NTV Telugu Site icon

Health Tips: ఇలా చేస్తే ఏడు రోజుల్లో ఎంత కొవ్వు అయినా ఇట్టే కరిగిపోవాల్సిందే

New Project (22)

New Project (22)

Health Tips : ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందిపెడుతున్న సమస్య ఊబకాయం.. మారిన జీవనశైలి కారణంగా జనాల్లో వేలాడే పొట్టలు కామన్ అయ్యాయి. వారు తమ పొట్టలను తగ్గించుకునేందుకు నానాపాట్లు పడుతుంటారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. లైపోసెక్షన్ ఆపరేషన్లు చేయించుకుంటూ ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. అలాంటి వారికి చక్కటి చిట్కా.. ఇది పాటిస్తే ఎంతటి వేలాడే పొట్టయినా వారం రోజుల్లో ఇట్టే కరిగిపోవాల్సిందే. ఈ చిట్కా కోసం మనం బెల్లం, జీలకర్ర రెండింటినీ ఉపయోగిస్తున్నాం. జీలకర్ర బరువును తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడుతుంది. ఆహారం బాగా జీర్ణమై, కొవ్వు గా మారకుండా.. శక్తిగా మారుస్తుంది. జీలకర్ర కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువు కోల్పోయినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి. అయితే జీలకర్ర బరువు తగ్గినప్పుడు, ఎముకలు బలహీనంగా మారకుండా, బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే జీలకర్రలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది.

Read Also: LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు

ఈ కాల్షియం ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.. ఈ రెమిడి 15 రోజులపాటు ఫాలో అయితే తేడా మీకే తెలుస్తుంది. ఆ తేడా చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి, జిలకర లో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి చేరతాయి. ఇలా ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగించిన తర్వాత జీలకర్ర లోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. నీళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. ఈ నీళ్లు కలర్ మారిందంటే జీలకర్ర లో ఉన్న పోషకాలు నీటిలోకి వచ్చినట్లే. తరవాత బెల్లం వీలైనంత వరకు ఆర్గానిక్ బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి. కెమికల్స్ వేసిన బెల్లం అయితే పసుపు రంగులో ఉంటుంది. బాగా మరిగిన తర్వాత ఈ నీటిని గ్లాసులో వడగట్టుకుని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ నీటిని తాగిన తర్వాత అరగంట తర్వాత కాఫీ, లేదా టీ తాగాలి. అంటే కాఫీ టీ తాగడానికి అరగంట ముందు ఈ నీటిని తాగాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది. ఈ నీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం కనబడుతుంది.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.