Site icon NTV Telugu

Enceladus: శని గ్రహ చంద్రుడిపై పాస్పరస్.. జీవానికి కీలకం అంటున్న శాస్త్రవేత్తలు..

Enceladus

Enceladus

Enceladus: ఈ అనంత విశ్వంలో భూమి తర్వాత వేరే ఎక్కడైనా జీవం ఆనవాళ్లు ఉన్నాయా..? అనే దిశగా శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేస్తున్నారు. అయితే మన సౌర వ్యవస్థలో మనకు తెలిసి ఒక్క అంగారకుడిపైనే జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడు కూడా భూమి లాగే నీటితో నిండి ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆపర్చునిటీ, క్యూరియాసిటీ, పర్సువరెన్స్ వంటి రోవర్ల ద్వారా జీవం ఆనవాళ్లను అణ్వేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా శని గ్రహం యొక్క చంద్రుడిపై జీవానికి సంబంధించిన కీలకమైన మూలకాన్ని కనుగొన్నారు. శనిగ్రహం యొక్క ఆరో అతిపెద్ద చంద్రుడైన ఎన్సెలాడస్ పై జీవానికి కీలకం అయిన పాస్పరస్(భాస్వరాన్ని) గుర్తించారు. ఎన్సెలాడస్ దట్టమైన మంచుతో కప్పబడిన ఉపగ్రహం. అయితే దట్టమైన మంచు ఫలకం కింద సముద్రం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాసా శని గ్రహ పరిశోధనకు ‘కాస్సిని’ అంతరిక్ష నౌకను పంపింది.

Read Also: Hyundai Exter Launch 2023: ఆహా అనేలా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంటీరియర్.. అత్యాధునిక ఫీచర్లు! లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

కాస్సిని జరిపిన పరిశోధనల్లో ఎన్సెలాడస్ దక్షిణ ధృవం నుంచి ప్రకాశవంతమైన వాయువులు, మంచు స్పటికాలు వెదజల్లుతోంది. ఎన్సెలాడస్ క్రస్ట్ నుంచి పగుళ్ల ద్వారా ఈ వాయువులు జెట్ల రూపంలో బయటకు వెళ్తున్నాయి. ఇవి శనిగ్రహంలోని ఈ-రింగ్ కావాల్సిన మెటీరియన్ ను ఈ జెట్లు పంపిస్తున్నాయి. కాస్సిని అంతరిక్ష నౌక శని గ్రహంపై 2004 నుండి 2017 వరకు పరిశోధనలు జరిపింది. శాస్త్రవేత్తలు ఎన్సెలాడస్ యొక్క మంచులో ఖనిజాలు, సేంద్రీయ సమ్మేళనాలు, అమైనో ఆమ్లాలకు సంబంధించిన పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయని తేలింది. మనకు తెలిసి ఇవి జీవానికి సంబంధించిన పదార్థాలు.

భాస్వరం DNA యొక్క నిర్మాణానికి ప్రాథమికమైనది, భూమిపై అన్ని రకాల జీవులలో కణ త్వచాలు, శక్తికి సంబంధించిన అణువుల యొక్క ముఖ్యమైన భాగమని బెర్లిన్‌లోని ఫ్రీ యూనివర్శిటీకి చెందిన గ్రహ శాస్త్రవేత్త ఫ్రాంక్ పోస్ట్‌బర్గ్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎన్సెలాడస్ చంద్రుడితో పోలిస్తే ఆరో వంతు, శని గ్రహంతో పోలిస్తే 146 వంతు ఉంటుంది. ఇది భూమి, అంగారకుడి తర్వాత సౌరవ్యవస్థలో జీవం ఉండేందుకు అవకాశం ఉన్న గ్రహంగా భావిస్తున్నారు.

Exit mobile version