Exclusive Story on Ambani Companies: ఒక్కసారి ఊహించుకోండి. మనింట్లోని ప్రతి వస్తువూ ఒకే కంపెనీకి చెందినవైతే ఎలా ఉంటుందో?. ఒకే కంపెనీకి చెందినవి కాకపోయినా ఒకే వ్యక్తి నేతృత్వంలోని వివిధ సంస్థలకు చెందినవైనా అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం తినే ఫుడ్డుతో మొదలుపెట్టి.. వేసుకునే బట్టలు.. ప్రయాణం చేసే కారులోని పెట్రోల్.. ఇంటర్నెట్.. గాడ్జెట్లు.. స్పోర్ట్స్ ఇలా ప్రతి ప్రొడక్టూ.. ప్రతి సర్వీసూ.. సింగిల్ పర్సన్ నడిపించే వ్యాపార సామ్రాజ్యం నుంచే వస్తున్నాయి. వ్యక్తిగా మొదలై శక్తిగా మారిన ఆయనే.. ముఖేష్ అంబానీ.
ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన కుబేరుల్లో ఒకరు. మన దేశంలోని కొన్ని లక్షల మంది నిత్య జీవితాలతో ప్రత్యక్షంగా ముడిపడిన, పరోక్షంగా అనుబంధం పెరుగుతున్న ప్రభావశీలి. గత మూడేళ్లుగా టాప్-10 బిలియనీర్ల లిస్టులో కొనసాగుతున్నారు. ముఖేష్ అంబానీకి ఇన్ని అపారమైన ఆస్తిపాస్తులు ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచే వస్తున్నాయి. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒకప్పుడు టెక్స్‌టైల్స్‌కి, పెట్రోకెమికల్స్‌కి ఫేమస్.
Special Story on Ambani’s Solid Legacy: కొనసాగుతున్న ధీరుభాయ్ అంబానీ దీటైన వారసత్వం
తండ్రి చేతుల్లో నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాక రిలయెన్స్‌ని ముఖేష్ అంబానీ డిజిటల్ పవర్‌హౌజ్‌లా మార్చేశారు. కొన్ని సంస్థలను అక్వైర్ చేసుకోవటం, మరికొన్నింటితో పార్ట్నర్‌షిప్‌లను ఏర్పాటుచేసుకోవటం ద్వారా కంపెనీ ప్రొఫైల్‌ని విస్తరించారు. రిటైల్, టెలీకమ్యూనికేషన్లు, మీడియా.. ఇలా దాదాపు ప్రతి రంగంలోకీ అడుగుపెట్టారు. ఎవరూ ఊహించని రీతిలో.. అంబరాన్ని తాకే స్థాయిలో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూపోతున్నారు.
ఈ స్టేట్‌మెంట్ కొంచెం అతిశయోక్తిలా అనిపించొచ్చు. కానీ.. ఒకసారి ముఖేష్ అంబానీ బుజినెస్ జర్నీని పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ఆమ్ ఆద్మీ జీవితంతో, ప్రతి భారతీయుడి డైలీ లైఫ్‌తో ఎంతగా ముడిపడి ఉందో తెలుస్తుంది. మరెందుకు ఆలస్యం?.. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం.. ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యాపారాలను వన్ బై వన్ చూద్దాం.
1. జియో ఫోన్ నెక్‌స్ట్: దీన్ని.. గూగుల్‌తో కలిసి ఏర్పాటుచేశారు. ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్ కలిగిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఖరీదు చాలా తక్కువ.. అంటే.. కేవలం 4 వేల 499 రూపాయలు మాత్రమే కావటం విశేషం.
2. మనీ కంట్రోల్: ఇదొక ఫైనాన్షియల్ న్యూస్ పోర్టల్. 1999లోనే ఏర్పాటుచేశారు. అంబానీకే చెందిన నెట్‌వర్క్18 మీడియా గ్రూప్‌లో భాగం. దీనికి నెలకి దాదాపు కోటీ 70 లక్షల మంది విజిటర్స్ ఉన్నారు.
3. జస్ట్ డయల్: ఈ సెర్చింజన్‌ని 26 ఏళ్ల కిందట అందుబాటులోకి తెచ్చారు. 8 డిజిట్ 10 సార్లు ఉన్న ఈ నంబర్‌ను కాల్ చేయటం ద్వారా యూజర్లు లోకల్ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. ఈ సంస్థలో మెజారిటీ వాటాను రిలయెన్స్ రిటైల్ 2021లో సొంతం చేసుకుంది.
4. గ్రాబ్: ఇదొక డెలివరీ లాజిస్టిక్స్ స్టార్టప్. సౌత్ ఈస్ట్ ఏసియన్ సూపర్ యాప్‌తో దీనికి సంబంధంలేదు. దీన్ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ 2019లో కొనుగోలు చేసింది. తన ఇ-కామర్స్ బిజినెస్‌కి సపోర్ట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకుంది.
5. ఆల్ట్‌బాలాజీ: ఇదొక వీడియో స్ట్రీమింగ్ యాప్. బాలాజీ టెలీఫిల్మ్స్ సంస్థకు చెందిన మూవీలను, టీవీ షోలను ఇందులో ప్రసారం చేస్తారు. ఇందులో అంబానీ రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కి పాతిక శాతం షేరు ఉంది.
6. జియో సినిమా: ఇది కూడా ఒక వీడియో స్ట్రీమింగ్ యాపే. దీన్ని 2016లో లాంఛ్ చేశారు. అంబానీ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన జియో కస్టమర్లు దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
7. మై జియో: ఇదొక ఆల్-ఇన్-వన్ యాప్. ఇండియాలోని లీడింగ్ మొబైల్ నెట్‌వర్క్ అయిన జియో సబ్‌స్క్రయిబర్ల కోసం రూపొందించారు. ఇందులో ప్రస్తుతం 400 మిలియన్‌లకు పైగా యూజర్లు ఉండటం విశేషం.
8. ఊట్: ఇది కూడా ఒక వీడియో స్ట్రీమింగ్ సర్వీసే. మీడియా అండ్ ఎంటర్టయిన్‌మెంట్ కంపెనీ వయాకామ్18 రూపొందించింది. దీనికి సహయజమానులుగా రిలయెన్స్ యూనిట్ మరియు పారామౌంట్ వ్యవహరిస్తున్నాయి.
9. జియో హప్తిక్: ఇదొక కన్వర్జేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫాం. మాటలతో, వాట్సాప్ చాట్‌బోట్‌లతో పనిచేస్తుంది. దీన్ని 2013లో స్థాపించారు. 2019లో రిలయెన్స్ కొనుగోలు చేసింది.
10. ఫైన్‌డ్: ఇదొక షాపింగ్ ప్లాట్‌ఫాం. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ దీని ద్వారా ఆన్‌లైన్ సేల్స్ చేసుకోవచ్చు. ఇందులోని మెజారిటీ షేరును రిలయెన్స్ 2019లో కొనుగోలు చేయటంతో అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక భాగమైంది.
11. రెవరీ: ఇదొక ట్రాన్స్‌లేషన్ సాఫ్ట్‌వేర్. 22 భారతీయ భాషలను అనువాదం చేయగలదు. 2019లో ముఖేష్ అంబానీ అక్వైర్ చేసుకోవటంతో ఆయన గ్రూపులోని టెక్ స్టార్టప్‌ల సరసన చేరింది.
12. ఎంబిబే: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బేస్డ్ ఎడ్‌టెక్ స్టార్టప్. ఇందులో స్కూల్ టెస్టుల నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ వరకు అన్నీ ఉంటాయి. దీన్ని రిలయెన్స్ 2018లో అక్వైర్ చేసుకుంది.
13. జియోక్లౌడ్: ఇదొక క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ యాప్. డెస్క్‌టాప్ మరియు మొబైల్ వెర్షన్లలో లభిస్తుంది. జియో యూజర్లు స్టార్టింగ్‌లో 5 జీబీ వరకు, మిగతావాళ్లు 2 జీబీ వరకు స్టోరేజ్‌ని ఫ్రీగా పొందొచ్చు.
14. పోటరీ బార్న్: ఇదొక ఆన్‌లైన్ స్టోర్. రిలయెన్స్ రిటైల్.. అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి హోం ఫర్నీచర్ కంపెనీతో 2018లో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకొని 2022లో.. అంటే.. ఈ సంవత్సరమే.. దీన్ని ఓపెన్ చేసింది.
15. ఆర్-ఎలాన్: ఇది.. నెక్‌స్ట్-జెన్ స్మార్ట్ ఫ్యాబ్రిక్. పాలిస్టర్ ఫైబర్ తయారీలో లీడర్‌లా ఉన్న రిలయెన్స్ ఇండస్ట్రీస్.. దీన్ని 2018లో లాంఛ్ చేసింది.
16. గెట్ రియల్: చర్మ మరియు శిరోజ సంరక్షణ ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఈ ప్రొడక్టులకు ఇండియాలో మంచి మార్కెటే ఉన్నప్పటికీ ఇది మాత్రం రిలయెన్స్ రిటైల్ అధీనంలోని డబ్బు బాగా ఖర్చవుతున్న బ్రాండ్లలో ఒకటిగా ఉండటం గమనించాల్సిన అంశం.
17. సేఫ్ లైఫ్: ఇది.. యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌లు, హ్యాండ్ వాష్‌లు, శానిటైజర్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. ఇండియాలోని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగంలో రిలయెన్స్ రిటైల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
18. డీసీ షూస్: ఇదొక అమెరికా ఫుట్‌వేర్ కంపెనీ. యాక్షన్ స్పోర్ట్స్‌కి బాగా ఫేమస్. అంబానీ రిలయెన్స్‌తో కలిసి మన దేశంలో 13 స్టోర్లను నిర్వహిస్తోంది.
19. నెట్‌మెడ్స్: ఇదొక ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. ఇందులో మెజారిటీ వాటాను అంబానీ 2020లో కొనుగోలు చేశారు. ఇ-హెల్త్‌లో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పోటీ పడేందుకు ఇందులో వాటాలు కొన్నారు.
20. జియోఫైబర్: ఇది.. రిలయెన్స్ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. డేటా స్పీడ్ ఒక జీబీపీఎస్ వరకు అందిస్తుంది. సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి స్ట్రీమింగ్ సర్వీస్‌లకు సంబంధించిన బోలెడన్ని ఆఫర్లు ఇస్తోంది.
21. ట్రెండ్స్ ఫుట్‌వేర్: ఇదొక.. ఫుట్‌వేర్ చెయిన్. దీన్ని.. ముఖేష్ అంబానీ ఫ్యాషన్ రిటైలర్ అయిన రిలయెన్స్ ట్రెండ్స్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. దీనికి సొంతగా స్టాండ్-అలోన్ స్టోర్లు కూడా ఉన్నాయి.
22. జియో శావ్న్: ఇదొక.. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇందులో 16 భాషలకు చెందిన 8 కోట్లకు పైగా మ్యూజిక్ ట్రాక్‌లు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ విలువ ఒక బిలియన్ డాలర్లు. జియో మ్యూజిక్ మరియు శావ్న్ కలయికతో ఏర్పడింది.
23. రిలయెన్స్ జ్యువెల్స్: ఇది.. అంబానీ సామ్రాజ్యంలోని నగల వ్యాపారం. ప్రస్తుతం జియో మార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లోకి కూడా విస్తరించింది. ఆభరణాలను అమితంగా ప్రేమించే మహిళలకు మరింతగా చేరువైంది. వందకు పైగా సిటీల్లో 93 ప్రతిష్టాత్మక షోరూమ్‌లు, 110 జ్యూలరీ షాపులు ఉన్నాయి.
24. జివామే: రిలయెన్స్ రిటైల్ ముందుగా 2020వ సంవత్సరంలో ఈ లింగేరీ స్టార్టప్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత పూర్తిగా అక్వైర్ చేసుకుంది. ఇందులో క్లోవియా మరియు అమాంటే అనే రెండు వుమెన్ ఇన్నర్‌వేర్ బ్రాండ్లు కూడా ఉన్నాయి.
25. గ్లిమ్మర్: ఇది.. రిలయెన్స్‌కి చెందిన కాస్మెటిక్స్ మరియు యాక్సెసరీస్ బ్రాండ్. దీనికి దేశవ్యాప్తంగా సొంత స్టోర్లు ఉన్నాయి. ఇ-కామర్స్ పోర్టల్ జియోమార్ట్ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చింది.
26. సంవాద్: ఇది.. పూజా సామాగ్రికి సంబంధించిన బ్రాండ్. దీని ద్వారా రిలయెన్స్ రిటైల్ సంస్థ.. మల్టీ బిలియన్ డాలర్ల విలువైన పూజ మరియు మతపరమైన కార్యక్రమాల్లో వాడుకునే ఉపకరణాల మార్కెట్‌లోకి ప్రవేశించింది.
27. స్నాక్‌టాక్: గ్రాసరీ బ్రాండ్స్‌లో ఇదొకటి. ఈ పేరుతో ప్యాకేజ్డ్ నూడుల్స్ మరియు స్నాక్స్ ఉత్పత్తి చేస్తారు. ప్రజాదరణ పొందిన మ్యాగీకి పోటీగా రిలయెన్స్ ఈ బ్రాండ్‌ను తెర మీదికి తీసుకొచ్చింది.
28. Yeah: ఇది.. కార్బొనేటెడ్ బేవరేజెస్‌కి సంబంధించి అంబానీ మొదలుపెట్టిన బ్రాండ్. కోకా-కోలా, నెస్‌లే, పెప్సికో తదితర ఉత్పత్తులతో పోటీ పడుతోంది.
29. ముజి: జపాన్‌కి చెందిన చిన్న రిటైలర్ సంస్థతో రిలయెన్స్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం ద్వారా 2016లో ఏర్పడింది. ముంబై మరియు ఢిల్లీల్లో స్టోర్లను ఓపెన్ చేసింది.
30. జియో మీట్: ఇది.. జియో ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన ఒక కాన్ఫరెన్సింగ్ యాప్. 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే దీన్ని లాంఛ్ చేశారు. జూమ్ మాదిరిగానే పనిచేస్తుంది. ఫార్టీ మినిట్ టైమ్ లిమిట్ అనేది ఇందులో లేదు.
31. ప్రాజెక్ట్ ఈవ్: ఇదొక మల్టీ బ్రాండ్ రిటైల్ చెయిన్. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు మహిళలు లక్ష్యంగా దుస్తులు, నగలు తదితర ఉత్పత్తులను విక్రయిస్తుంది.
32. అర్బన్ ల్యాడర్: ఇది.. బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ ఫర్నీచర్ రిటైల్ స్టార్టప్. ఇందులో 96 శాతం వాటాను రిలయెన్స్ 2020లో కొనుగోలు చేసింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు పెప్పర్‌ఫ్రైలతో పోటీపడేందుకు దీన్ని సొంతం చేసుకుంది.
33. షీల్‌డ్జ్: ఇది.. దోమలను తరిమికొట్టే బ్రాండ్. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించే ఉత్పత్తుల్లో ఇదీ ఒకటి. రిలయెన్స్ రిటైల్ అధీనంలో వ్యాపారం నిర్వహిస్తోంది.
34. రెల్‌ఉడ్: ఇదొక.. వెదర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్. 2017లో ప్రారంభించారు. న్యాచురల్-ఫైబర్ పాలీమర్‌తో తయారుచేస్తారు. కానీ.. సహజమైన కలప ఉత్పత్తి లాగే కనిపిస్తుంది.. అనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్‌ను ఫ్లోరింగ్ మరియు ఇతర మెటీరియల్‌గా కూడా ఉపయోగిస్తారు.
35. ఎంజో: ఇదొక.. లాండ్రీ వాషింగ్ లిక్విడ్ మరియు డిటర్జెంట్ పౌడర్ బ్రాండ్. రిలయెన్స్ రిటైల్‌కి చెందిన 12 వేల 711 సూపర్ మార్కెట్లు మరియు ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.
36. పెటల్స్: మహిళలు రుతుస్రావం సమయంలో వినియోగించే ప్యా్డ్స్‌కు సంబంధించిన బ్రాండ్ ఇది. దీని విలువ గతేడాది నాటికి 618 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
37. ప్యూరిక్ ఇన్‌స్టాసేఫ్: రిలయెన్స్ గ్రూప్ అధీనంలో పర్సనల్ మరియు హైజీన్ ప్రొడక్టులను తయారుచేసే సంస్థ. సబ్బులు, హ్యాండ్‌వాష్, శానిటైజర్ మరియు క్రిమి సంహారక లిక్విడ్లను విక్రయిస్తుంది.
38. కాల్సిడెంట్: ఇదొక టూత్ పేస్ట్ బ్రాండ్. మార్కెట్ లీడర్స్‌గా ఉన్న కోల్గెట్, క్లోజప్, పెప్సొడెంట్ మరియు పతంజలి దంత్ కాంత్ తదితర బ్రాండ్‌లతో పోటీ పడుతోంది.
39. ఆరంభ్: ఇదొక.. ప్రైవేట్ లేబుల్ బ్రాండ్. తేయాకు, టీ బ్యాగులు, బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ వంటి ప్రొడక్టులను విక్రయిస్తుంది.
40. మైహోం: ఇది.. ఇళ్లు శుభ్రం చేయటానికి ఉపయోగించే క్లీనింగ్ ప్రొడక్టులకు సంబంధించిన బ్రాండ్. దీని పరిధిలో ఎక్స్‌పెల్జ్, మాప్జ్, షిన్జ్, స్క్రబ్జ్ తదితర సబ్-బ్రాండ్స్ కూడా ఉన్నాయి.
41. బ్రూక్స్ బ్రదర్స్: రిలయెన్స్.. పదేళ్ల కిందట.. అంటే.. 2012లో.. అమెరికాకు చెందిన క్లాత్స్ రిటైలర్‌తో కలిసి ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేసింది. దేశంలోని పలు నగరాల్లో స్టోర్లను ఓపెన్ చేసింది.
42. హెల్దీ లైఫ్: ఇదొక కన్జ్యూమర్ బ్రాండ్. బ్రేక్‌ఫాస్ట్ Cereal మరియు హనీ తదితర ఫుడ్ ఐటమ్స్‌ని ఆఫర్ చేస్తోంది.
43. ఏడబ్ల్యూసోయెమ్: సాస్‌లు, స్ప్రెడ్స్, డ్రస్సింగ్స్ వంటి కన్జ్యూమర్ బ్రాండ్‌లను అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో నెస్లే లాంటి గ్లోబల్ కంపెనీతో పోటీ పడుతోంది.
44. దేశీ కిచెన్: వంటింట్లోకి అవసరమైన వివిధ పదార్థాలను, మసాలా దినుసులను విక్రయిస్తుంది. గులాబ్ జామ్ మిశ్రమం, దోశల పిండి వంటి రెడీమేడ్ ప్రిమిక్స్‌లను అందుబాటులోకి తెచ్చింది.
45. సీగ: ఆలివ్ ఆయిల్స్‌లోని వివిధ రకాలను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఎక్‌స్ట్రా వర్జిన్ మరియు ఎక్‌స్ట్రా లైట్ వంటి వేరియెంట్లను విక్రయిస్తోంది.
46. కాఫీ: మన దేశంలోని ప్రతి ఇంట్లోనూ పరిచయం ఉన్న కాఫీ బ్రాండ్ నెస్కెఫేతో పోటీ పడేందుకు రిలయెన్స్ ఈ పేరుతో కాఫీ మిక్సెస్‌ని రూపొందించింది.
47. గుడ్ లైఫ్: ఇదొక ప్రైవేట్ లేబుల్ బ్రాండ్. పంచదార, సుగంధ ద్రవ్యాలు, పప్పు దినుసులు తదితర వంట సరుకులను విక్రయిస్తోంది.
48. బెస్ట్ ఫామ్స్: ఇది కూడా ఒక బ్రాండే. బియ్యం, పప్పు, కూరగాయలు వంటి ప్రీమియం-గ్రేడ్ వంట సరుకులకు సంబంధించింది.
49. రెక్రాన్ సర్టిఫైడ్: దీన్ని 2002లో లాంఛ్ చేశారు. ఇది.. దిండ్లు, పరుపులు వంటి స్లీపింగ్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన బ్రాండ్.
50. హ్యాపీ లివింగ్: ఇది రిలయెన్స్‌కి చెందిన ఒక ప్రైవేట్ బ్రాండ్. ఇంట్లో వాడుకునే పాత్రలు, ప్లాస్టిక్ సామాను మరియు బాత్‌రూమ్‌లో ఉపయోగించే వస్తువులకు సంబంధించింది.
51. అజియో: రిలయెన్స్ రిటైల్ పరిధిలోని ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బ్రాండ్. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌తో పోటీ పడుతోంది.
52. రిలయెన్స్ స్మార్ట్: మన దేశంలోని అతిపెద్ద సూపర్‌మార్కెట్ చెయిన్లలో ఇదొకటి. ఈ స్టోర్లలో దేశీ కిచెన్ మరియు ఎంజో వంటి రిలయెన్స్ సొంత బ్రాండ్ ఉత్పత్తులు ఉంటాయి.
53. మిల్క్ బాస్కెట్: ఇదొక సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ మైక్రో డెలివరీ స్టార్టప్. దీన్ని రిలయెన్స్ గతేడాది అక్వైర్ చేసుకుంది. ఇందులో యూజర్లు అర్ధ రాత్రి వరకు ఆర్డర్లు పెట్టొచ్చు. అవి.. తెల్లారి 7 గంటల లోపు డెలివరీ అవుతాయి.
54. రిలయెన్స్ స్మార్ట్ పాయింట్: ఇది.. పొరుగు ప్రాంతాల వారి కోసం ఏర్పాటుచేసిన చిన్న స్టోర్. లోకల్ డెలివరీలకు లాస్ట్-మైల్ హబ్ లాగా మరియు కస్టమర్లు ఆన్‌లైన్ ఆర్డర్లను పికప్ చేసుకునే ప్లేస్‌లాగా కూడా ఉపయోగపడుతుంది.
55. మార్క్స్ అండ్ స్పెన్సర్: బ్రిటిష్ క్లాతింగ్ బ్రాండ్ అయిన మార్క్స్ అండ్ స్పెన్సర్ 51 శాతం వాటాతో, రిలయెన్స్ రిటైల్ 49 శాతం వాటాతో 2008లో ఈ జాయింట్ వెంచర్‌ని ఏర్పాటుచేశారు. మన దేశంలోని పలు నగరాల్లో ఈ స్టోర్లు ఉన్నాయి.
56. రిలయెన్స్ గ్యాస్: బీపీ అనే సంస్థతో కలిసి 2008లో ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా చమురు మరియు ఇంధన ఉత్పత్తులను విక్రయిస్తుంది.
57. రెల్‌ఫ్లెక్స్ ఎలాస్టోమర్స్: టైర్లు, ఫుట్‌వేర్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ మరియు మెకానికల్ ఫెండర్స్ తదితర ఉత్పత్తుల తయారీలో వాడే వస్తువులను ఈ బ్రాండ్ పేరిట విక్రయిస్తారు.
58. రిలయెన్స్ ఫ్రెష్: రిలయెన్స్ రిటైల్ 2006లో దేశవ్యాప్తంగా 2 వేల 700లకు పైగా గ్రాసరీ స్టోర్లను ఈ పేరుతో ఓపెన్ చేసింది. వీటిలో నిత్యవసర సరుకులు, ఇంట్లో వాడుకునే తాజా పదార్థాలు, ఉత్పత్తులు అమ్ముతారు.
59. రెల్‌స్టార్: ఈ బ్రాండ్‌తో 12 రకాలకు పైగా ఇంజన్ ఆయిల్స్‌ను విక్రయిస్తున్నారు.
60. వైల్డ్ బీన్ కేఫ్: ఈ కేఫ్‌లు కొన్ని గ్యాస్ స్టేషన్లలో మాత్రమే ఉన్నాయి. కన్వీనియెన్స్ స్టోర్లను మరియు కేఫ్‌లను కలిపి ఒకే చోట ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు ఇది కార్యరూపం. ఇందులో కొన్ని హోం డెలివరీలను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
61. రెస్క్యూ: ఇది.. రిలయెన్స్ డిజిటల్‌కి చెందిన సర్వీస్ సంస్థ. రిలయెన్స్ డిజిటల్ స్టోర్లలో కొనుగోలు చేసిన డివైజ్‌లు మరియు అప్లియెన్స్‌కు సంబంధించి ఏడాది పొడవునా సేవలందిస్తుంది.
62. నైట్రోఫిల్: చాలా వరకు జియో-బీపీ గ్యాస్ స్టేషన్లలో అందుబాటులో ఉంది. డ్రైవర్లు తమ వాహనాల టైర్లకు ఇక్కడ నైట్రోజన్‌ను నింపుకోవచ్చు.
63. క్యాస్ట్రాల్: మన దేశంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కోసం రిలయెన్స్ ఇండస్ట్రీస్ బ్రిటిష్ ఆయిల్ కంపెనీతో కలిసి దీన్ని ఏర్పాటుచేసింది. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు.
64. జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు: రిలయెన్స్ ఇండస్ట్రీస్ తొలిసారిగా గతేడాది ముంబైలో ఈ మల్టీ-ఆప్షన్ స్టేషన్‌ను ఏర్పాటుచేసింది. ముంబైలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం.
65. రిలయెన్స్ జియో: 2016లో ప్రారంభించారు. ఇప్పుడు మన దేశంలో టాప్ మొబైల్ నెట్‌వర్క్ స్థాయికి ఎదిగింది. దేశవ్యాప్తంగా సరసమైన ధరకే ఇంటర్నెట్ సర్వీస్‌ను అందిస్తోంది.
66. సెవెన్-ఎలెవెన్: ఇదొక గ్లోబల్ అమెరికన్ కన్వీనియెన్స్ స్టోర్ చెయిన్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి 2021లో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది.
67. రిలయెన్స్ పాలీమర్స్: ప్యాకేజింగ్, అగ్రికల్చర్, ఫుట్‌బాల్ తదితర కన్జ్యూమర్ మెటీరియల్స్ తయారీలో వినియోగించే పాలీమర్ ప్రొడక్టులను ఉత్పత్తి చేస్తుంది.
68. జియో మార్ట్: ఇదొక ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం. నిత్యవసర సరుకులు, వస్తువులు, దుస్తులు తదితరాలను ఇందులో కొనుగోలు చేయొచ్చు. వినియోగదారులకు వాట్సాప్‌లో ఫస్ట్ ఫుల్ షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఈ సంస్థ ఈ ఏడాది మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
69. జియో స్మార్ట్ మానిటరింగ్: ఇదొక.. సెక్యూరిటీ వీడియో సర్వైలెన్స్ సిస్టమ్. దీని ద్వారా కస్టమర్లు మల్టిపుల్ కెమెరాలను ఒకే చోట లేదా వివిధ ప్రాంతాల్లో ఉండి మానిటర్ చేయొచ్చు.
70. డెన్ నెట్‌వర్క్స్: ఇదొక కేబుల్ టీవీ మరియు బ్రాడ్‌బ్యాండ్ డిస్ట్రిబ్యూటర్. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఇందులో 66 శాతం వాటాను 2018లో కొనుగోలు చేసింది.
71. హాథ్‌వే కేబుల్ అండ్ డాటాకామ్: ఇది మరొక కేబుల్ టీవీ డిస్ట్రిబ్యూటర్. ఇది మన దేశంలో తొలిసారిగా కేబుల్ టీవీ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్ చేసింది. రిలయెన్స్ సంస్థ 2018లో ఇందులో వాటాను కొనుగోలు చేసింది.
72. హామ్‌లేస్: ఇది.. ప్రపంచంలోనే అతి పురాతన బొమ్మల స్టోర్. సెవెన్ స్టోరీ ఫ్లాగ్‌షిప్‌కి లండన్‌లో బాగా ఫేమస్. దీన్ని 2019లో రిలయెన్స్ అక్వైర్ చేసుకుంది.
73. రిలయెన్స్ డిజిటల్: ఇది.. కన్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్. దీనికి దేశవ్యాప్తంగా 800 సిటీల్లో వేల సంఖ్యలో షాపులు ఉన్నాయి.
74. పేలెస్: ఇది.. అమెరికన్ డిస్కౌంట్ ఫుట్‌వేర్ బ్రాండ్. 2019లో దివాలా తీసింది. దీంతో మొదట అమెరికాలో మూసేశారు. రిలయెన్స్‌తో కలిసి ఇండియాలో రిటైల్ స్టోర్లను ఓపెన్ చేసింది.
75. కోచ్: ఇదొక.. అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్. హ్యాండ్ బ్యాగులు, వ్యాలెట్లు దీని ప్రత్యేకత. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి మన దేశంలో స్టోర్లను నిర్వహిస్తోంది.
76. జియార్జియో అర్మాని: ఇది.. ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి అర్మానీ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈఏ7 వంటి స్పినాఫ్ లేబుల్స్‌ను విక్రయిస్తోంది.
77. బర్బెరి: ఇది.. బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. ట్రెంచ్ కోట్లకు ఫేమస్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి మన దేశంలో స్టోర్లను నిర్వహిస్తోంది.
78. మదర్‌కేర్: ఇది.. బ్రిటిష్ మెటర్నిటీ మరియు చిల్డ్రన్స్ గూడ్స్ బ్రాండ్. ఇండియాలోకి తొలిసారి 2006లో ప్రవేశించింది. ఈ స్టోర్లని నిర్వహించే హక్కును రిలయెన్స్ 2018లో అక్వైర్ చేసుకుంది.
79. టిఫానీ అండ్ కంపెనీ: ఇది.. అమెరికన్ లగ్జరీ జ్యూలరీ బ్రాండ్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి 2020లో ఢిల్లీలో మొదటి స్టోర్‌ను ఓపెన్ చేసింది.
80. బోరీ బర్చ్: ఇది.. అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి ఈ ఏడాది ఆగస్టులో ముంబైలో పాపప్ స్టోర్‌ను ఓపెన్ చేసింది.
81. రిలయెన్స్ మాల్: ఇదొక షాపింగ్ సెంటర్ల చెయిన్. ఈ షాపింగ్ సెంటర్లు మన దేశంలోని 22 నగరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
82. కేట్ స్పేడ్: ఇది.. అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్. హ్యాండ్‌బ్యాగ్‌లకు పాపులర్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి 2016లో ఇండియాలో స్టోర్లను ఓపెన్ చేసింది.
83. మైఖేల్ కోర్స్: ఇది.. అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి మన దేశంలో ఎనిమిది స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.
84. సూపర్ డ్రై: ఇది.. బ్రిటిస్ ఫ్యాషన్ బ్రాండ్. పదేళ్ల కిందట రిలయెన్స్ రిటైల్‌తో కలిసి భారతదేశంలో స్టోర్లను లాంఛ్ చేసింది. వాటి సంఖ్య ఇప్పుడు దాదాపు 50కి చేరాయి.
85. జిమ్మీ చూ: ఇది.. బ్రిటిష్ ఫ్యాషన్ బ్రాండ్. వేల్స్ రాణి డయానాకు ఫేవరెట్‌గా పేరొందింది. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి ఇండియాలో స్టోర్లను ఓపెన్ చేసింది.
86. వయాకామ్18 స్టూడియోస్: ఇదొక మూవీ స్టూడియో. సినిమాలను నిర్మించటం, పంపిణీ చేయటం దీని పని. విదేశీ భాషల్లో సైతం చిత్రాలను రూపొందిస్తుంది.
87. జియో స్టూడియోస్: ఇది కూడా మూవీ స్టూడియోనే. వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు, కమర్షియల్స్ వంటి షార్ట్-ఫామ్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసుంది.
88. హ్యూగో బాస్: ఇది.. జర్మన్ ఫ్యాషన్ బ్రాండ్. మన దేశంలోకి 2003లో ఎంట్రీ ఇచ్చింది. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.
89. ఇరోస్ ఇంటర్నేషనల్: ఇది.. మూవీ స్టూడియో అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. 1977లో స్థాపించారు. ఇందులో 5 శాతం వాటాను రిలయెన్స్ 2018లో కొనుగోలు చేసింది.
90. పాల్ స్మిత్: ఇది.. బ్రిటిష్ ఫ్యాషన్ బ్రాండ్. 1970లో స్థాపించారు. రిలయెన్స్ రిటైల్‌తో కలిసి ఇండియలో స్టోర్లను నిర్వహిస్తోంది.
91. ముంబై ఇండియన్స్: ఇదొక క్రికెట్ టీమ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచింది. ఆ ట్వంటీ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
92. ఎయిర్ బీపీ-జియో: ఇదొక జాయింట్ వెంచర్. బీపీ అనే సంస్థతో కలిసి మన దేశవ్యాప్తంగా 30కి పైగా ఎయిర్‌పోర్టుల్లో విమాన ఇంధనాన్ని విక్రయిస్తోంది.
93. వయాకామ్18: ఇది కూడా ఒక జాయింట్ వెంచరే. పారామౌంట్ గ్లోబల్ అనే సంస్థతో కలిసి రిలయెన్స్ ఏర్పాటు చేసింది. దీనికి మన దేశంలో నంబరాఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఎంటీవీ, నికెలోడియన్ మరియు కామెడీ సెంట్రల్ వంటి లోకల్ వెర్షన్లు కూడా ఉండటం విశేషం.
94. నెట్‌వర్క్18: ఇది.. ముఖేష్ అంబానీ మీడియా సామ్రాజ్యం. ఇందులో టీవీ న్యూస్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు ఉన్నాయి. వాటిని వయాకామ్18 ద్వారా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు మ్యాగజైన్లను మరియు డైరెక్టరీలను ప్రచురించేందుకు పబ్లిషింగ్ యూనిట్ కూడా ఉంది.