NTV Telugu Site icon

Paarijatha Parvam Review: పారిజాత పర్వం మూవీ రివ్యూ..

Pp

Pp

చైతన్య రావు హీరోగా హర్ష చెముడు, సునీల్, శ్రద్ధాదాస్ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలలో నటించిన పారిజాత పర్వం సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాని డైరెక్ట్ చేసిన సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంది లాంటి విషయాలను రివ్యూలో తెలుసుకుందాం పదండి.

పారిజాత పర్వం కథ
పారిజాత పర్వం కథ విషయానికి వస్తే అప్పుడప్పుడు ఇంద్ర విడుదలైన కొత్తలో మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకుని హీరో అయిపోవాలని భీమవరం నుంచి హైదరాబాదులో దిగుతాడు శ్రీను(సునీల్). స్టూడియోల చుట్టూ నిర్మాతలు చుట్టూ తిరిగిన ఉపయోగం లేకపోవడంతో కొంతమంది మాటలు విని ఒక బార్ లో వెయిటర్ గా జాయిన్ అవుతాడు. సినిమాల్లో డాన్సర్ అవ్వాలని వచ్చి అదే బారులో డాన్సర్ గా పనిచేస్తున్న పారు(శ్రద్దా దాస్) మీద శ్రీను చూపు పడుతుంది. ఎలాగైనా సినిమాల్లో మెరవాలని వచ్చిన శ్రీను అనుకోని పరిస్థితుల్లో పారుని రక్షించబోయి తన బార్ ఓనర్(టార్జాన్)ని చంపేస్తాడు. హీరో అవ్వాలని వచ్చిన శ్రీను చివరికి ఆ బార్ ఓనర్ అయి ఎప్పటికైనా హీరో అవ్వాలని ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇదే కథను సినిమా కథగా రాసుకుని దర్శకుడిగా మారేందుకు చైతన్య(చైతన్య రావు) ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అతని కథ నచ్చిన అతను తన స్నేహితుడు(హర్ష చెముడు) హీరోగా చేస్తే మాత్రమే సినిమా చేస్తానని కండిషన్లు పెడుతుంటే స్టార్ ప్రొడ్యూసర్ శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) దారుణంగా అవమానించి పంపిస్తాడు. చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గర ఇదే పరిస్థితి ఎదురవడంతో తనను అవమానించిన శెట్టి భార్య(సురేఖ వాణి)ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే సినిమా చేయాలని చైతన్య ఫిక్స్ అవుతాడు. అయితే చైతన్య తన స్నేహితుడు ప్రేమికురాలతో కలిసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే శ్రీను అండ్ కో కూడా అదే శెట్టి భార్యను కిడ్నాప్ చేయడానికి వస్తారు. కన్ఫ్యూజన్లో రెండు గ్యాంగులు ఇద్దరు యువతలను కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఏర్పడింది? శ్రీను గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేయడానికి వచ్చింది? చివరికి ఏమైంది? సినిమాల మీద పిచ్చితో వచ్చిన వాళ్లంతా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
ఈ మధ్య క్రైమ్ కామెడీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అలాంటి కథతోనే ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ సినిమా అయినా సరే సినిమా బ్యాక్ డ్రాప్ తీసుకోవడంతో భలే బేస్ సెట్ అయింది. సినిమా మొదట్లోనే సినిమా చేయడం కోసమే ఎంత దూరమైనా వెళ్లే మనుషులను చూపించడంతో ఫస్టాఫ్ అంతా ఆసక్తికరంగా సాగిపోతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కన్విన్సింగ్ గా ఫస్ట్ ఆఫ్ మొత్తం నడిపిస్తుంది. అయితే అసలు సమస్య సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే సినిమా చేయడం కోసం కిడ్నాప్ చేయాలనుకోవడం బాగానే ఉంది కానీ ఈ కిడ్నాప్ డ్రామా తెర మీదకు వచ్చి ట్రస్టులన్నీ ఒకటొకటిగా రివీల్ అయ్యాక కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అప్పటి వరకు ఉన్న క్యూరియాసిటీ సినిమా మీద తగ్గిపోయిందని చెప్పాలి. వైవా హర్షను పెట్టి మాత్రమే సినిమా తీస్తానని చైతన్య రావు ఎందుకు ఫిక్స్ అయ్యాడనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. అయితే హర్ష తో మాత్రమే సినిమా చేస్తానని చెప్పేటప్పుడు నిర్మాతల సమాధానాలు దానికి హర్ష తనదైన కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ తో సినిమాలో చాలావరకు బాధ్యతలు తన భుజస్కంధాల మీద మోసాడు. కథలో ట్విస్టులన్నీ రివీల్ అయిన తర్వాత ఎందుకో రొటీన్ రూట్ లోకి వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సినిమాలో చాలా వరకు లాజిక్స్ మిస్ అయినట్టు కుడా అనిపిస్తింది. అయితే ఆ సంగతి పక్కన పెడితే దర్శకుడు చూపించిన కామెడీ సెన్స్ ఆసక్తికరంగా అనిపించింది.

నటీనటుల విషయానికి వస్తే చైతన్య రావు ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రద్ధాదాస్ ఒక ఆసక్తికరమైన పాత్రలో మెరిసింది. బారు డాన్సర్ గా ఆ తర్వాత లేడీ డాన్ గా లుక్స్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగా కూడా వేరియేషన్స్ చూపించింది. చైతన్య రావు ప్రియురాలిగా నటించిన మాళవిక తింగరబుచ్చి లాంటి పాత్రలో ఆకట్టుకుంది. సినిమా మొత్తానికి మెయిన్ పిల్లర్ హర్ష చెముడు కామెడీ. హర్ష, మాళవిక మధ్య సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా మరోసారి ఫుల్ లెంత్ రోల్ లో నటించాడు. సురేఖా వాణికి కూడా చాలా రోజుల తర్వాత డైలాగ్స్ ఉన్న పాత్ర పడినట్టు అనిపించింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా పాటలు కొంచెం స్టైలిష్ గా అనిపించాయి. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనిపించేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

ఫైనల్ గా చెప్పాలంటే పారిజాత పర్వం ప్రేక్షకులను కొంతవరకు ఎంగేజ్ చేస్తుంది. అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినవాళ్లు కాస్త నిరాశ పడతారు.

Show comments