Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు కారు. ఈ రోజుల్లో ముళ్ల కంచె కంటే.. మన చుట్టూ ఉంటూ నిలువునా ముంచే మోసగాళ్లే ఎక్కువయ్యారు. ‘మనం ఎవరికీ కీడు చేయలేదు కదా, మనకెందుకు నష్టం జరుగుతుంది’ అని అమాయకంగా ఆలోచిస్తే మొదట నష్టపోయేది మీరే. ఎందుకంటే, అడవిలో నిటారుగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు. మరి మీ పక్కనే ఉంటూ మీ వెనుక గోతులు తవ్వే నమ్మకద్రోహులను స్మార్ట్‌గా ఎలా పసిగట్టాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆ కళ్లు తెరిపించే నిజాలు, మిమ్మల్ని రక్షించే గోల్డెన్ రూల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ చుట్టూ ఉన్నవారిలో అసలైన ద్రోహులను స్మార్ట్‌గా పసిగట్టేందుకు చాణక్యుడు చెప్పిన 5 సైకలాజికల్ చిట్కాలు ఇవే..
Also Read
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
మీ ముందే అతిగా నవ్వుతూ, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారా? అయితే అలాంటి వారికి కాస్త దూరం జరగండి. వీరి గురించి చాణక్య ఏం చెబుతున్నారంటే.. అవసరానికి మించి పొగిడేవాడు కచ్చితంగా ఏదో ఒక స్కెచ్‌తోనే మీ దగ్గరకు వస్తాడు. మీ ముందు ఇతరుల గాసిప్స్ చెప్పేవాడు, ఇతరుల ముందు మీ గుట్టును కూడా రచ్చకెక్కిస్తాడనేది గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అలాగే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ పక్కనే ఉండి, మీకు కాస్త కష్టం రాగానే ఫోన్ కూడా ఎత్తకుండా మాయమైపోతారు చూశారు అలాంటి వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని చెప్పారు. వీళ్ల గురించి చాణక్యు ఏం చెబుతున్నారంటే.. వీరు మీతో కాదు, మీకున్న పొజిషన్ లేదా డబ్బుతో స్నేహం చేస్తారని, ఇలాంటి వాళ్లు మీ కష్టాల్లో తోడుగా ఉండరని, ఇలాంటి వాళ్లని మీ లైఫ్ లిస్టులో ఉండటానికి వీల్లేదని చెప్పారు.
“నీకు మాత్రమే చెప్తున్నా, ఎవరికీ చెప్పకు” అంటూ ఇతరుల పర్సనల్ విషయాలను మీ దగ్గర వాంతి చేసుకునే వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పారు. ఎందుకంటే ఎదుటివారి సీక్రెట్స్కు రెస్పెక్ట్ ఇవ్వని వాడు, మీ పర్సనల్ లైఫ్‌ను అస్సలు గౌరవించడు. మీ ప్లాన్స్ ఇలాంటి వారికి చెప్తే మీ కథ ముగిసినట్టే అనే విషయాన్ని గుర్తించుకోవాలని వెల్లడించారు. అలాగే ప్రతి చిన్న విషయానికి “నా మీద ఒట్టే.. నన్ను నమ్ము.. నేను అస్సలు మారను” అంటూ ఓవరాక్షన్ చేసే వారికి దూరంగా ఉండాలని చెప్పారు. వీళ్ల గురించి చాణక్య చెబుతూ.. నిజాయితీ ఉన్నవాడు తన క్యారెక్టర్‌ను ప్రూవ్ చేసుకోవడానికి పదే పదే సబ్బు బిళ్లల్లాంటి సాకులు వెతుక్కోడు. అతిగా ప్రమాణాలు చేస్తున్నారంటే అక్కడ ఏదో పెద్ద అబద్ధం దాగుందని అర్థం అని పేర్కొన్నారు. ప్రపంచంలో దేన్నీ మెచ్చుకోరు. ఎప్పుడూ ఎవరిదో ఒకరి తప్పులు వెతకడం, ఏడవడం చేసే వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారి మనస్సు ఎప్పుడూ కుట్రలతో నిండి ఉంటుందని, వీరితో ఎక్కువ కాలం ఉంటే మీలోని పాజిటివ్ ఎనర్జీ కూడా ఖాళీ అయిపోతుందన్నారు.
కింగ్ లా బతకడానికి చాణక్యుడి రూల్స్ ఇవే..
రూల్ 1: నో లీకేజ్! మీ నెక్స్ట్ మూవ్ ఏంటో, మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో ఆఖరికి మీ నీడకు కూడా తెలియనివ్వకండి. పని పూర్తయ్యాకే రిజల్ట్ కనిపించాలి.
రూల్ 2: ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు నో చెప్పండి! ఎవరైనా సెంటిమెంట్‌తో గేమ్ ఆడుతుంటే.. అక్కడ మెదడుకు పని చెప్పండి, మనస్సుకు కాదు. లాజికల్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి.
రూల్ 3: వీక్నెస్ దాచేయండి! మీ భయం ఏంటో ద్రోహికి తెలిస్తే, కరెక్ట్‌గా అక్కడే మిమ్మల్ని లాక్ చేస్తాడు. మీ బలహీనతలను లోపలే దాచుకోండి.
రూల్ 4: నవ్వగానే పడిపోకండి! ముఖం చూసి స్నేహం చేయకండి, వారి ప్రవర్తనను కొన్ని రోజులు గమనించిన తర్వాతే మీ సర్కిల్‌లోకి రానివ్వండి.
“ఒకసారి మోసపోతే ఎదుటివాడి తప్పు.. అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే అది పక్కాగా మీ మూర్ఖత్వమే!” మాటలను నమ్మడం ఆపేసి, కేవలం యాక్షన్స్ (చేతలు) మాత్రమే నమ్మండి అని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!