Uttuttha Herolu Review: ఉత్తుత్త హీరోలు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Mahesh Vitta, Thanu Konidela, Hara Srinivas and others
- DIRECTOR: Harsha Kodali
- MUSIC: John K Joseph
- PRODUCER: Mahesh Vitta
బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా లీడ్ రోల్‌లో నటించిన ‘ఉత్తుత్త హీరోలు’ చిత్రం ఫిబ్రవరి 27, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్ష కోడాలి దర్శకత్వంలో దాదాపు 75 మంది కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా, సినీ కలలు కనే నలుగురు మిత్రుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఉత్తుత్త హీరోలు కథేంటంటే?
ప్రొద్దుటూరు నేపథ్యంలో సాగే ఈ కథలో చందు (మహేష్ విట్టా) మరియు అతని మిత్ర బృందం ఎలాగైనా వెండితెరపై హీరోలుగా వెలగాలని ఆరాటపడుతుంటారు. సొంతంగా ఒక సినిమా మొదలుపెట్టినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల అది మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సమయంలో వారి జీవితాల్లోకి ఒక వింత ఆఫర్ వస్తుంది. ఆ మలుపు వారిని ఎక్కడికి తీసుకెళ్లింది? చందు-సోనెమ్మ (ప్రవీణ సోనీ)ల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? ఈ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులేంటి? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
హారర్ కామెడీ అనేది నెవర్ ఎండింగ్ ఇంటరెస్టింగ్ జానర్. దానికి రాయలసీమ యాసను జోడించి “ఉత్తుత్త హీరోలు” అనే సినిమా చేయడం కాస్త కొత్తదనాన్ని తెచ్చిపెట్టింది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, కడప పల్లెటూరి వాతావరణం, హీరో, అతని గ్యాంగ్ అల్లరితో సరదాగా సాగిపోతుంది కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో దెయ్యం బంగ్లా నేపథ్యంలో వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా ప్రేక్షకులను నవ్విస్తుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినా నవ్వించారు. సినిమా ఇండస్ట్రీలోని కష్టాలను వ్యంగ్యంగా చూపిస్తూనే, వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు.
నటీనటుల విషయానికి వస్తే మహేష్ విట్టా తనదైన రాయలసీమ యాసతో, కామెడీ టైమింగ్‌తో సినిమాను మొత్తం తన భుజాలపై మోశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించి తనలోని నటుడిని మరోసారి నిరూపించుకున్నారు. ఇక హీరోయిన్ ప్రవీణ సోనీ పాత్రకు తగినట్టుగా చక్కటి అభినయం కనబరిచింది. వాల్టర్ వినయ్, రాహుల్ రాజ్, గంగా చిటికాల స్నేహితులుగా సందడి చేస్తూ వినోదాన్ని పంచారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే దర్శకుడు హర్ష రాయలసీమ నేటివిటీని వెండితెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ డిజైన్, జాన్ కె జోసెఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని చక్కగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ సహజంగా ఉండి లొకేషన్లకు జీవం పోసింది. రాయలసీమ ప్రాంతపు సహజత్వాన్ని స్క్రీన్ మీద బాగా చూపించారు. ఎస్.కె. రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా వాల్తేరు వినయ్ తొలి ప్రయత్నంలోనే ‘క్రైమ్ కామెడీ’ జానర్‌ను ఎంచుకుని ఆకట్టుకున్నారు.
ఫైనల్ వర్డిక్ట్ : ఉత్తుత్త హీరోలు ఇంట్రెస్టింగ్ హారర్ క్రైం కామెడీ
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!