నిఖిల్ సిద్ధార్థ్… ‘హ్యాపీడేస్’ గోయింగ్ ఆన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 1 పుట్టిన రోజు సందర్భంగా)
చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభాపాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్ లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని ‘హ్యాపీడేస్’ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించినా, పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ఆ సినిమానే! ఆ తర్వాత ఇక నిఖిల్ వెనుదిరిగి చూసుకునే ఛాన్సే దక్కలేదు. అయితే… దానికి కేవలం అదృష్టం కారణమని చెప్పలేం. ఎందుకంటే ఈ పుష్కర కాలంలో అతన్ని పలు పరాజయాలూ పలకరించాయి. కానీ వాటికి వెరవకుండా ముందుకు సాగాడు. చిత్రసీమలోని స్నేహితుల సహకారంతో తిరిగి విజయపథంలోకి వచ్చాడు. ‘యువత’ సినిమాతో సోలో హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కు అసలు సిసలు ఘనవిజయం 2013లో ‘స్వామి రారా’తో దక్కింది. ఆ తర్వాత వచ్చిన ‘కార్తికేయ’ మూవీ విడుదల సమయంలో బాలారిష్టాలను ఎదుర్కొన్నా… నిఖిల్ ఖాతాలో మరో గ్రాండ్ సక్సెస్ ను జమ చేసింది.
‘స్వామి రారా’ విజయం ఇచ్చిన స్ఫూర్తితో నిఖిల్ భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్ గా ఎంతటి విజయాన్ని సాధించాయనే విషయాన్ని పక్కన పెడితే, అటు నటుడిగా నిఖిల్ కు, ఇటు ప్రేక్షకులకు చక్కని తృప్తినైతే ఇచ్చాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సూర్య వర్సెస్ సూర్య’. ఈ మూవీతోనే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలోనే నిఖిల్ నటించిన ‘కేశవ’ యాక్షన్ చిత్రాల అభిమానులను అలరించింది. మరోసారి నటుడిగా నిఖిల్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది. కన్నడ రీమేక్ ‘కిర్రాక్ పార్టీ’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా…. మరో తమిళ రీమేక్ ‘అర్జున్ సురవరం’ నిఖిల్ లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఇంకోసారి వెలికి తీసింది.
విశేషం ఏమంటే… 34 సంవత్సరాల వయసులో నిఖిల్… డాక్టర్ పల్లవి వర్మను ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. గత యేడాది మే 14న వీరి వివాహం నిరాడంబరంగా హైదరాబాద్ లో జరిగింది. బహుశా భార్య ప్రోత్సాహం వల్ల కావచ్చు ఇప్పుడు నితిన్ లైఫ్ స్టైల్ మారిపోయింది. అతనిలోని మానవతా వాది బయటకు వచ్చాడు. గత నెలా పదిహేను రోజులుగా నితిన్ కరోనా బాధితుల సేవలో తల మునకలై ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా, బ్లాక్ ఫంగస్ బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాడు.
Also Read
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
- Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!
ఇక సినిమాల విషయానికి వస్తే… చందు మొండేటి దర్శకత్వంలోనే నిఖిల్ ఇప్పుడు ‘కార్తికేయ -2′ లో నటిస్తున్నాడు. అలానే ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, కథనం అందిస్తున్న ’18 పేజీస్’ మూవీలోనూ చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఇది కాకుండా తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలోనూ ఓ సినిమాకు నిఖిల్ కమిట్ అయ్యాడు.
‘నేను లోకల్’ అని గర్వంగా చెప్పుకునే ఈ బేగం పేట బోయ్… హ్యాపీడేస్ మరిన్ని దశాబ్దాలపాటు కొనసాగాలని కోరుకుందాం…
హ్యాపీ బర్త్ డే నిఖిల్!!
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!