రివ్యూ : లగ్గం టైం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Rajesh Meru, Navya Chityala, Nellore Sudharshan and Others
- DIRECTOR: Prajoth K Vennam
- MUSIC: Pawan
- PRODUCER: K. Hima Bindu
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా తెరకెక్కిన లగ్గం టైం ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె. హిమబిందు నిర్మించిన ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో పూర్తి రివ్యూ లో చూద్దాం.
కథ : అనన్య పెళ్లి రోజున ఆమె బాయ్‌ఫ్రెండ్ సూర్య ఆమెను పెళ్లి ఇంటి నుంచి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే పెళ్లింట్లో జరిగిన ఓ అనూహ్య సంఘటనతో పరిస్థితులు మారిపోతాయి. అదే సమయంలో పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ కావడంతో కథలో మిస్టరీ మొదలవుతుంది. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా పోలీసులు పట్టుకుంటారు. అసలు కిడ్నాప్ ఎవరు చేశారు? పుణేలో మొదలైన సూర్య–అనన్య ప్రేమకథ ఏ మలుపులు తిరిగింది? చివరికి వీరిద్దరూ కలుస్తారా? అన్నదే మిగతా కథ.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
విశ్లేషణ : పెళ్లి సమయంలో కిడ్నాప్, ప్రేమకథ అనే రొటీన్ పాయింట్‌తోనే కథ సాగినా, దర్శకుడు దాన్ని కొంత కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి సన్నివేశాలు కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌లో వరుస ట్విస్టులు కథపై ఆసక్తిని నిలబెడతాయి. కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అవుతే, మరికొన్ని సీన్స్ అంతగా పండలేదు. లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సీన్స్ రొటీన్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా త్వరగా ముగించేశారు అనిపిస్తుంది.
నటీనటులు : రాజేష్ మేరు హీరోగా తన పాత్రకు న్యాయం చేశారు. నవ్య చిట్యాల క్యూట్ లుక్స్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. సుదర్శన్ తన కామెడీ టైమింగ్‌తో సినిమాకు మెయిన్ ప్లస్ అయ్యాడు. ప్రణీత్ రెడ్డి, అరుణ్ కుమార్, ప్రీతీ సుందర్ తదితరులు తమ పాత్రల పరిధిలో పర్వాలేదనిపించారు.
చివరగా : భారీ అంచనాలు లేకుండా సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు లగ్గం టైం ఓ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్. రొటీన్ కథ ఉన్నప్పటికీ కామెడీ ట్రీట్మెంట్‌తో ఒకసారి చూడదగ్గ సినిమా.
తాజావార్తలు
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!