రివ్యూ : ఆపరేషన్ పద్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Naresh Medi, Kannayagari Rajitha Sandy, Ranadheer Beesu and Others
- DIRECTOR: Karthikeya V
- MUSIC: Subhash Anad
- PRODUCER: Mandalapu Raghavayya, Mandalapu Rambabu
ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మండలపు, రాంబాబు మండలపు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఆపరేషన్ పద్మ’. రాజకీయ కుట్రలు, ప్రైవేట్ డిటెక్టివ్ వ్యవస్థ, హై-స్టేక్స్ మైండ్ గేమ్‌లను మిళితం చేస్తూ రూపొందిన ఈ చిత్రానికి కార్తికేయ వి దర్శకత్వం వహించారు. వాస్తవికతకు దగ్గరగా సాగుతూ, ప్రేక్షకుడిని ఆలోచింపజేసే థ్రిల్లర్‌గా ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
కథ : మాజీ హోం మంత్రి, పార్టీకి విధేయుడైన నంది కిషోర్ పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయటపెడతాడు. ఈ ఒక్క చర్యతో అతను రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారడమే కాకుండా, ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదిస్తాడు. అదే సమయంలో శక్తివంతమైన వర్గాలకు అతను ప్రధాన టార్గెట్‌గా మారతాడు. నంది కిషోర్‌ను అంతమొందించేందుకు ప్రొఫెషనల్ కిల్లర్ కుల్దీప్ను నియమిస్తారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అవంతిక నేతృత్వంలో ‘ఆపరేషన్ పద్మ’ అనే రహస్య డిటెక్టివ్ టీంని ఏర్పాటు చేస్తారు. వాసు, రమణ, పద్మ అలియాస్ సుధ, రూప వంటి సభ్యులతో కూడిన ఈ బృందం కిల్లర్‌ను ఎలా కట్టడి చేసింది? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? అనేదే కథ.
Also Read
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
- Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
విశ్లేషణ : ‘ఆపరేషన్ పద్మ’ ఒక సాధారణ యాక్షన్ థ్రిల్లర్ కాకుండా, రాజకీయ కుట్రలు మరియు రహస్య వ్యవస్థలపై ఫోకస్ చేసిన ఇంటెలిజెంట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. రాజకీయ కుంభకోణాన్ని కథా కేంద్రంగా తీసుకుని, కిల్లర్ మరియు డిటెక్టివ్ టీం మధ్య జరిగే మైండ్ గేమ్‌లను ఆసక్తికరంగా చూపించారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగే ఫస్ట్ హాఫ్ ఉత్కంఠను నిలబెడుతూ ప్రేక్షకుడిని కథలోకి లాగుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లు ఊహించని విధంగా ఉండటం సినిమాకు ప్రధాన బలంగా మారుతుంది. టెక్నికల్‌గా స్టంట్స్, కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా టోన్‌కు తగ్గట్టుగా పనిచేశాయి, భారీ బడ్జెట్ విలువ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
అయితే ఈ సినిమా స్లో బర్న్ నేరేటివ్‌ను ఫాలో కావడం వల్ల కొంతమంది ప్రేక్షకులకు పేసింగ్ నెమ్మదిగా అనిపించవచ్చు. రాజకీయ డిస్కషన్లు, టర్మినాలజీ ఎక్కువగా ఉండటం సాధారణ ఆడియెన్స్‌కు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. యాక్షన్ సన్నివేశాలు పరిమితంగా ఉండటం వల్ల మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి పూర్తి సంతృప్తి కలగకపోవచ్చు. కొన్ని సబ్ప్లాట్స్కు కావాల్సిన ఎమోషనల్ డెప్త్ లేకపోవడం కూడా సినిమా ప్రభావాన్ని కొంత తగ్గిస్తుంది. అయినప్పటికీ, ఇంటెలిజెంట్ థ్రిల్లర్స్, మైండ్ గేమ్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఆపరేషన్ పద్మ’ ఒక డిఫరెంట్ సినిమా అనుభూతిని ఇస్తుంది.
నటీనటులు : రణధీర్ బీసు కుల్దీప్ పాత్రలో స్టైలిష్ మరియు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను స్క్రీన్‌పై ఉన్నా లేకపోయినా అతని ప్రెజెన్స్ కథపై ప్రభావం చూపుతుంది. డిటెక్టివ్ టీం సభ్యులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రఘుపతి రెడ్డి గుండా, రజిత శాండీ నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మహిళా పాత్రలు హై ఎనర్జీతో, బలమైన ప్రెజెన్స్‌తో రూపొందించబడ్డాయి. ఇది కథకు మరింత బలం చేకూర్చుతుంది. మిగతా పాత్రలు కూడా తమ పరిధి మేరకు గుర్తుండిపోయేలా నటించారు.
చివరగా : ‘ఆపరేషన్ పద్మ’ ప్రేక్షకుడి మెదడుకు పని చెప్పే ఇంటెలిజెంట్ పొలిటికల్ థ్రిల్లర్. మైండ్ గేమ్‌లు, రియలిస్టిక్ అప్రోచ్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. సాధారణ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి కాకపోయినా, ఇంటెలిజెంట్ యాక్షన్–థ్రిల్లర్స్, పొలిటికల్ డ్రామాలు ఇష్టపడే ఆడియెన్స్‌కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
తాజావార్తలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-
Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..