Farmer Success Story: ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్‌ను కేవలం వినోద సాధనంగా మాత్రమే వినియోగిస్తున్నారు. యూట్యూబ్ చూడటానికో, లేదంటే ఓటీటీలో సినిమాలను చూడటానికో వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ చాలా మందికి భిన్నంగా ఒక రైతు ఇంటర్నెట్‌ను వాడి కోటీశ్వరుడు అయ్యాడు. ఇంతకీ ఇంటర్నెట్‌ను వాడి ఆయన అలా ఎలా కోటీశ్వరుడు కాగలిగాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Earth Water: భూ గ్రహంపైకి నీరు ఎలా వచ్చింది.? నాసా సమాధానం ఇదే..
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని బెల్సాండి గ్రామానికి చెందిన జీవేష్ చౌదరి.. ఒక రైతు. నిజానికి మనోడు అందరిలాగా ఇంటర్నెట్‌ను కేవలం వినోద సాధనంగా మాత్రమే వినియోగించలేదు. తన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వాడుకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఈ సందర్భంగా జీవేష్ చౌదరి మాట్లాడుతూ.. గూగుల్ నుంచి కొత్త వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని, తన వ్యవసాయ భూమిలో అధునాతన G-9 రకం అరటిపండ్లను పండిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటిపారుదల నిర్వహణ, గూగుల్ నుంచి సరైన ఎరువుల వాడకంపై సమాచారాన్ని సేకరించానని వివరించారు. బీహార్ ప్రభుత్వం అందించిన సబ్సిడీ మొక్కలు కూడా తన ప్రయత్నాలను మరింత బలోపేతం చేశాయని, ప్రస్తుతం తన పొలంలో ఉత్పత్తి చేస్తున్న అరటిపండ్లు దాదాపు 4 అడుగుల పొడవు, అధిక నాణ్యత కలిగి ఉంటాయని వెల్లడించారు. ఇవి స్థానిక వ్యాపారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. లాభం పరంగా ఒక అరటి కట్టాకు సుమారు రూ.10 వేలు సంపాదిస్తు్న్నట్లు తెలిపారు. మార్కెట్ అనుకూలంగా ఉన్న టైంలో ఈ లాభం మరింత పెరుగుతుందని వెల్లడించారు. నిజానికి జీవేష్ విజయం జిల్లాలోని ఇతర రైతులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.
