Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Che Guevara: మిలిటరీ దుస్తులు.. ఒత్తైన గడ్డం.. తలపై నక్షత్రం ఉన్న బెరెట్ క్యాప్.. పెదవుల మధ్య సిగార్.. ప్రపంచవ్యాప్తంగా విప్లవానికి, తిరుగుబాటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రూపం అది. ‘చేగువేరా’ అనగానే మనకు గుర్తొచ్చేది గెరిల్లా యుద్ధాలు, సామ్రాజ్యవాదంపై ఆయన చేసిన పోరాటాలే. కానీ, ఆ వీరుడి పోరాట పంథా వెనుక, ఆ కాంతివంతమైన కళ్ల వెనుక ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో అద్భుతమైన నిజాలు దాగున్నాయి. యుద్ధ రంగంలో శత్రువుకు సైతం వైద్యం చేసిన మానవతావాదిగా.. మంత్రి పదవిలో ఉండి కూడా సాధారణ కూలీగా మారిన నిరాడంబరుడిగా ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన కోణాలు ఉన్నాయని మీకు తెలుసా. నేడు (జూన్ 14) చేగువేరా జయంతి సందర్భంగా.. ఆ మహా యోధుడికి సంబంధించిన కొన్ని అత్యంత ఆసక్తికరమైన, అరుదైన విషయాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
1. శత్రువులకు కూడా ఉచితంగా వైద్యం చేసిన డాక్టర్!
అర్జెంటీనాలోని రోసారియోలో 1928, జూన్ 14న చేగువేరా జన్మించారు. బాల్యం నుంచే ఆయన ఎంతో చురుకైన స్వభావం కలవారు. చేగువేరా వృత్తిరీత్యా వైద్యుడు (ఎండీ) అన్న సంగతి తెలిసిందే. అయితే విప్లవ పోరాటంలో ఆయుధం పట్టిన తర్వాత కూడా ఆయన తన వృత్తిని ఏనాడు మర్చిపోలేదు. యుద్ధ రంగంలో గాయపడిన తన తోటి గెరిల్లా సైనికులకే కాకుండా, తమపై దాడి చేసి పట్టుబడిన శత్రు దేశపు (ప్రభుత్వ) సైనికులకు కూడా చేగువేరా స్వయంగా వైద్యం చేసేవారు. మానవత్వానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత అది.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
2. ఐరన్ మ్యాన్: శారీరక లోపాన్ని సవాల్ చేసిన వీరుడు
ఆయనకు రెండేళ్ల వయసు నుంచే తీవ్రమైన అస్తమా (ఉబ్బసం) వ్యాధి ఉండేది. ఎంతలా అంటే, ఒక్కోసారి శ్వాస ఆడక స్పృహ తప్పి పడిపోయే అంతలా ఆయన ఈ వ్యాధితో బాధపడ్డారు. కానీ, ఆయన ఏనాడు ఆ వ్యాధికి లొంగిపోలేదు. తన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కఠినమైన రగ్బీ ఆట ఆడేవారు. అందుకే ఆయనను సహచరులు “ఫ్యూజర్” (Fuser – అంటే దూకుడుగా ఆడేవాడు) అని పిలిచేవారు.
3. ‘చే’ అనే పేరు వెనుక అసలు రహస్యం..
ఆయన అసలు పేరు అర్నెస్టో గువేరా. మరి ‘చే’ (Che) అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.. అర్జెంటీనా భాషలో ‘చే’ అంటే మన తెలుగులో “ఏమండీ”, “భయ్యా” లేదా “మిత్రమా” (Hey / Buddy) అని అర్థం. అర్నెస్టో మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాక్యంలోనూ “చే.. చే..” అని ఎక్కువగా వాడుతుండేవారట. దీంతో క్యూబన్ సహచరులు ఆయనకు “చే గువేరా” అని పేరు పెట్టేశారని చెబుతారు. చివరికి అదే ప్రపంచాన్ని ఊపేసిన పేరుగా మారింది.
4. క్యూబా నేషనల్ బ్యాంక్ గవర్నర్ & పరిశ్రమల శాఖ మంత్రి!
విప్లవం గెలిచిన తర్వాత ఫిడెల్ క్యాస్ట్రో నేతృత్వంలోని క్యూబా ప్రభుత్వంలో చేగువేరా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన క్యూబా కేంద్ర బ్యాంక్ (National Bank of Cuba) గవర్నర్‌గా, అలాగే పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. విశేషం ఏంటంటే.. క్యూబా కరెన్సీ నోట్ల మీద ఆయన తన పూర్తి పేరు రాయకుండా, కేవలం “Che” అని మాత్రమే సంతకం చేసేవారు. డబ్బుపై ఉన్న వ్యామోహాన్ని నిరసించడానికే ఆయన అలా షార్ట్‌గా సంతకం చేసేవారట.
5. మంత్రి అయినా.. వారంతాల్లో సాధారణ కూలీగా!
అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన లగ్జరీ జీవితానికి దూరంగా ఉన్నారు. మంత్రి హోదాలో ఉండి కూడా, ప్రతి శని, ఆదివారాల్లో (వీకెండ్స్) సాధారణ కార్మికులతో కలిసి స్వచ్ఛందంగా శ్రమదానం చేసేవారు. చెరకు తోటల్లో కోత కోయడం, టెక్స్టైల్ మిల్లుల్లో బస్తాలు మోయడం, నిర్మాణ రంగంలో ఇటుకలు మోయడం వంటి పనులను ఆయన స్వయంగా చేసేవారు.
6. ఆ ప్రసిద్ధ ఫోటో వెనుక కథ
మనం టీ-షర్టులపై, బైకులపై చూసే చేగువేరా లాంగ్ హెయిర్, బెరెట్ క్యాప్ ఉన్న ఫోటోను అల్బెర్టో కోర్డా అనే ఫోటోగ్రాఫర్ 1960లో తీశారు. అయితే, ఆ రోజు ఒక విమాన ప్రమాదంలో చనిపోయిన వారి అంత్యక్రియల సభ జరుగుతోంది. చేగువేరా స్టేజ్ మీద కేవలం కొన్ని సెకన్లు మాత్రమే అలా నిలబడ్డారు. ఆ క్షణంలో కోర్డా క్లిక్ మనిపించిన ఫోటో అది. విశేషం ఏంటంటే, ఈ ఫోటో ప్రపంచంలోనే అతిఎక్కువగా రీ-ప్రొడ్యూస్ (ప్రింట్) చేయబడిన ఫోటోగా చరిత్రకెక్కింది.
7. నట్ హమ్సన్ “హంగర్” నవల అంటే ప్రాణం
చేగువేరా గొప్ప పుస్తక ప్రేమికుడు. యుద్ధ భూమిలో కూడా బ్యాగులో పుస్తకాలను మోసుకెళ్లేవారు. నార్వేజియన్ రచయిత నట్ హమ్సన్ రాసిన “హంగర్” (Hunger) నవల అంటే ఆయనకు పిచ్చి. బహుశా ఆ పుస్తక ప్రభావం వల్లేనేమో.. యావత్ ప్రపంచంలో ఆకలి అనేదే ఉండకూడదని ఆయన అంతలా తపించారు.
8. కాంగో, బొలీవియా ఉద్యమాలు.. తుది శ్వాస వరకు పోరాటం!
క్యూబా పునర్నిర్మాణంతోనే చేగువేరా సంతృప్తి చెందలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించాలనే ఆశయంతో కాంగో, బొలీవియా దేశాల విముక్తి కోసం ఆయన ఉద్యమించారు. కాంగో పోరాటంలో ఆయన దళానికి ఆశించిన విజయం దక్కలేదు. అనేకమంది విప్లవకారులు మరణించడంతో మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత బొలీవియా విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. 1967 అక్టోబర్ 6న బొలీవియా సైనిక దళాలకు చేగువేరా బందీగా చిక్కారు. శత్రువుల బందీగా ఉన్నప్పటికీ ఆయన కళ్లల్లో భయం లేదు. నేరుగా శత్రువుల కళ్లల్లోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడారు. “నన్ను మీరు చంపగలరేమో.. కానీ నా ఆశయాలను చంపలేరు” అని శత్రువుల ముందే నినదించారు. 1967, అక్టోబర్ 9న బొలీవియా సైన్యం ఆయన్ను తూటాలకు బలి చేసింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన చనిపోయినా.. ఒక డాక్టర్‌గా, రైటర్‌గా, మిలిటరీ జనరల్‌గా, పాలకుడిగా ఆయన సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ఇప్పటికి జనాల్లో చావలేదు. అందుకే తరాలు మారినా ‘చే’ పేరును చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!