Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Suit Chef: సాధారణంగా రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్మే చెఫ్‌లు ఎలా కనిపిస్తారు? సాదాసీదా దుస్తులు, ముఖమంతా చెమటలు, వంట చేయడంలో బిజీగా ఉంటారు. కానీ ఒక 19 ఏళ్ల కుర్రాడు మాత్రం బ్రాండెడ్ సూట్, బూట్లు వేసుకుని, నోట్లో సిగరెట్ పెట్టుకుని, స్టైలిష్‌గా కన్ను కొడుతూ ఫ్రైడ్ రైస్ అమ్ముతున్నాడు. అతని డిఫరెంట్ లుక్, వంట చేసే స్టైల్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ క్రేజ్‌తోనే అతను నెలకు ఏకంగా 50,000 యువాన్లు (సుమారు రూ.7 లక్షల రూపాయలు) సంపాదిస్తూ వార్తల్లో నిలిచాడు. అసలు ఏం జరిగిందంటే..
17 ఏళ్లకే వ్యాపారంలోకి..
‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్, యాంటాయ్కి చెందిన ‘లూ’ అనే 19 ఏళ్ల కుర్రాడు నైట్ మార్కెట్లో ఈ ఫ్రైడ్ రైస్ స్టాల్ నడుపుతున్నాడు. లూ కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. చిన్న వయసులోనే కుటుంబానికి అండగా మారుడు. ఈ క్రమంలో లూ.. తన వ్యాపారాన్ని మిగతా వారి కంటే భిన్నంగా మార్చాలనుకున్నాడు. తనను తాను మరింత స్టైలిష్‌గా చూపించుకోవడానికి ఒకరోజు వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ‘సూట్’ వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఐడియానే అతని జీవితాన్ని మార్చేసింది.
Also Read
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
- World's First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
- 116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
వంట చేస్తూ హీరో రేంజ్ స్టైల్..
లూ కేవలం సూట్ వేసుకోవడమే కాదు, వంట చేసేటప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల హీరో ఫోజ్‌లు పెడుతుంటాడు. బాణలిలో రైస్‌ను గాల్లోకి విసిరేస్తూ స్టైల్‌గా జుట్టును వెనక్కి దువ్వుకోవడం, ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్ల వైపు చూస్తూ కెమెరాకు కన్ను కొట్టడం, కుటుంబ సభ్యులు దూరం నుంచి విసిరిన కోడిగుడ్లను గాల్లోనే స్టైలిష్‌గా క్యాచ్ పట్టుకోవడం, బాణలిలో మిగిలిపోయిన ఆహారాన్ని విసిరేస్తూ.. ఒక మోకాలిని పైకి ఎత్తి డ్యాన్స్ భంగిమలో కనిపించడం, వీటన్నింటితో పాటు వంట మరింత స్టైలిష్‌గా కనిపించడం కోసం ఒక వెలిగించని సిగరెట్‌ను నోట్లో వేలాడదీసుకుంటాడు (కానీ దాన్ని అస్సలు తాగడు).
3 నిమిషాల్లో ఆర్డర్ రెడీ.. రోజుకు 200 ప్లేట్లు
లూ ను సోషల్ మీడియాలో 46,000 మందికి పైగా ఫాలోవర్లు ఫాలో అవున్నాడు. తను స్టైలిష్‌గా వంట చేసే వీడియోలను అందులో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దాంతో అతని షాప్‌కు కస్టమర్ల క్యూ కట్టారు. ఈ దుకాణంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. రద్దీ సమయాల్లో లూ కేవలం మూడు నిమిషాల్లోనే ఒక ఫ్రైడ్ రైస్ బౌల్‌ను రెడీ చేసి ఇస్తాడు. తన స్టాల్లో రోజుకు 200 కంటే ఎక్కువ ఫ్రైడ్ రైస్ ప్లేట్లు అమ్ముడవుతాయని లూ చెప్పాడు. ఒక్కో ప్లేట్ ధర సుమారు 10 యువాన్లు (సుమారు $1.5 డాలర్లు). దీని ప్రకారం.. ఈ స్టాల్ నెలవారీ టర్నోవర్ 50,000 యువాన్లు (రూ.7 లక్షలు) కాగా.. అన్ని ఖర్చులు, పెట్టుబడులు తీసివేసిన తర్వాత నెలకు నికరంగా 20,000 యువాన్ల (సుమారు రూ.2.3 లక్షలు) లాభం మిగులుతోందని లూ ఆనందం వ్యక్తం చేశాడు. తన తండ్రి వంటలో, కటింగ్ పనుల్లో సహాయం చేయడం వల్లే, తాను ఈ హోటల్‌ను ఇంత సక్సెస్‌పుల్‌గా రన్ చేయగలుగుతున్నాడని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
E20 JANTA PARTY: సీజేపీ తర్వాత, “E20 జనతా పార్టీ” పుట్టుకొచ్చింది.. వీళ్ల డిమాండ్ ఇదే..
-
Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
-
CJP: పంజాబ్, కర్ణాటక పేపర్ లీకుల మాటేమిటి.. కాక్రోచ్ల మౌనం ఎందుకు..?
-
IND Vs ZIM: మారని అభిషేక్ శర్మ తీరు.. మరోసారి నిరాశ.. జింబాబ్వేతో ముడో టీ20..
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
ట్రెండింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!