NTV Telugu Site icon

Chillapalli-The Vintage Weavers: చీరలకు చిరునామా.. ‘‘చిల్లపల్లి’’

Whatsapp Image 2022 11 01 At 12.53.22

Whatsapp Image 2022 11 01 At 12.53.22

Chillapalli-The Vintage Weavers: మగువలకు చీరలంటే మక్కువ. అది తెలుగువారికి మరింత ఎక్కువ. ఎందుకంటే శారీస్‌ లేడీస్‌ చక్కదనాన్ని పెంచుతాయి. వాళ్లకు నిండుదనాన్ని నింపుతాయి. అమ్మతనాన్ని అద్దుతాయి. మహిళల జీవితంలోని మధురమైన ఘట్టాలన్నీ చీరలతో ‘‘ముడి’’పడి ఉన్నాయి. మనువు ముహూర్తం మొదలుకొని.. ముత్తైదువుతనం వరకు, నిశ్చితార్థం నుంచి శ్రీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ వాళ్ల సంతోషానికి చీరలు అద్దంపడతాయి. ఇలా చెప్పుకుంటూపోతే చీరలోని గొప్పతనం అంతా ఇంతా కాదు. అలాంటి చీరలకు ‘‘చిల్లపల్లి’’ చిరునామాగా నిలుస్తోంది.

చిల్లపల్లి నాగేశ్వరావు అండ్‌ సన్స్‌.. చేనేత చీరలకు ఐదు దశాబ్దాలుగా బ్రాండ్‌ నేమ్‌గా మారింది. 1971లో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సంస్థకు విజయవాడలో మూడు సిల్క్‌ షోరూమ్‌లు ఉన్నాయి. గతేడాది తొలిసారిగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లో కూడా ‘‘ది వింటేజ్ వీవర్స్’’పేరుతో షోరూమ్‌ని ఓపెన్‌ చేసింది. నగరంలోని మదీనగూడలో కూడా మరో షోరూమ్‌ ఉంది. డిజైనర్‌ చీరలు చిల్లపల్లి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా రూపొందించే చేనేత చీరలు ఇక్కడ లభిస్తాయి. హ్యాండ్‌వర్క్‌, హ్యాండ్‌లూమ్‌, ఫ్యాబ్రిక్‌ ఏదైనా దొరుకుతాయి.

చేనేత చీరలకు సంబంధించి మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వీవింగ్‌ యూనిక్‌నెస్‌, ఒక్కో ప్రింటింగ్‌ స్టైల్‌ ఉంటుంది. వాటన్నింటినీ చిల్లపల్లివారు తమ దగ్గర అందిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్‌ ప్రొడక్ట్స్‌ పైన ఫోకస్‌ పెట్టారు. 70 శాతం సొంత డిజైన్లనే విక్రయిస్తున్నారు. రెగ్యులర్‌ డిజైన్స్‌ ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. వాటిని జనరల్‌ ఐటమ్స్‌ కేటగిరీలో అమ్ముతారు. వేరే శారీస్‌తో పోలిస్తే హ్యాండ్‌లూమ్‌ శారీస్‌ కొంచెం ఎక్కువ కాస్ట్‌లీ అని చెప్పొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

హ్యాండ్‌లూమ్‌ అంటే చేనేత కళ. దీనికోసం నేత కార్మికులు (వీవర్స్‌) ఎంతో కష్టపడాలి. ఒక్క శారీని తయారుచేయాలంటే 17 ప్రక్రియలు ఉన్నాయి. ఒక్కో స్టెప్పూ ఎంతో ఓపిగ్గా, ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలి. ఇలా వివిధ దశలు దాటేసరికి వేజ్ రేట్‌ పెరుగుతుంది. దానివల్ల ప్రైసింగ్‌ అనేది కొంచెం హెవీగా అనిపిస్తుంది. గతంలో ప్రతి ఇంట్లోనూ ఒక మాస్టర్‌ వీవర్‌ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏరియాకి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. మాస్టర్‌ వీవర్‌ మాత్రమే అన్ని డిజైన్స్‌ చేయగలరు.

వీవింగ్‌ సెటప్‌ ఎలా చేయాలి?, లూమ్‌ లాక్‌ డిజైన్‌ ఎలా తీయాలి?, శారీ బోర్డర్‌ ఎలా సెట్‌ చేయాలి? అనే 17 దశల పైనా మాస్టర్‌కి పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా పవర్‌లూమ్స్‌ వచ్చేస్తున్నాయి. మిషనరీ ద్వారా ఒక్క రోజులో రెండు, మూడు చీరలు చేస్తున్నారు. హ్యాండ్‌లూమ్‌, పవర్‌లూమ్‌ ప్రొడక్ట్స్‌ ఒకేలా ఉంటాయి. కానీ హ్యాండ్‌లూమ్‌లో క్వాలిటీ వేరుగా ఉంటుంది. ‘‘చిల్లపల్లి నాగేశ్వరావు అండ్‌ సన్స్‌’’ ఫ్యామిలీలో ఇప్పుడు మూడో తరం ఈ టెక్స్‌టైల్‌ బిజినెస్‌ను నడుపుతోంది.

సొంత సంస్థయినా ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని ‘‘ది వింటేజ్ వీవర్స్’’ ఫౌండర్ శ్రీకర్ పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా డిజైన్స్‌, వీవింగ్స్‌ అర్థంచేసుకోవాలి. ఒక ప్రొడక్టును అమ్మాలంటే ముందు మనకు దానిపైన పూర్తి అవగాహన ఉండాలి. దాంట్లో ఏముందో కస్టమర్‌కి వివరించాలి. ఇలా చేయాలంటే ఆ ఉత్పత్తిలో ఉండే ప్రతిదాని గురించీ నేర్చుకోవాలి. దీనికి చాలా టైం పడుతుంది. ఇవి నేర్చుకోవటానికి నాకు నాలుగేళ్లు పట్టింది. చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే దేశం మొత్తమ్మీద 30 వీవింగ్స్‌ ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో యూనిక్‌నెస్‌ ఉంది. వాటిలో ప్రతిదాని గురించీ విడివిడిగా తెలుసుకోవాలి’’ అని తెలిపారు.

టెక్స్‌టైల్‌ బిజినెస్‌ గురించి, హైదరాబాద్‌లోని తమ సంస్థకు చెందిన రెండు షోరూమ్‌ల గురించి శ్రీకర్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నాకు ఫస్ట్‌ నుంచే ఈ వ్యాపారం మీద ఇంట్రస్ట్‌ ఉంది. కాలేజ్‌ డేస్‌ నుంచి అన్ని అంశాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ని. నా బాల్యం నాటికే మగ్గాలను వాడటం ఆపేశాం. మళ్లీ రీసెంట్‌గా స్టార్ట్‌ చేశాం. రెండేళ్ల కిందట. కొవిడ్‌కి ముందు. శారీస్‌లో గోల్డ్‌ను ఇంక్లూడ్‌ చేయటం ప్రస్తుతానికి కంచిలోనే జరుగుతోంది. ఆ వీవర్స్‌ వేరే ప్రాంతాలకు రారు. అక్కడే ఉంటారు. గోల్డ్‌ను ఇంక్లూడ్‌ చేయటం అనేది ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల కిందటి ఆలోచన.

కొన్ని శారీస్‌ ప్రిపరేషన్‌లో ఒక్కోదానికి ఇద్దరు మాస్టర్‌ వీవర్స్‌ ఇన్వాల్వ్‌ అవుతారు. ఒకరు బాడీకి. ఇంకొకరు బోర్డర్‌కి. కంచిలో రూపొందించే చీరల బోర్డర్స్‌లో నాలుగైదు రకాలు మాత్రమే ఉంటాయి. వాటిలోనే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేస్తూ ఉంటారు. కొన్ని శారీస్‌లో బాడీలో వచ్చే డిజైనే బోర్డర్‌లోనూ వస్తుంది. దీనివల్ల శారీ బాగా ఎలివేట్‌ అవుతుంది. కంచి, ఉప్పాడ, ధర్మవరం వంటి కొన్ని రకాల చీరల్లోనూ మా దగ్గర గోల్డ్‌ను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. కాకపోతే.. రెండు నెలల దాక వెయిటంగ్‌ పీరియెడ్‌ ఉంటుంది.

కస్టమర్‌కి డిజైన్‌ చూపించాలి. వాళ్లు అప్రూవ్‌ చేశాక వీవర్స్‌ అప్రూవల్‌కి పంపుతాం. గోల్డ్‌ లేకపోయినా మామూలుగా డిజైన్స్‌ కస్టమైజ్‌ చేయమన్నా చేస్తాం. గోల్డ్‌ ఎన్ని గ్రాముల వరకు కస్టమైజ్‌ చేయించుకోవాలనేది మన బడ్జెట్‌ని బట్టి ఉంటుంది. గ్రామ్స్‌ ఎక్కువైనంత మాత్రాన శారీ వెయిట్‌ పెరగదు. శారీ మొత్తానికి గోల్డ్‌ డిస్ట్రిబ్యూట్‌ అవటం వల్ల బరువు తగ్గుతుంది. అయినా.. శారీ వెయిట్‌ ఉంటేనే క్వాలిటీ ఉన్నట్లు. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా సేల్స్‌ బాగానే ఉన్నాయి. కానీ.. కస్టమర్‌ టేస్ట్‌ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

ఏపీ వాళ్ల టేస్ట్‌కి, తెలంగాణవాళ్ల టేస్ట్‌కి తేడా ఉంది. రెండింటినీ మనం కలిపి చూడలేం. డిజైన్స్‌ ఒకేలా ఉంటాయి. కానీ కలర్‌ ఆప్షన్స్‌ మారుతుంటాయి. కొంత మంది లైట్‌ కలర్స్‌, మరికొంత మంది డార్క్‌ కలర్స్‌ ఇష్టపడుతుంటారు. ఏ డిజైన్‌కి ఏ కలర్‌ సూటబుల్‌ అనేది స్పెషల్‌ (ఫ్యాషన్‌ టెక్నాలజీ) టీం నిర్ణయిస్తుంది. ఒక శారీ ఔట్‌పుట్‌ రావటానికి నంబర్‌ ఆఫ్‌ కాంబినేషన్స్‌, కలర్స్‌, బోర్డర్‌ డిజైన్స్‌, బాడీ డిజైన్స్‌ పరిశీలిస్తాం. సాఫ్ట్‌వేర్‌లో అన్నీ ఫైనల్‌ కావటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది.

అంతా ఓకే అయ్యాక వీవ్‌ చేయటానికి మరో పదీ పదిహేను రోజులు పడుతుంది. మొత్తం ప్రక్రియ 20 రోజుల పాటు సాగుతుంది. ఇప్పటికీ బెస్ట్‌ కాంబినేషన్స్‌ అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు వాడినవేనని చెప్పొచ్చు. రెడ్‌ అండ్‌ గోల్డ్‌, ఎల్లో అండ్‌ రెడ్‌, ఎల్లో అండ్‌ గ్రీన్‌.. ఈ కాంబినేషన్స్‌ ఇప్పటికీ ట్రెండింగే. కలంకారిలోనూ కస్టమైజేషన్‌, డిజైనింగ్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఐదారు నెలల వరకు వెయిటింగ్‌ పీరియెడ్‌ ఉంటుంది. వీటిని ఒక వ్యక్తి మాత్రమే డిజైన్‌ చేస్తారు. కలంకారీ చీర వందేళ్లయినా కలర్‌ ఫేడ్‌ఔట్‌ అవదు.

బెనారస్‌లో డిజైన్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. బోర్డర్‌ సింపుల్‌గా వస్తుంది. బాడీ డిజైన్‌ మారుతూ ఉంటుంది. అకేషన్‌ ఏదైనా బెనారస్‌ శారీ సూట్‌ అవుతుంది. టెక్స్‌టైల్‌ వ్యాపారం.. రెగ్యులర్‌, కమర్షియల్‌ బిజినెస్‌ కాదు. ఇదొక సంప్రదాయ వర్తకం. వినియోగదారుడు సంతృప్తి చెందటం చాలా ముఖ్యం. వాళ్ల గుడ్‌విల్‌ కావాలి మనకి. మన ప్రొడక్టులకు యూనిక్‌నెస్‌ ఉండాలి. ఆ ప్రత్యేకతను కస్టమర్లకు వివరించగలగాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, లక్ష్యాలుగా నిర్దేశించుకొని వ్యాపారం చేయాలి. ఈ బిజినెస్‌ను చదివి నేర్చుకోవాలంటే ఎలాంటి కోర్సులూ లేవు. సీ, లెర్న్‌ అండ్‌ ఓన్‌ ఇట్‌. ఇదే సూత్రం. మా విజయ రహస్యం.