NTV Telugu Site icon

McDonald’s Business Strategy: పోటీ సంస్థలకు భిన్నంగా మెక్‌ డొనాల్డ్స్‌ వ్యాపార వ్యూహం

Mcdonald's Business Strategy

Mcdonald's Business Strategy

McDonald’s Business Strategy: ఇండియాలో చాలా రెస్టారెంట్లు తమ బ్రాంచ్‌లను తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో.. క్లౌడ్‌ కిచెన్‌ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. అయితే.. దీనికి విరుద్ధంగా.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌, మెక్‌డొనాల్డ్స్‌, బర్గర్‌ కింగ్‌ తదితర సంస్థలు కొన్నేళ్లుగా క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ స్టోర్లను అదనంగా అందుబాటులోకి తెస్తుండటం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

IIFL రిపోర్ట్‌ ప్రకారం.. ప్రతి సంవత్సరం 820 నుంచి 920 వరకు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. వచ్చే నాలుగైదేళ్లలో ఈ బ్రాండెడ్‌ సంస్థల స్టోర్ల సంఖ్య డబుల్‌ కానుంది. తద్వారా.. ఫుడ్‌ డెలివరీ సెగ్మెంట్‌ తన ఈటింగ్‌-ఔట్‌ మార్కెట్‌ షేరును రెట్టింపు చేసుకోవాలని.. అంటే.. 15 నుంచి 20 శాతానికి పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు క్రెడిట్‌ సూయిస్‌ సంస్థ తన రిపోర్ట్‌లో పేర్కొంది.

Exclusive Story on Ambani Companies: అంబరాన్ని తాకుతున్న.. ‘అంబానీ’ వ్యాపార సామ్రాజ్యం..

స్టోర్ల సంఖ్యను పెంచుతున్నప్పటికీ ఈ ఫ్రాంచైజీలు ఎక్కువగా ఆన్‌లైన్‌ ఆర్డర్లను డెలివరీ చేయటం పైన మరియు టేక్‌అవేల పైనే ఆధారపడనున్నాయి. అంతే తప్ప స్టోర్లలో కూర్చొని తినే వినియోగదారుల సంఖ్య పెరగాలని మాత్రం ఆశించట్లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. చిన్న స్టోర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు. రెంట్‌ కూడా తక్కువే ఉంటుంది.

సర్వీసింగ్‌ ఖర్చులు కలిసొస్తాయి. ప్రస్తుతం రెడీమేడ్‌ ఫుడ్‌ కస్టమర్లు కూడా ఆన్‌లైన్‌ ఆర్డర్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయా రెస్టారెంట్లు సాధ్యమైనంత ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాయి. అయితే.. మెక్‌డొనాల్డ్స్‌ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. మన దేశంలోని వెస్ట్రన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ గేమ్‌లో పోటీదారుల వ్యూహాలను ఈ సంస్థ అస్సలు పట్టించుకోవట్లేదు.

పెద్ద రెస్టారెంట్లు నిర్మించాలని, ఫుడ్‌ను పార్సిల్‌ తీసుకెళ్లకుండా రెస్టారెంట్లలోనే కూర్చొని తినే కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలని మెక్‌డొనాల్డ్స్‌ పట్టుదలగా ఉంది. అదే సమయంలో.. టేకౌట్‌ మరియు డెలివరీ కన్జ్యూమర్లను సైతం ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. లాంగ్‌ టర్మ్‌ వ్యాపార లక్ష్యంలో భాగంగా లార్జర్‌ సైజ్‌ అండ్‌ లాంగర్‌ లీజ్‌ స్టోర్‌ మోడలే తమకు సూటబుల్‌ అని మెక్‌డొనాల్డ్స్‌ భావిస్తోంది.

మిగతా సంస్థలేమో తమకు స్మాలర్‌-స్టోర్‌ ఫార్మాటే బెటర్‌ అని నమ్ముతూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. పెద్ద స్టోర్లు ఏర్పాటుచేయటం ద్వారా రెస్టారెంట్ల బిజినెస్‌లో సక్సెస్‌ సాధించాలంటే వినియోగదారులకు ఏమేమి ఫుడ్‌ ఐటమ్స్‌ అందించాలనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో మెక్‌డొనాల్డ్స్‌ మెనూ పర్ఫెక్ట్‌గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే.. మెక్‌డొనాల్డ్స్‌ స్టోర్లలో బర్గర్లు, సోడాలు, సైడ్స్‌తోపాటు మంచి బ్రేక్‌ఫాస్ట్‌ కూడా లభిస్తుంది.

దీనికితోడు కాఫీ మరియు చికెన్‌ రిలేటెడ్‌ ఐటమ్స్‌ సైతం అందుబాటులో ఉంటాయి. దీంతో రోజంతా కస్టమర్లు వచ్చిపోతూనే ఉంటున్నారు. డెలివరీ ఛానళ్లు పెద్ద సంఖ్యలో ప్రారంభం కావటంతో ఇటీవల కొన్నేళ్లలో వెస్ట్రన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ రిటైలర్ల బిజినెస్‌లో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. అయినప్పటికీ మెక్‌డొనాల్డ్స్‌ తన పాత వ్యాపార ధోరణి నుంచి పూర్తిగా పక్కకు జరగలేదు.

ఒక వైపు హోమ్‌ డెలివరీల మీద ఫోకస్‌ పెడుతూనే మరో వైపు డైన్‌-ఇన్‌ స్ట్రాటజీని కూడా అనుసరించింది. ఫలితంగా.. ఓమ్ని ఛానల్‌ బిజినెస్‌ మోడల్‌ వైపు మొగ్గుచూపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మెక్‌డొనాల్డ్స్‌ స్టోర్లలో కూర్చొని తినేవారి సంఖ్య.. మొత్తం సేల్స్‌లో 82 శాతం వరకు ఉండేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సేల్స్‌ రెండూ కలిపినా కూడా మొత్తం అమ్మకాలు దాదాపు అదే స్థాయిలో ఉండటం గమనించాల్సిన అంశం.

అయితే ఇప్పుడు ఓమ్ని ఛానల్‌ బిజినెస్‌ మోడల్‌ మెక్‌డొనాల్డ్స్‌కి ఖర్చుతో కూడిన వ్యవహారంలా మారింది. పెద్ద రెస్టారెంట్‌లను మెయిన్‌టెయిన్‌ చేయటానికి పెట్టుబడి వ్యయంలో 30 శాతం వరకు కేటాయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో మెక్‌డొనాల్డ్స్‌ ఔట్‌లెట్లను ఎక్స్‌పీరియెన్స్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌ అనే సరికొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్‌ చేశారు. స్మార్ట్‌ లుక్‌ మరియు ఫీల్‌గుడ్‌ వాతావరణంతో కన్జ్యూమర్లను కట్టి పడేసేందుకు మెక్‌డొనాల్డ్స్‌ స్టోర్లలో వైఫై సౌకర్యం మరియు సెల్ఫ్‌ ఆర్డరింగ్‌ కియోస్క్‌లు వంటి డిజిటల్‌ ఆఫర్స్‌ అందిస్తున్నారు.

తద్వారా రెస్టారెంట్లలో కూర్చొని తినే కస్టమర్ల సంఖ్యను పెంచుకోవటంతోపాటు వాళ్లు ఎక్కువ సమయం స్టోర్‌లో గడిపేలా ఆధునిక సదుపాయలతో ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని సొంతం చేసి వాకిన్‌ల సంఖ్యను మరియు డైలీ సేల్స్‌ను భారీగా పెంచాలని మెక్‌డొనాల్డ్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఏదిఏమైనప్పటికీ వెస్ట్రన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ రిటైలర్ల బిజినెస్‌ విజయవంతం కావటం అనేది కస్టమర్ల ఆకలిని తీర్చే ఆహార పదార్థాలను, వాళ్ల టేస్టుకు తగిన ఐటమ్స్‌ను అందించటంపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెస్టారెంట్లలో మర్చిపోలేని మధురానుభూతిని కలిగించే ఏర్పాట్లను, మళ్లీ మళ్లీ రావాలనిపించే మర్యాదపూర్వక సర్వీసులను ఇవ్వటం కూడా ప్రధానమేనని చెబుతున్నారు.

Show comments