Site icon NTV Telugu

How Bombay Became Mumbai: ముంబైకి బాంబే అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?

Bombay History

Bombay History

How Bombay Became Mumbai: మహానగరం ముంబై.. ప్రస్తుతం ముంబైలో మేయర్ ఎన్నికపై గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో వార్తల్లో నిలుస్తున్నా ఈ మహానగరానికి అసలు బాంబే అనే పేరు ఎవరు పెట్టారు. పోర్చుగీస్ లేదా బ్రిటిష్ వారిలో ఎవరు ముంబైని బాంబేగా పిలిచారు. తర్వాత ఆ పేరు ముంబైగా ఎలా ప్రాచుర్యం పొందింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Rahul Gandhi vs BJP: G-RAM-Gతో బీజేపీ రాజకీయం.. ఈ బిల్లు గురించి మాట్లాడిన వాళ్ళు హిందూ వ్యతిరేకులే!

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. 1498 తర్వాత పోర్చుగీస్ వారు భారతదేశ పశ్చిమ తీరంలో చురుకుగా మారిన తర్వాత ఈ దీవులకు చేరుకున్నారు. పోర్చుగీస్ పత్రాలు ఈ ప్రదేశాన్ని బోమ్ బాహియా అని పిలిచినట్లు వెల్లడించాయి. అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. పోర్చుగీస్ స్థానిక పదం “ముంబై”ని విని దానిని వారి స్వంత మాండలికంలో “బొంబాయిమ్” అని పిలవడం ప్రారంభించారు. బొంబాయిమ్ అనే ఉచ్చారణ వారి బోమ్ బాహియా, స్థానిక ముంబేల కలయిక. 1661లో పోర్చుగీసు వారు బ్రిటన్ రాజు చార్లెస్ IIకి బొంబాయిని కట్నంగా ఇచ్చారు. 1668లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని తన ఆధీనంలోకి తీసుకుంది.

బ్రిటిష్ పరిపాలన, ఆంగ్ల భాష పోర్చుగీస్ బొంబాయిమ్‌ను మరింత ఇంగ్లీష్ లాంటి స్పెల్లింగ్ – బొంబాయిగా సరళీకరించాయి. బ్రిటిష్ పాలనలో బొంబాయి వేగంగా అభివృద్ధి చెందింది. 18 – 19వ శతాబ్దాలలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ, నౌకాశ్రయం అభివృద్ధి చెందింది. రైల్వే – ఓడరేవు మౌలిక సదుపాయాలు దీనిని రోమన్ సామ్రాజ్యం లేదా వెనిస్ వంటి ప్రపంచ వాణిజ్య నగరాలతో సమానంగా నిలిపాయి. బొంబాయి క్రమంగా భారతదేశ ఆర్థిక కేంద్రంగా మారింది. బ్రిటిష్ పాలన ఒక పెద్ద పరిపాలనా ప్రాంతమైన బాంబే ప్రెసిడెన్సీని స్థాపించింది.

1995 లో మారిన పేరు..
1995లో అధికారంలోకి వచ్చిన శివసేన – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారికంగా బొంబాయి పేరును ముంబైగా మార్చింది. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉదహరించబడ్డాయి. మొదటి కారణం స్థానిక గుర్తింపు. ఇది నగరం యొక్క అసలు పేరు ముంబా దేవికి, కోలి సంస్కృతికి భాషా – సాంస్కృతిక గుర్తింపును ఇచ్చింది. రెండవ కారణం వలస పేర్ల నుంచి స్వేచ్ఛ. స్వతంత్ర భారతదేశంలో అనేక నగరాలను వాటి స్థానిక పేర్లలోకి మార్చారు. మద్రాస్ చెన్నైగా, కలకత్తా కోల్‌కతాగా, పూనా పూణేగా మొదలైనవి. అదే తరహాలో బొంబాయి ముంబైగా మారింది. చివరి కారణం ఏమిటంటే ముంబై మరాఠీ మనస్తత్వానికి కేంద్రం. ముంబై అనే పేరు ఆ భావోద్వేగ, సాంస్కృతిక గుర్తింపును బలపరుస్తుంది. నేడు ప్రభుత్వం, రైల్వే స్టేషన్లు, వార్తా సంస్థలు, సమాజంలో చాలా వరకు ముంబై అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, బాంబే అనే పదాన్ని ఇప్పటికీ బాంబే హైకోర్టు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) వంటి కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. బొంబాయి నుంచి ముంబైగా మారిన బాంబే కథ ఇది.

READ ALSO: Jammu Kashmir: తీవ్ర విషాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం..10 మంది జవాన్లు మృతి

Exit mobile version