NTV Telugu Site icon

Mark Antony Review: మార్క్ ఆంటోని రివ్యూ

Mark Antony Review

Mark Antony Review

Mark Antony Review In Telugu : హీరో విశాల్ సరైన హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఎలా అయినా, హిట్ కొట్టాలని చూస్తున్న ఆయన ఈసారి మార్క్ ఆంటోని అనే సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో కూడిన గాంగ్ స్టర్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, అభినయ లాంటి నటీనటులు ఉండడమే. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. అలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
సినిమా అంతా 1975-95 మధ్య జరిగిన కథ. ఆంటోనీ (విశాల్), జాకీ మార్తాండ (ఎస్.జె. సూర్య) ప్రాణ స్నేహితులైన గ్యాంగ్‌స్టర్స్. ఆంటోనీ మరణించగా అతని కొడుకు మార్క్ (విశాల్)ను జాకీ కన్నకొడుకు కంటే ఎక్కువలా పెంచుతాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం మార్క్ జాకీ ఇంట్లోనే ఉంటున్నా, కత్తులు, తుపాకులు పట్టకుండా మెకానిక్ అయ్యి కష్టం చేసుకుని బతుకుతూ ఉంటాడు. తల్లిని చంపిన తండ్రి మీద పీకల్లోతు పగ పెంచుకున్న మార్క్ కి ప్రేయసి(రీతూ వర్మ) మామ చిరంజీవి (సెల్వ రాఘవన్) కారులో ఒక ఫోన్ దొరుకుతుంది. టైమ్ ట్రావెల్ చేసి గతానికి ఫోన్ చేసి చరిత్రను మార్చుకునే అవకాశం ఉన్న ఆ ఫోన్ తో తల్లిదండ్రులతో మాట్లాడిన మార్క్ కి కొన్ని నిజాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరణించిన ఆంటోనీ తిరిగి బ్రతికి వస్తాడు? మళ్ళీ ఆంటోనీ ఎలా బతికాడు? బతికున్న జాకీ నుంచి మార్క్ కి తెలిసిన నిజాలు ఏంటి? బ్రతికి వచ్చిన ఆంటోనీ ఏం చేశాడు? అనే వివరాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
మార్క్ ఆంటోని సినిమా సైన్స్ ఫిక్షన్ సినిమా అని ముందు నుంచి చెప్పినా ఆ మాట అయితే నిజం కాదు, ఎందుకంటే ఈ సినిమా మొదలు పెట్టిన పది నిమిషాల్లోనే టైం ట్రావెలింగ్ ఫోన్ కనిపెట్టేస్తారు. ఆ తరువాత ఆ ఫోన్ ను అడ్డుపెట్టుకుని పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో అధిక్ రామచంద్ర తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. గ్యాంగ్‌స్టర్ డ్రామాకి టైమ్ మిషన్ తరహా ఫోన్ ను యాడ్ చేసి స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఒక కొత్త లోకంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. టైమ్ మిషన్‌ లాంటి ఫోన్ తో గతానికి కాల్ చేసి అప్పుడు జరిగిన కొన్ని ఘటనలను మార్చే తీరుకు కామెడీ, ఎమోషన్స్ వంటివి యాడ్ చేసి ఒక మాంచి మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా అందరికీ అంత ఈజీగా అర్ధం అయ్యే సినిమా కాదు. ఒక్క ఐదు నిముషాలు మిస్ అయినా సినిమాను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఈ టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను కామెడీ కోసమే ఎక్కువగా ఉపయోగించుకున్న దర్శకుడు మ్యాజిక్ చాలా వరకు వర్కౌట్ అయింది. ఇక ‘మార్క్ ఆంటోనీ’లో డైలాగ్స్ బాగా పేలాయి. టైమ్ ట్రావెల్ సినిమాలు అంటేనే రిపీట్ సీన్స్ ఉండటం కామన్ కానీ సెకండాఫ్ లో ఈ రిపీట్ సీన్స్ మరీ ఎక్కువ అయి కన్‌ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. ఆంటోని, జాకీ మార్తండ, మార్క్, మదన్ మార్తండ అనే నాలుగు పాత్రలను ఎస్జే సూర్య, విశాల్ ఇద్దరూ ఒక రేంజ్ లో పోటీపడి నటించారు. అయితే ఇక్కడ ఎస్జే సూర్య విశాల్ ను పక్కకు నెట్టేసి డామినేట్ చేసాడు. సెకండాఫ్‌లో సిల్క్ స్మిత ఎపిసోడ్, ఎన్టీఆర్ ఎదురులేని మనిషి ఎపిసోడ్ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతాయి.

నటీనటులు విషయానికి వస్తే విశాల్, ఎస్‌జే సూర్య ఇద్దరూ డ్యూయల్ రోల్స్ చేసి పోటాపోటీగా నటించారు. ర్క్, ఆంటోనిగా విశాల్ విజృంభిస్తే.. జాకీ, మదన్ పాత్రల్లో ఎస్‌జే సూర్య నట రాక్షసుడేమో అనిపించేలా నటించాడు. విలన్ ఏకాంబరంగా సునీల్, చిరంజీవిగా సెల్వ రాఘవన్ ఈ సినిమాకు అతిధి పాత్రలేమో అనిపిస్తారు. అభినయ పాత్ర పర్వాలేదు కానీ రీతూ వర్మ పాత్ర పరిధి చాలా తక్కువ. విశాల్, ఎస్‌జే సూర్యల డామినేటింగ్ యాక్టింగ్ ముందు, స్క్రీన్ ఫ్ప్రెజెన్స్ ముందు మిగతా వారంతా పెద్దగా హైలైట్ అవలేదు. టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే సహా ఆర్ట్ వర్క్ ప్రధాన బలం. 1975 నుంచి 1995 మధ్య జరిగే పిరియాడిక్ డ్రామాకు తగినట్టు క్యాస్టూమ్స్, మేకప్, కార్లు, ఇళ్ళు, వీధులు ఒక్కమాటలో చెప్పాలంటే మార్క్ ఆంటోనీ వరల్డ్‌ను క్రియేట్ చేయడం ఈ సినిమాకు హైలెట్. ముఖ్యంగా అనకొండ గన్ వేరే లెవెల్. జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం సినిమా ప్రారంభం నుంచి మంచి ప్లస్ పాయింట్ అయ్యింది, మెయిన్ గా రెట్రో థీమ్ కి బాగా సూట్ అయింది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు అయితే ప్రొడక్షన్ కి మాత్రం గట్టిగానే ఖర్చు పెట్టినట్టు అనిపించింది.

ఫైనల్లీ: మార్క్ ఆంటోనీని.. అంచనాలు లేకుండా వెళ్లి లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే నచ్చుతాడు.