Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!
- విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియదర్శి
- 'సుయోధన' సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చిన ప్రియదర్శి
- ప్రియదర్శి 'సుయోధన' రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Priyadarshi, Drishika Chandar, Sai Kumar
- DIRECTOR: Y.S. Madav Reddy
- MUSIC: Jay Krish
- PRODUCER: Bosu Babu Nidumolu
Suyodhana Movie Review and Rating: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రల్లో నటించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, ప్రియదర్శికి మరో విజయాన్ని అందుకున్నాడా? అన్నది రివ్యూలో చూద్దాం.
సినిమా కథ:
వరుణ్ (ప్రియదర్శి) ఒక ‘ఫోలే’ (సౌండ్ డిజైనర్) ఆర్టిస్ట్. వరుణ్‌కి చిన్నప్పటి నుండి ‘సుయోధన’ అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ళముందు కదలాడుతూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా అతను భయపడుతుంటాడు. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటారు. ఆయనకు దుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. ఇది చూసే వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి రాధమ్మ, డాక్టర్లు చెప్పడంతో.. ప్రకాష్ నాటకాలు ఆపేస్తారు. ఇక పెద్ద వాడైన వరుణ్ ఫోలీ స్టూడియో పెట్టుకొని జీవితం సాగిస్తుంటాడు. రాజకీయంగా ఎదిగిన తండ్రి ఎమ్మేల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో హీరోయిన్ సమిత (ద్రిషిక చందర్) ఒక డెమో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి రాగా.. వరుణ్‌కు పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఓ పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతోందని ఆరా తీసిన హీరోకి.. తనకు ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ప్రకాష్‌నే వరుణ్‌కు దుర్యోధనుడిగా కనిపిస్తాడు. అదే సమయంలో తండ్రి కొడుకులపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది, తండ్రి చనిపోతాడు. వరుణ్ తండ్రిని చంపింది ఎవరు?, ఇందులో పొలిటికల్ కోణం ఏంటి?, సుయోధన అనే శబ్దం తనకు ఎందుకు వినబడుతుంది?, సినిమాలో అసలు సుయోధన ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
విశ్లేషణ:
హీరో ప్రియదర్శికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్ర కొత్తదే కానీ.. కథ కథనంలో పెద్దగా కొత్తదనం లేదు. ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ టాలీవుడ్ ప్రేక్షకులకు ‘ఫోలే’ ఆర్టిస్ట్ అనేది కొత్త ట్రీట్మెంట్ అనే చెప్పాలి. సినిమాలో వచ్చే శబ్దాలను ఇలా రికార్డ్ చేస్తారా? అని సుయోధన ద్వారా ప్రేక్షకులు తెలుసుకుంటారు. స్క్రీన్ ప్లేతో పాటు సినిమాలోని కొన్ని ట్విస్టులు థ్రిల్ ఇస్తాయి. సినిమా ఆరంభం నుంచి దర్శకుడు ప్రేక్షకులకు సస్పెన్స్ క్రియేట్ చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. సగటు ఆడియెన్స్ వాట్ నెక్స్ట్ అనేలా చేశాడు. ఈ సినిమా విషయంలో ‘సౌండ్’ కీలక పాత్ర పోషించింది. దర్శకుడు మాధవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్‌కు.. జై క్రిష్ అందించిన సంగీతం దోహదపడింది. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించగా.. సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లాజిక్ లెస్ అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరికొంత పకడ్బందీగా ఉంటే బాగుండేది. దర్శకుడికి తొలి సినిమా అయినా తడబడకుండా తెరకెక్కించాడు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ను కూడా బాగా చూపించాడు. రెండు గంటల పది నిమిషాల రన్ టైంతో వచ్చిన ఈ సినిమాకు నిడివి కాస్త తగ్గించి ఉంటే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల విషయానికొస్తే:
ఎప్పటిలాగే ప్రియదర్శి తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సరైన పాత్ర పడాలే గానీ పరకాయ ప్రవేశం చేస్తారని మరోసారి దుర్యోధనుడి పాత్రతో మెప్పించారు. తన డైలాగ్ పవర్, నటనతో సినిమాకు మెయిన్ పిల్లర్‌లా నిలిచారు. సీనియర్ హీరోయిన్ ప్రేమ తల్లి పాత్రలో మెప్పించారు. హీరోయిన్ ద్రిశికా చందర్‌కు మంచి పాత్ర పడింది. విష్ణు ఓయ్, దేవి ప్రసాద్ తమ తమ పాత్రలతో మెప్పించారు. సినిమాలో హీరో సత్యదేవ్, బిత్తిరి సత్తి కూడా అలా మెరుస్తారు. వాళ్ల పాత్రలను కావాలని కాకుండా.. కథలో భాగమయ్యేలా రాసుకున్న దర్శకుడిని అభినందించాల్సిందే. సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే.. సౌండ్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తుంది.
ఫైనల్లీ:
రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా.. వినూత్నమైన మిస్టరీ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే ‘సుయోధన’ మంచి ఛాయిస్.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!