MaruvaTarama Review : మరువ తరమా రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Hariish Dhanunjaya, AthulyaChandra, AvantikaNalwa, Rohini,
- DIRECTOR: Chaitanya Varma nadimpalli
- MUSIC: Vijay Bulganin, Arish
- PRODUCER: Silver Screen Pictures
ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం వంటి సినిమాలలో నటించి మెప్పించిన హరీష్ ధనుంజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం “మరువ తరమా”. అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు RX100 వంటి సినిమాకు పాటల రచయితగా పనిచేసిన చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించగా గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు.. ట్రైలర్, సాంగ్స్ తో యూత్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఏలా ఉందంటే…
కథ : రిషి ( హరీష్ ధనుంజయ్) సింధు( అవంతిక ) అన్వీ (అతుల్య) ఓకే ఆఫీస్ లో పని చేస్తుంటారు. సింధును చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రిషి. మరోవైపు అన్వీ కూడా రిషిని అమితంగా ప్రేమిస్తుంది. కాని రిషికి సింధు అంటే ఇష్టమని తెలిసి తనప్రేమని రిషికి చెప్పకుండా ఉంటుంది. అలా సింధుప్రేమలో మునిగి తేలుతూ ఉన్న రిషి ఆమె నుండి ఎందుకు విడిపోయాడు, అలా విడిపోయిన రిషి, సింధు మళ్లి ఎందుకు తిరిగివచ్చింది.. అన్వీ తన ప్రేమని చివరకి రిషికి చెప్పిందా, రిషికి తన తల్లి ( రోహిణి) చెప్పిన మాట ఏంటి, అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి ముగింపు తీసుకుందనేది తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే..
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
విశ్లేషణ : ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథలకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. దర్శకులు చేయాల్సిందల్లా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడమే. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తొలి సగంలో చెప్పుకోదగ్గ కథ ఉండదు. కాని ప్రతీ సీన్ లో షాట్ పంచులతో ఎక్కడ బోర్ కొట్టకుండా సహజమైన కామెడీతో నడిపించాడు దర్శకుడు. అలాగే సాంగ్స్ కూడా కథకి తగ్గట్టుగా వినసొంపుగా అనిపించాయి. ఇక సెకండాఫ్ ను పూర్తిగా కధ, కధనాలపైనే దృష్టి పెట్టాడు దర్శకుడు. ఆడియన్స్ ను ఎమోషనల్ గా కథకి కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు. తెరపై పాత్రలు మాట్లాడుతుంటే అరె మన ఫ్రెండ్స్ లో వాడికి కూడా ఇలానే జరిగింది కదాని అనిపిస్తుందంటే ప్రేక్షకుడు సినిమాకి ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రోహిణి ఓ సందర్భంలో చెప్పే డైలాగులు ‘అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది’ దర్శకుడి కలానికి ఎలాంటి పదును ఉందో చెప్పడానికి ఉదాహరణ. అలాగే అమ్మాయిల విషయంలో ఆప్షన్లు ఉంటాయి ఏమో కానీ అమ్మ విషయంలో ఆప్షన్స్ ఉండవు లాంటి మాటలు గుర్తుండిపోయేలా చేస్తాయి. మనకి తెలిసిన కథను అంతే అర్థమవంతంగా యదార్ద సంఘటనల ఆధారంగా జరిగిన కథ ఈ మరువ తరమా..
నటీనటుల పర్ఫార్మెన్స్ : హరీష్ ధనుంజయ్ చూడడానికి చాలా బాగున్నాడు. నటనలోను ఈజ్ తో చేసాడు. యూత్ ఫుల్ కథలకు బాగా సెట్ అవుతాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో నేచురల్ స్టార్ నానిని గుర్తు చేసాడు. మంచి కథలు సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. అవంతిక చాలా బాగా నటించింది. అతుల్య పాత్ర పరిధి మేరకు నటించింది. రోహిణి కనిపించింది కాసేపైనా మంచి పాత్ర. భద్రమ్ రెండు మూడు సీన్లు మాత్రమే పరిమితం అయ్యాడు. దినేష్ పాత్ర చేసిన నటుడు హిలేరియస్ గా నవ్వించాడు.
టెక్నికల్ పనితీరు : ఈ సినిమాకు ప్రదాన బలం మ్యూజిక్. విజయ్ బుల్గానిన్ మూడు పాటలు కంపోజ్ చేయగా అరీష్ మరో మూడు సాంగ్స్, బీజీఎమ్ ఇచ్చాడు. ఇద్దరి మ్యూజిక్ సూపర్బ్ అనే చెప్పాలి. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్ తో నిలబెట్టాడు అరిష్. ఇక డైలాగ్స్ కూడా రిలేటబుల్ గా దర్శకుడి స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ లో ఫస్టాఫ్ లో లోపాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే.
ఓవరాల్ : మెప్పించదగిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మరువ తరమా..
- Tags
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!