NTV Telugu Site icon

Special Story on Ambani’s Solid Legacy: కొనసాగుతున్న ధీరుభాయ్‌ అంబానీ దీటైన వారసత్వం

Special Story On Ambani's Solid Legacy

Special Story On Ambani's Solid Legacy

Special Story on Ambani’s Solid Legacy: మన దేశంలో అంబానీ పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా సైతం ఇది సుపరిచితమే. ఈ బ్రాండ్‌ నేమ్‌ రీసెంట్‌గా మరోసారి వరల్డ్‌వైడ్‌గా వార్తల్లో నిలిచింది. ఇండియాలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ ప్రపంచంలోని 100 మంది ఎమర్జింగ్‌ లీడర్లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒన్‌ అండ్‌ ఓన్లీ ఇండియన్‌ ఈయనే కావటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ వారం మన డిఫైనింగ్‌ పర్సనాలిటీ ఆకాశ్‌ అంబానీ సక్సెస్‌ స్టోరీపై స్పెషల్‌ ఫోకస్‌..

సర్‌నేమ్‌ చెబితే చాలు..

కొందరి విషయంలో.. సర్‌నేమ్‌ చెబితే సర్వం చెప్పినట్లే. ఎందుకంటే అది వాళ్ల ఘనమైన వారసత్వాన్ని చాటుతుంది. అలాంటివారిలో ఆకాశ్‌ అంబానీ కూడా ఒకరు. ఇండియన్‌ ప్రైవేట్‌ రంగంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడే ఆకాశ్‌ అంబానీ. 1991 అక్టోబర్‌ 23న జన్మించిన ఆయన.. ముంబైలోని ఛాంపియన్‌ స్కూలు మరియు తన తాత ధీరూభాయ్‌ అంబానీ పేరిట ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ చదివిన ఆకాశ్‌ అంబానీ.. అక్కడి నుంచి వచ్చాక తండ్రి బిజినెస్‌ అయిన రిలయెన్స్‌ జియో ఇన్ఫోకామ్‌లో ఇంటర్న్‌గా జాయిన్‌ అయ్యారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన నాలుగు రోజులకే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం చెప్పుకోదగ్గ విషయం.

60 మందితో మొదలై.. అతిపెద్ద సంస్థగా..

రిలయెన్స్‌ జియోఇన్ఫోకామ్‌ అనేది మొదట్లో 60 మంది సభ్యులతో ఒక స్టార్టప్‌ టీమ్‌. అదే ఆ తర్వాత జియోగా ఎదిగింది. ఆకాశ్‌ అంబానీ ప్రస్తుత వయసు 30 ఏళ్లు. 2014లో 22 ఏళ్ల వయసులోనే రిలయెన్స్‌ రిటైల్‌ మరియు జియో కంపెనీ బోర్డులో చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2015 డిసెంబర్‌లో తన సోదరి ఇషా అంబానీతో కలిసి జియో 4జీ సర్వీసులను ప్రారంభించారు. 2016లో జియో ఇన్ఫోకామ్‌.. జియోని ప్రారంభించింది. తర్వాత అది దేశంలోనే అతిపెద్ద టెలీకమ్యూనికేషన్స్‌ కంపెనీగా ఎదిగింది. ఈ ఘనత సాధించటంలో ఆకాశ్‌ అంబానీ కీలక పాత్ర పోషించారు. ఈ మేరకు ఆయన వివిధ స్ట్రాటజీలను అమలుచేశారు. ఆకాశ్‌ అంబానీ తొలిసారి 2018లో ఇండియా డిజిటల్‌ ఓపెన్‌ సమ్మిట్‌లో ప్రసంగించారు.

‘‘టైమ్స్’’ స్టార్ట్స్‌ నౌ

ఈ ఏడాది జూన్‌లో రిలయెన్స్‌ జియో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆకాశ్‌ అంబానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సంస్థను నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌, ఎంటర్టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌, పాలిటిక్స్‌, హెల్త్‌, సైన్స్‌, సొషల్‌ సర్వీస్‌ రంగాల్లోని వంద మంది వర్ధమాన నాయకులతో టైమ్స్‌ హండ్రెడ్‌ నెక్‌స్ట్‌ పేరిట జాబితాను రూపొందించగా అందులో మన దేశం నుంచి ఆకాశ్‌ అంబానీ ఒక్కరే ఉండటం దేశదేశాల దృష్టిని ఆకర్షించింది. ఆకాశ్‌ అంబానీ.. గూగుల్‌ మరియు ఫేస్‌బుక్‌ వంటి సంస్థల నుంచి మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రాబట్టడంలో ముఖ్య పాత్ర పోషించారని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. రిలయెన్స్‌ జియోని ఆకాశ్‌ అంబానీ ఇదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లగలిగితే తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలోని మరిన్ని సంస్థల పాలనా పగ్గాలు ఆయన చేతికి అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది.

ఎంత సంపన్నుడో?..

ఆకాశ్‌ అంబానీకి ఒకానొక దశలో అంటే లెవెన్త్‌ స్టాండర్డ్‌ చదువుతుండగా తన ఫ్యామిలీకి మొత్తం ఎంత సంపద ఉందో కూడా ఆయనకు తెలియదంటే ఆశ్చర్యం కలుగుతుంది. బిజినెస్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ కోర్సు కోసం రిలయెన్స్‌ సంస్థ గురించి ఒక వ్యాసం రాస్తుండగా ఆకాశ్‌ అంబానీకి ఈ సందేహం కలిగింది. ఈ ఏడాది రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ యాన్యువల్‌ జనరల్‌ మీటింగ్‌లో ఆకాశ్‌ అంబానీ మాట్లాడుతూ జియోఫైబర్‌ మరియు వర్చువల్‌ పీసీలను లాంఛ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదే 5జీ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. ఆకాశ్‌ అంబానీ.. జియో 4జీని పూర్తిగా డిజిటల్‌ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చేయటంలో డ్రైవింగ్‌ ఫోర్స్‌లా వ్యవహరించారు. గత కొన్నేళ్లుగా జియో చేస్తున్న కొన్ని కీలకమైన అక్విజిషన్లను ఆకాశ్‌ అంబానీయే లీడ్‌ చేస్తున్నారు.

డైరెక్టర్‌ నుంచి చైర్మన్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటి కొత్త టెక్నాలజీలను, క్యాపబిలిటీలను రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌లో డెవలప్‌ చేయటంలో అన్నీ తానై అన్నట్లుగా చురుకుగా పాల్గొంటున్నారు. జియో 4జీ రెడీ ఫోన్‌ను లాంఛ్‌ చేయటంలో ఆకాశ్‌ అంబానీ కృషి ఎంతో ఉంది. 5 పాయింట్‌ 7 డాలర్ల జియో-ఫేస్‌బుక్‌ డీల్‌ కుదరటంలో కూడా ఆకాశ్‌ అంబానీ కీలకంగా వ్యవహరించారు. జియో మార్ట్‌లను ప్రారంభించటంలోనూ ముందు వరుసలో నిలిచారు. ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్ట్‌లను వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అఛీవ్‌మెంట్ల నేపథ్యంలో ఆకాశ్‌ అంబానీ ఈ ఏడాది జూన్‌లో జియో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి చైర్మన్‌ అయ్యారు. దీంతో.. ధీరుభాయ్‌ అంబానీ దీటైన వారసత్వం కొనసాగనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.