ రెండు సూపర్ 4 మ్యాచ్‌లలో పాకిస్తాన్, శ్రీలంకతో ఓడిపోయాయి. ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయమే లక్ష్యంగా ఇరుజట్లు తలపడుతున్నాయి.

Asia Cup 2022: ఆసియా కప్ జట్టులో అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్‌

భారత జట్టు: కేఎల్ రాహుల్ (సి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ(సి), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ ఎఫ్.

Exit mobile version