NTV Telugu Site icon

ఐదో టెస్టు రీషెడ్యూల్: ఇంగ్లాండ్‌కు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన చివ‌రి టెస్ట్‌ను (ఈసీబీ ) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఈ చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు భారత జట్టు ఫిజియోకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే మరిన్ని కరోనా కేసులు నమోదు అవుతాయోనన్న అనుమానంతో మ్యాచ్ రద్దు చేశారు. మరోవైపు మ్యాచ్ రద్దు ప్రకటన చేసే క్రమంలో హైడ్రామా నెలకొంది. మొదట వాయిదా అని ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, సిరీస్ ఫలితంపై మాత్రం రెండు దేశాల బోర్డుల మధ్య దోబుచులాట చోటుచేసుకుంది.

ఇప్పటి వరకు 2-1 తేడాతో ఈసిరీస్‌లో కోహ్లీసేన ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే రద్దయిన మ్యాచ్‌ మళ్లీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఫలితంపై సందిగ్ధం నెలకొంది. అయితే, ఈ నెల 22న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. చివరి టెస్ట్ మ్యాచ్ రీషెడ్యూల్‌పై ఈసీబీతో సౌరవ్ చర్చించనున్నారు..ఈ టెస్టు మ్యాచ్ రద్దుతో ఈసీబీకి భారీగా నష్టం కలిగింది.