Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Tea Gardens : ఇండియాలో టీ అంటే కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అదొక అనుభూతి. సరికొత్త ఉదయాన్ని ఉత్సాహంగా ప్రారంభించడాని, రోజంతా కష్టపడి పని చేయడాని చాలా మంది ఎంచుకునే ఉత్తమ ఎంపిక ఒక కప్పు టీ. దేశంలోని వివిధ ప్రాంతాలలో టీ రుచులు, సువాసనలు, వాటిని తయారు చేసే పద్ధతులు వేరు వేరుగా ఉంటాయి. మీరు టీ లవర్స్ అయితే, భారతదేశంలోని ప్రసిద్ధ టీ తోటలను జీవితంలో ఒక్కసారైన తప్పకుండా చూడాలి. ఆ ప్రదేశాల్లో మీరు టీ తో పాటు అందమైన ప్రకృతి దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ స్టోరీలో ఇండియాలో ఉన్న ప్రసిద్ధమైన టీ తోటల గురించి తెలుసుకుందాం.
READ ALSO: NZB MURDERS: కిరాతక హత్యలు..!!
Also Read
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ టీకి చాలా ఫేమస్. ఇక్కడి మృదువైన సువాసన గల టీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి కాంచన్‌జంగా పర్వత శ్రేణుల అందాలు, బ్రిటిష్ కాలం నాటి పాత బంగళాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. మెట్ల మాదిరిగా ఉండే టీ తోటల్లో నడుస్తూ ఆకులను కోసే కళాకారులను ఇక్కడ నేరుగా కలుసుకోవచ్చు.
అస్సాం (అస్సాం లోయ)
అస్సాం టీ గొప్ప, ఘాటైన రుచిని కలిగి ఉండి, చాలా మందికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు విస్తారమైన టీ తోటలను అన్వేషించవచ్చు, టీ ఆకు నుంచి కప్పు వరకు టీ ఎలా రెడీ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఫ్యాక్టరీలను కూడా సందర్శించవచ్చు. బ్రహ్మపుత్ర నదిపై పడవ ప్రయాణాలు, స్థానిక మార్కెట్ల సందర్శన ఈ టూర్‌ను మరింత మెరబుల్‌గా చేస్తాయి.
మున్నార్ (కేరళ)
కేరళలోని మున్నార్ పచ్చని కొండలు, తేయాకు తోటలు పర్యాటకులను ఎంతోగానో కనువిందు చేస్తాయి. ఇక్కడి తేయాకు చాలా ఘాటుగా ఉంటుంది. మీరు ఫ్యాక్టరీని సందర్శించి, తేయాకు తయారీ ప్రక్రియ మొత్తాన్ని దగ్గరగా గమనించవచ్చు. చల్లని ఉదయాలు, తేలికపాటి పొగమంచుతో కూడిన వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తాయి. ఇక్కడ మీరు పీస్‌ఫుల్ టైంను గడపవచ్చు.
నీలగిరి (తమిళనాడు)
నీలగిరి పర్వతాలు టీకి ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి నీలి కొండలు, సుందరమైన నడక మార్గాలు ఈ టూర్‌ను పర్యాటకులకు చిరస్మరణీయంగా మారుస్తాయి. మీరు పాత టీ తోటలను సందర్శించి, వివిధ రకాల టీలను రుచి చూడవచ్చు. ఇక్కడి చిన్న టీ మ్యూజియం, ఫ్యాక్టరీ ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
కాంగ్రా లోయ (హిమాచల్ ప్రదేశ్)
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయ టీకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చిన్న టీ తోటలు పర్వతాల మధ్య ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ, మీరు సాంప్రదాయ టీ తయారీ పద్ధతులను నేర్చుకోవచ్చు, అలాగే ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా ఆస్వాదించవచ్చు. మంచుతో కప్పబడిన పర్వతాలు, హాయిగా ఉండే గ్రామాలను సందర్శించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా చెబుతారు. మీరు టీ లవర్స్ అయితే సెలవుల్లో మీ కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి ఈ ప్రదేశాలను సందర్శించడం మర్చిపోకండి.
READ ALSO: Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?