Geminids Meteor: నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నుండి డిసెంబర్ మధ్య వరకు కనిపించే వార్షిక జెమినిడ్స్ ఉల్కాపాతం ఈ సంవత్సరం డిసెంబర్ 14 మరియు 15 రాత్రి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈఏడాదిలో చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానున్నంది. ఈనెల 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న జెమినిడ్స్ ఉల్కాపాతం నేడు రాత్రి గరిష్ఠస్థాయికి చేరుకోనుంది. గరిస్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. జెమినిడస్ ఉల్కాపాతం శిథిలాలు సెకనుక 70కిలోమీటర్లు వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భంలో మండిపోతూ ప్రకాశంగా కనిపించనున్నాయి.
Read also: Chhattisgarh: ప్రియురాలిపై అనుమానం.. కిరాతంగా కొట్టి చంపిన లవర్..
వీటిని టెలిస్కోప్ లేకుండా వీక్షించవచ్చని, భూమిపై ఎక్కడి నుంచైనా వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రత్యక్షంగా చూసినా బెదిరేది లేదని తేల్చిచెప్పారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు ఉల్కాపాతం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, రాత్రి 9 గంటలకు మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆకాశంలోని ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దని హైదరాబాద్ ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ ఎన్.రఘునందన్‌కుమార్ సూచించారు. అమెరికన్ మెటియోర్ సొసైటీ ప్రకారం, వర్షం డిసెంబర్ 13 రాత్రి నుండి డిసెంబర్ 14 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది..చాలా ఉల్కలు తెల్లవారుజామున 2 గంటలకు కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ, ఈ ఉల్కలు రాత్రిపూట ఆకాశంలో అన్ని దిశలలో దూసుకుపోతున్నందున జెమిని రాశికి సమీపంలో ప్రకాశాన్ని కనుగొనవలసిన అవసరం లేదు. ఈ ‘షూటింగ్ స్టార్‌లను’ చూడడానికి టెలిస్కోప్ లేదా ఇతర పరికరాలు అవసరం లేదు, ఎందుకంటే కాంతి లేదా వాయు కాలుష్యం లేని చీకటి ప్రదేశాన్ని కనుగొనేంత వరకు అవి కంటితో స్పష్టంగా కనిపిస్తాయి.
Mclaren 765 LT: ఇండియాలోనే అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన హైదరాబాద్ వాసి