NTV Telugu Site icon

Adipurush Review: ఆదిపురుష్

Adipurush Day 1 Estimated Collections

Adipurush Day 1 Estimated Collections

తెలుగువారికి, పురాణ కథలకు ఎంతో అవినాభావ సంబంధషం ఉంది. తెలుగువారు తీసిన పలు పౌరాణిక చిత్రాలు బలమైన ముద్రవేశాయి. ప్రత్యేకించి రామాయణ, మహా భారత కథల ఆధారంగా మన వారు తెరకెక్కించిన పలు సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేశాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తాకరరామారావు పలు పౌరాణిక పాత్రలు పోషించి నభూతో నభవిష్యత్ అనిపించుకున్నారు. ఆయన అవతార పురుషుడు రాముడుగానే కాదు రావణుడుగాను నటించి మెప్పుపొందిన తీరు అనన్య సామాన్యం. ఆయన తర్వాత పౌరణిక చిత్రాలకు కళ తగ్గింది అని చెప్పటానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు. జగదభిరాముడు శ్రీరాముని కథలో తెలుగులో పలుచిత్రాలు రూపొంది వేటికవే సాటి అనిపించుకున్నాయి. ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు రామయణ కథతో ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించి మెప్పించారు. ఆ తర్వాత ఇన్నాళ్ళకు రామాయణం ఇతివృత్తం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ను రూపొందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ రిలీజ్ అయినపుడు అనూహ్యంగా ట్రోలింగ్ ను ఫేస్ చేసిన ‘ఆదిపురుష్‌’, పాట, ట్రైలర్ తో పాజిటీవ్ బజ్ ను క్రియేట్ చేసింది. రిలీజ్ టైమ్ కి సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

కథ విషయానికి వస్తే వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథ రాముడి వనవాసంతో మొదలవుతుంది. దానికి ముందు టైటిల్స్ లోనే సీతాస్వయంవరం, రాముడు పట్టాభిషేకం, కైక కోరిక మేరకు తండ్రిమాట జవదాటని శ్రీరాముడు వనవాసానికి పయనం అవటం చూపించారు. ఇక వనవాసంలో శూర్పణఖ శ్రీరాముని మోహించి తిరస్కరణకు గురికావటం,ఆమెకు లక్ష్మణుడు బుద్ధి చెప్పటం… దానిని ప్రతిగా తన అన్న రావణుని రెచ్చగొట్టి జానకిపై మోహం పెరిగేలా చేయటం, రావణుడు మాయలేడి సాయంతో జానకిని ఎత్తుకురావడం. జటాయువు సూచన మేరకు శ్రీరామ, లక్ష్మణులు సుగ్రీవ, ఆంజనేయుల అండతో లంకపైకి దండెత్తి రావణుడి సంహరించి సీతను తీసుకువచ్చి పట్టాభిషిక్తుడు కావటం.

నిజానికి రామాయణంలో లేని అంశం లేదు. నవరసాలు ఉన్న అద్భుతమైన పౌరాణిక గాథ. అందులోని బాలకాండ, అయోధ్య కాండ, అరణ్యకాండ, కిష్కింద కాండ, సుందర కాండ, యుద్ధ కాండ, ఉత్తర కాండ… ఏది తీసుకుని సినిమా తీసినా తనివి తీరదు. ఆసక్తి తగ్గదు. అంతటి సమ్మోహన శక్తి ఉన్న పౌరాణిక కథ రామాయణం. దీనిని ఎవరు ఎన్ని రకాలుగా తీసినా మూల కథ విషయంలో ఒక నిబద్ధతను పాటించి తీశారు. అందుకే దాదాపు అందరూ వారి వారి స్థాయికి తగ్గ సక్సెస్ ను అందుకున్నారు. అయితే బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ మాత్రం పెరిగిన టెక్నాలజీని ఆదిపురుష్ సినిమాకి జోడించి మోషన్ క్యాప్చర్ సినిమా చేసాడు. తెలిసిన కథే కావడంతో దర్శకుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, అందుకే కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. అయితే ఇక్కడే అసలు తప్పు జరిగింది. రెగ్యులర్ సినిమాకి వెళ్లకుండా మోషన్ క్యాప్చర్ కి వెళ్లడం దగ్గరే ఆదిపురుష్ కష్టాలు మొదలయ్యాయి. టీజర్ తోనే ఇది తెలిసినా, ట్రైలర్ తో మెప్పించాడు ఓమ్ రౌత్. సినిమా విషయంలో మాత్రం ఇది జరగలేదు. గ్రాఫిక్స్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఆ విజువల్స్ కి, సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి, ప్రభాస్ ని ప్రెజెంట్ చేసిన విధానంకి దర్శకుడు కాస్త గ్రాఫిక్స్ విషయంలో కేర్ తీసుకోని ఉంటే ఈరోజు ఒక అద్భుతాన్ని భారతీయులు చూసే వారు.

ప్రభాస్ తన పరిధిలో చేయాల్సిందంతా చేసాడు, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. సీతగా కృతి సనన్ ఎందుకో రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. ఆమెని చూస్తే సీత పాత్రపై ఉండే ఎమోషల్ కనెక్టివిటీ రావట్లేదు. హనుమంతుడు, లక్ష్మణుడు పాత్రలని దర్శకుడు బాగా మలిచాడు. రావణ్ గా సైఫ్ కూడా బాగానే ఉన్నాడు కానీ ప్రభాస్ ముందు అతను సరిపోలేదు.

సాంకేతికంగా చెప్పుకోవాలంటే ‘ఆదిపురుష్’ లో జై శ్రీరామ్ పాట తప్ప మిగిలిన పాటలేవీ బాగాలేవు. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. జై శ్రీరామ్ పాటను అక్కడక్కడా నేపథ్యంలో వినిపించటం చాలా వరకూ కలసి వచ్చింది. కార్తీక్ పళని కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణాత్మక విలువలు చెప్పుకోవాలంటే విజువల్ ఎఫెక్ట్స్ కు బాగానే ఖర్చుపెట్టారు కానీ అది ఆడియన్స్ ని మెప్పించడానికి సరిపోలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఓమ్ రౌత్ రామాయణంను ఓ దృశ్యకావ్యంగా మలుస్తాడని భావించి థియేటర్లకు క్యూ కట్టిన వారిని కాస్త డిజప్పాయింట్ చేసే అవకాశం ఉంది.

ప్లస్ పాయింట్స్
ప్రభాస్ నటించటం
నిర్మాణాత్మక విలువలు
ప్రాచుర్యం పొందిన కథ కావటం

మైనస్ పాయింట్స్
గ్రాఫిక్స్
ఎమోషన్ లేకపోవడం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: ‘ఆదిపురుష్‌’… గ్రాఫిక్ గందరగోళం