Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, తెలివైన వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. తన చాణక్య నీతిలో ఆయన ప్రతి పరిస్థితిలోనూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పించే జీవిత సూత్రాలను వివరించారు. చాణక్య నీతిని అర్థం చేసుకుంటే జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో సరైన మార్గాన్ని ఈజీగా గుర్తించే టెక్నిక్ అలవడుతుంది. ఎందుకంటే ఆయన తన చాణక్య నీతిలో అనేక జీవిత నియమాలను విపులంగా వివరించారు. ఆయన కొన్ని సమస్యలను చాలా తీవ్రంగా వర్ణించారు. వాస్తవానికి ఆ సమస్యలను ఆయన మరణంతో పోల్చారు. చాణక్య మరణంతో పోల్చిన నాలుగు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్
చాణక్య నీతి ప్రకారం.. ఆ నాలుగు విషయాలు..
గొడవపడే భార్య: జీవితాతం తోడుగా ఉంటే అర్థాంగి (భార్య) దుష్ట స్వభావాన్ని కలిగి ఉంటే ఇంట్లో సంతోషం ఉండదని చాణక్యుడు చెప్పారు. అంటే ఆమె తరచుగా గొడవపడుతుంటే, ఇతరుల పట్ల అసూయను కలిగి ఉంటే, తన భర్త లేదా కుటుంబాన్ని అగౌరవపరిస్తే, అలాంటి ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండదని చాణక్యుడు వివరించారు. అటువంటి పరిస్థితిలో పురుషుడి మనస్సు నిరంతరం ఉద్రిక్తత, అసంతృప్తితో నిండి ఉంటుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి బయటి ప్రపంచంలో ఎన్ని విజయాలు సాధించినా, ఇంట్లో శాంతి లేకపోతే, జీవితంలో ఆనందం కోల్పోతాడని వెల్లడించారు.
మోసపూరిత స్నేహితుడు: మోసపూరితమైన స్నేహితుడు అత్యంత ప్రమాదకరమైనవాడని చాణక్యుడు చెప్పారు. అలాంటి వారు మీ ముందు నవ్వుతూ ఉంటారని, కానీ మీకు వెన్నుపోటు పొడుస్తారని చెప్పారు. అలాంటి స్నేహితుడిని నమ్మడం ఆత్మహత్యాసదృశం అని ఆయన పేర్కొన్నారు. చాణక్యుడి ప్రకారం.. తనకు అవసరం అయినప్పుడు మీతో ఉండి, మీకు అత్యవరసం అయిన సందర్భంలో అదృశ్యమయ్యే స్నేహితుడు “శత్రువు లాంటివాడు” అని చెప్పారు. అలాంటి వ్యక్తి మీ మనస్సు, ఆత్మవిశ్వాసం రెండింటినీ నాశనం చేయగలడని వెల్లడించారు.
చాడిలు చెప్పేవాడు: ఒక సేవకుడు ప్రతిదానికీ వాదిస్తుంటే, తన యజమానితో అసభ్యంగా ప్రవర్తిస్తే, లేదా చెప్పిన పనులను వాయిదా వేసే అలవాటు ఉన్నా, అలాంటి వ్యక్తి ఉన్న ఇంట్లో క్రమంగా మానసిక ప్రశాంతత నాశనం అవుతుందని చాణక్య చెప్పారు. అలాంటి వ్యక్తి పనిని ఆలస్యం చేయడమే కాకుండా కుటుంబంలో, కార్యాలయంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాడని హెచ్చరించారు.
పాములు ఉన్న ఇంట్లో నివసించడం: విషపూరిత పాములు, శత్రువులు లేదా ఒత్తిడితో కూడిన వాతావరణం వంటి పరిస్థితులు ఉన్న ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తుంటే, అలాంటి వ్యక్తి నిరంతరం భయంతో జీవిస్తారని చాణక్య చెప్పారు. అలాంటి వ్యక్తి శారీరకంగా జీవించి ఉండవచ్చు, కానీ మానసికంగా నిత్యం చనిపోయి బతకాల్సి వస్తుందని వెల్లడించారు.
READ ALSO: Minuteman 3 Missile: అగ్రరాజ్యం అణు గర్జన.. మినిట్‌మ్యాన్-3 శక్తి ఎంత!
