NTV Telugu Site icon

Marry Now Pay Later: పెళ్లికి డబ్బు కావాలా? Marry Now-Pay Later అంటున్న సంస్థ

Marry Now Pay Later

Marry Now Pay Later

Marry Now Pay Later: పెళ్లి చేయాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి. ఎందుకంటే.. మన దేశంలో చాలా మంది.. మ్యారేజ్‌ని ప్రెస్టేజ్‌గా భావిస్తారు. అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆశిస్తారు. అందుకే.. అప్పు చేసి మరీ పప్పన్నం పెట్టేందుకు వెనకాడరు. దీనికోసం కొందరు.. తెలిసినవారి దగ్గర డబ్బు తీసుకుంటారు. మరికొందరు.. బ్యాంకుల నుంచి లోన్లు పొందుతారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నవతరం ఫిన్‌టెక్‌ కంపెనీలు.. బై నౌ పే లేటర్‌.. మాదిరిగా.. మ్యారీ నౌ పే లేటర్‌.. అంటున్నాయి. జోరో ఇంట్రస్ట్‌కే ఆర్థిక సాయం చేస్తున్నాయి. తాజాగా.. సన్‌క్యాష్‌ అనే ట్రావెల్‌ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌.. ఈ సేవలను ప్రారంభించింది. దీంతో.. కొన్ని జంటలు, మధ్యతరగతి కుటుంబాలు.. ఈ కొత్త ఆప్షన్‌ వైపు ఆకర్షితులవుతున్నారు.

read more: AI Software New Version: AI సాఫ్ట్‌వేర్‌ కొత్త వెర్షన్‌. రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఓపెన్‌ ఏఐ

సేవింగ్స్‌ మొత్తాన్నీ పెళ్లికే ఖర్చుపెట్టకుండా.. కొంతవరకు డబ్బు చేతిలో ఉంచుకుందామనుకునేవారు మ్యారీ నౌ పే లేటర్‌కి సై అంటున్నారు. సన్‌క్యాష్‌ అనే కంపెనీ ఇప్పటికే తన వినియోగదారుల ప్రయాణాల కోసం ట్రావెల్‌ నౌ పే లేటర్‌ సర్వీసును అందిస్తోంది. ఇండియాలో రోజురోజుకీ పెరుగుతున్న వెడ్డింగ్‌ మార్కెట్‌ని సొమ్ము చేసుకునేందుకు మ్యారీ నౌ పే లేటర్‌తో ముందుకొచ్చింది.

భారతదేశంలో వెడ్డింగ్‌ మార్కెట్‌ అనేది 4వ అతిపెద్ద ఇండస్ట్రీగా వెలుగొందుతోంది. ఈ పరిశ్రమ టర్నోవర్‌ దాదాపు 4 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదవుతోంది. ఈ ఏడాది సుమారు 35 లక్షల జంటలు పెళ్లిచేసుకోబోతున్నాయి. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని సన్‌క్యాష్‌ సంస్థ మ్యారీ నౌ పే లేటర్‌కి తెర లేపింది. దీనివల్ల.. ఒక వైపు.. లిక్విడ్‌ క్యాష్‌, మరో వైపు.. సేవింగ్స్‌.. రెండూ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

ఫలితంగా.. పెళ్లి చేసుకున్న వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మ్యారీ నౌ పే లేటర్‌ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసుకుంటే మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదు. కాబట్టి.. బ్యాంక్‌ లోన్లతో పోల్చుకుంటే.. ఇది.. బెస్ట్‌ అని చెప్పొచ్చు. అయితే.. ఈ రుణాన్ని ఏడాది కాలానికి తీసుకుంటే మాత్రం ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

మ్యారీ నౌ పే లేటర్‌ కింద గరిష్టంగా పాతిక లక్షల రూపాయలు ఇస్తారు. మ్యాగ్జిమం.. 12 నెలల లోపు తిరిగి చెల్లించాలి. కస్టమర్లకు.. రీపేమెంట్‌ చేసే సామర్థ్యం ఉందా లేదా అనేది చూసి లోను ఇస్తారు. ఈ మేరకు.. థర్డ్‌ పార్టీ డేటాను.. అంటే.. ఐడీ కార్డులు, అడ్రస్‌ ప్రూఫ్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, పేస్లిప్‌లు, ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌లు తదితర డాక్యుమెంట్లను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సన్‌క్యాష్‌ సంస్థ ప్రారంభించిన ఈ సర్వీసుకు అద్భుతమైన స్పందన వచ్చింది.

జాతీయ రాజధాని ప్రాంతంలో వారం రోజుల్లోనే వంద మందికి పైగా కస్టమర్లు తమ పెళ్లికి డబ్బు కావాలని అడిగారు. వాళ్లు అడిగిన రుణాల విలువ ఏడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయలకు చేరటం విశేషం. దీన్నిబట్టి.. మ్యారీ నౌ పే లేటర్‌ అనే ఫైనాన్షియల్‌ సర్వీస్‌కి ఎంత డిమాండ్‌ నెలకొందో అర్థంచేసుకోవచ్చు. అదీ.. మరి. మన దేశంలో.. పెళ్లంటే. మూడు ముళ్లు.. ఏడడుగులు.. మాత్రమే కాదు. ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట అని అందరికీ తెలిసిందే కదా.

Show comments