SKY Review : స్కై సినిమా రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్, రాకేశ్ మాస్టర్, మణి బామ్మ, సందీప్ బోరెడ్డి
- DIRECTOR: పృధ్వీ పేరిచెర్ల.
- MUSIC: శివప్రసాద్
- PRODUCER: నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, పృధ్వీ పేరిచెర్ల, మురళీ కృష్ణంరాజు.
వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై కొత్త ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పేరిచెర్ల సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “స్కై” మూవీ ఫిబ్రవరి 13న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. మురళీ కృష్ణంరాజు హీరోగా పరిచయం అవుతూ, శృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ “స్కై” సినిమాకి పృధ్వీ పేరిచర్ల డెబ్యూ డైరెక్టర్. శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ కంపోస్ చేశారు. ఇంతకు ముందే రిలీజ్ అయిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుని ఈరోజు థియేటర్స్ లో రిలీజైన ఈ “స్కై” మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులని ఎంత వరకూ ఆకట్టుకుంది ఈ రివ్యూలో చూద్దాం.
కధ : కధలోకి వెళ్తే.. సింగర్ గా కెరీర్ ప్రారంబించి లైఫ్ లో సెటిల్ అవుదామనుకున్న ప్రభు (ఆనంద్), కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఫామిలీని ఇగ్నోర్ చేయడం వలన బార్య, పదేళ్ళ కొడుకుని దూరం చేసుకుంటాడు. ఫ్యామిలీని కోల్పోయిన ప్రభు తాను అనుకున్నది సాదించలేక చివరకి రెస్టారెంట్స్ లో లైవ్ సింగర్ గా లైఫ్ కంటిన్యూ చేస్తుంటే, ఆది(సందీప్) మ్యూజిక్ బ్యాండ్ తో పరిచయం అయ్యి లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడుతూ ఉంటాడు. జాబ్ పోగొట్టుకుని, జాబ్ ట్రయల్స్ లో ఉన్న విక్కీకి (మురళి), చిన్ననాటి స్నేహితుడు జాఫర్ (మహబూబ్) పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఫుడ్ డెలివరీ చేస్తుంటే, విక్కీకి వీణ (శృతి శెట్టి) పరిచయం అవుతుంది. అంతకు ముందే జాఫర్ వీణాని చీట్ చేసి డబ్బులు నొక్కేయడంతో వీణ విక్కీని అనుమానిస్తుంది. తర్వాత విక్కీలో ఉన్న సింప్లిసిటీ, నిజాయితీకి ఇంప్రెస్ అయ్యి వీణ విక్కీ ప్రేమలో పడుతుంది. కానీ చిన్నతనం నుంచి లైఫ్ లో ఎవరూ లేక, ఒంటరి జీవితం సాగిస్తున్న విక్కీ సడన్ గా తన లైఫ్ లోకి వచ్చిన వీణా చూపిస్తున్న ప్రేమ అర్ధం కాక, ఆమె ప్రేమని అంగీకరించలేడు. విక్కీ గతం ఏంటి? విక్కీ వీణ ప్రేమని ఎందుకు ఆక్సెప్ట్ చేయలేకపోయాడు? చివరికి విక్కీ వీణ ప్రేమని అర్దం చేసుకున్నాడా? ప్రభుకి చివరిగా ఎవరి వలన స్వాంతన కలుగుతుంది? కధ ఎలా క్లైమాక్స్ కి చేరి సుఖాంతం అవుతుంది తెలియాలంటే ఈ స్కై మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ : హీరో హీరోయిన్స్ పోషించిన విక్కీ, వీణ క్యారక్టర్, ఆనంద్ పోషించిన ప్రభు క్యారక్టర్ డైరెక్టర్ ఫస్టాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన విదానం చాలా ఇంటరెస్టింగ్ గా వుంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనయింగ్ గా సాగుతూ హెరోయిన్ కి హీరో మీద ప్రేమ ఎలా పుట్టింది అనేది డైరెక్టర్ చాలా సెన్సిబుల్ గా ఇంటర్వెల్ సీన్ లో చూపించారు. ఈ మూడు కారక్టర్స్ ని కధలో పేర్లల్ గా నడిపిస్తూ దర్శకుడు పృధ్వీ పేరేచర్ల చాలా హృద్యంగా తెరపై ఆవిష్కరిచారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డైరెక్టరే రాయడం వలన కధ మీద ఎక్కడా ఆయన పట్టు కోల్పోలేదు. ఇక సెకండాఫ్ విషయానికొస్తే, ఈ ఎమోషనల్ డ్రామాలో కారక్టరైజేషన్స్, వాళ్ళ బ్యాక్ డ్రాప్ అంతా చాలా డెటెయిల్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు పృధ్వీ సక్సస్ అయ్యాడు. రాకేశ్ మాస్టర్, మణిబామ్మ పోషించిన కారెక్టర్స్, వాళ్ళు పండించిన కామెడీ ప్రేక్షకులని తప్పకుండా ఆకట్టుకుంటుంది.
నటీ నటుల పర్ఫామెన్స్ : డెబ్యూ మూవీలో హీరోగా చేసిన మురళీ కృష్ణంరాజు నటనలో పర్వాలేదనిపించాడు. శృతి శెట్టి నటన ఆకట్టుకుంటుంది. వీణ పాత్రలో మంచి పర్ఫామెన్స్ చేసింది. చాలా రోజుల తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ ఆనంద్ ఒక ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించారు. రాకేశ్ మాస్టర్, మణిబామ్మ ఉండేది ఒక్కొక్క సీన్ లోనే అయినా ఆ సీన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. మిగతా కొత్త వాళ్ళు అంతా వాళ్ళ కారక్టర్స్ లో బాగా నటించారు.
టెక్నికల్ టీం : పృధ్వీ దర్శకత్వ ప్రతిభకి తోడు రసూల్ ఎల్లోర్ ఎక్స్ట్రా ర్డినరీ సినీమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ అని చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్ విజువల్ గా చాలా రిచ్ గా తెరకెక్కించడంలో సక్సస్ అయ్యారు. వాటర్ ఫాల్ వద్ద చిత్రీకరించిన ఒక సీక్వెన్స్ అయితే మూవీకే హైలైట్. సీనియర్ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ కూడా ఈ మూవీకి ప్లస్. శివప్రసాద్ మ్యూజిక్ ఓకే . బాగ్రౌండ్ స్కోర్ పవరాలేదనిపించింది. మూవీ ని డైరెక్ట్ చేసిన పృధ్వీ పేరిచర్ల రైటింగ్ మెచ్చుకోదగిన విధంగా ఉంది. ముఖ్యంగా కామెడీ బాగా హ్యాండిల్ చేసాడు.
ఓవరాల్ : “స్కై” హానెస్ట్ గా తీసిన స్మాల్ బడ్జెట్ సినిమా.. కామెడీ కోసం ఓ సారి చూసేయచ్చు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?