NTV Telugu Site icon

Mathu Vadalara 2 Review: ‘మత్తు వదలరా 2’ రివ్యూ!

Mathu Vadalara 2 Review

Mathu Vadalara 2 Review

కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా ‘మత్తు వదలరా’ అనే సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఏవీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ గా మత్తు వదలరా 2 చేసి ఏకంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కట్ కూడా ఉండడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:
ఈ సినిమా కదా మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. బాబు మోహన్ శ్రీ సింహ ఏసుదాసు సత్య ఇద్దరు డెలివరీ ఏజెంట్ ఉద్యోగం పోవడంతో ఉద్యోగ వేటలో పడతారు. అనుకోకుండా హాయ్ ఎమర్జెన్సీ టీమ్స్ రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కుంటారు. ఎక్కువగా కిడ్నాప్ కేసులు డీల్ చేసే వీళ్ళు ఆ కేసులలో కూడా తమ తస్కరణ టాలెంట్ చూపిస్తూ ఉంటారు. ఇలా సాగిపోతున్న సమయంలో ముందుగా ఒక కిడ్నాప్ కేసు కారణంగా ఆకాష్(అజయ్) మర్డర్ కేసులో ఫ్రేమ్ అవుతారు. అయితే అసలు ఆకాష్ ను చంపింది ఎవరు? మర్డర్ కేసులో ఇరుకున్న వారికి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలా సాయం చేసింది. ఇందులో హీ.టీం హెడ్ దీప(రోహిణి) పాత్ర ఏమిటి? అనే వివరాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమాని మొదటి భాగానికి కొనసాగింపుగా తెరకెక్కించారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నడిపించడంలో దర్శకుడు మొదటి నుంచి సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొదలైనప్పుడు ఎందుకో లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ సినిమా మొదలైన తర్వాత ఇంటర్వెల్ ముందు నుంచి కథలో వేగం పెరుగుతుంది. హీరోతో పాటు సత్య అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుంచి బయట పడడానికి చేసిన ప్రయత్నాలు కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే నిజానికి ఇది ఒక రకంగా స్పూఫ్ కామెడీ. గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లను, డైలాగులను కలగలిపి ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్నారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో కథ కాస్త ఊహించడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇందులో ఆ విషయంలో ఊహకు అందకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే మొదటి భాగంలో సినిమా కథ అంతా డ్రగ్స్ చుట్టూరే తిరుగుతుంది రెండో భాగంలో ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తే దీన్ని కూడా డ్రగ్స్ చుట్టూనే తిప్పడం కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే సినిమాలో సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. కామెడీ అంటే ఏదో కొత్తగా సృష్టించారు అనుకోవద్దు సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారు. కథగా చూసుకుంటే మొదటి భాగం కొనసాగింపుగా మొదలుపెట్టి రెండో భాగాన్ని కూడా అదే డ్రగ్స్ చుట్టూ కథ నడిపారు. దానితోపాటు పబ్ల పేరుతో చేస్తున్న ఈ మత్తు దందా గురించి ప్రస్తావించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఏదో అద్భుతాన్ని ఆశించి కాకుండా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే ఎంటర్టైన్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చాలా డైలాగ్స్ ఉంటాయి.

నటీనటుల విషయానికి వస్తే:
బాబు మోహన్ అనే పాత్రలో శ్రీ సింహ ఆకట్టుకున్నాడు. అయితే శ్రీ సింహతో పాటు సమానమైన రోల్ ఈ సినిమాలో సత్యకి పడింది. తనదైన కామెడీతో సత్యా సినిమా మొత్తాన్ని భుజస్కందాల మీద నడిపించాడు అని చెప్పొచ్చు. సత్య- శ్రీ సింహ మత్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. వారిద్దరి సీన్స్ బాగా పండాయి. ఇక ఫరియా అబ్దుల్లా హీరోయిన్ పాత్రలో భలే సాలిడ్ గా కనిపించింది. గ్లామర్కి అవకాశం లేకపోయినా తనదైన శైలిలో గ్లామర్ తో అలరించింది. ఇక సినిమాలో ఇతర ప్రధాన పాత్రలలో నటించిన వెన్నెల కిషోర్, అజయ్, సునీల్, రోహిణి, రాజా చెంబోలు వంటి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే కాలభైరవ సాంగ్స్ కొన్ని బాగున్నాయి. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. ఇక సినిమాలో చాలా డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండటమే కాదు బాగా ధియేటర్లో పేలాయి కూడా. స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి.

ఫైనల్లీ:
మత్తు వదలరా 2 ఒక ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్.. సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు.

Show comments