Alanaati Ramachandrudu Movie Review: ఇప్పుడు ప్రేక్షకులు హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళా? దర్శక నిర్మాతల కొత్త వాళ్ళా? అనే విషయం చూడటం లేదు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాలను అయినా ఆదరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త హీరో కృష్ణ వంశీ, తెలుగులో లక్కీ లక్ష్మణ్ సినిమాతో పరిచయమైన మోక్ష హీరోయిన్ గా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’ ఆగస్ట్ 2న విడుదల అయింది. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. దిల్ రాజు SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఫీల్ గుడ్ అనిపిస్తున్న టీజర్, ట్రైలర్స్ సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు అలనాటి రామచంద్రుడు రివ్యూ లో చూద్దాం.
కథ:
చిన్నతనం నుంచే సిద్ధు (కృష్ణ వంశీ) ఇంట్రావర్ట్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్. జనంతో కలవాలంటే భయంతో అన్ని విషయాల్లో వెనుకబడే ఉంటాడు. అయితే అందుకు పూర్తి భిన్నం ధరణి (మోక్ష). ఇంజినీరింగ్ కాలేజ్ లో క్లాస్ మేట్ అయిన ఆమెను మొదటి చూపులోనే ప్రేమించినా తన ఇంట్రావర్ట్ స్వభావం వల్ల ఆమె దగ్గరికే వెళ్ళడానికి భయపడుతూ ఉంటాడు. కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చివరి ప్రయత్నం చేస్తున్న సమయంలో ధరణికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి వెనక్కి వచ్చేస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ తో మనాలి వెళ్లాలని అనుకున్న ధరణి ఒక్కతే వెళ్తుంది. ఆమె వెంటే సిద్దు కూడా వెళ్తాడు. అక్కడ ధరణి గతం మర్చిపోతుంది. అయితే ఆలు ధరణి గతం మరచి పోవడానికి కారణం ఏమిటి? ధరణికి మళ్లీ గతం గుర్తు వచ్చిందా? లేదా? సిద్ధు, ధరణిలు ఒక్కటయ్యారా? అసలు ‘అలనాటి రామచంద్రుడు’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
‘అలనాటి రామచంద్రుడు’ టైటిల్ విన్నప్పుడే ఇదేదో బాపు గారి స్టైల్ సినిమా అని చాలా మంది అనుకోవచ్చు. అయితే టైటిల్ కి తగ్గట్టే ఒక ప్లజెంట్ మూడ్ లో సినిమాను క్యారీ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి ప్రయత్నించారు. నిజానికి ‘అలనాటి రామచంద్రుడు’ టైటిల్‌లో మాత్రమే కాదు సినిమాలో సంగీతం విషయంలో కూడా ఒక మంచి క్లాసిక్ ఫీల్ ఉంది. సంగీతంలోనూ ఆ క్లాసిక్ స్టైల్ ఆకట్టుకుంది. నిజానికి ఈ పాటలు బ్యాక్ గ్రౌండ్ . ఒక్కటని కాదు, సినిమాలో ప్రతి పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీలతో సాగింది. అయితే సంగీత దర్శకుడు ఫీలైన అంత మంచి మ్యూజిక్ ఇచ్చాడు కానీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఆ సీన్లు లేవు అనిపిస్తుంది. నిజానికి ఒక ఇంట్రావర్ట్ కుర్రాడు, రాముడిలా చిన్న తప్పు చేయకుండా ఉండే కుర్రాడు ఈరోజుల్లో ఉన్న ఎక్స్ట్రా వర్ట్ అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశాడు? చివరికి ఆ ప్రేమ దక్కిందా? లేదా? అనేదే ఈ సినిమా కధ అయినా దాన్ని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. సంగీత దర్శకుడు, గేయ రచయితల నుంచి మంచి పాటలు రాబట్టిన ఆకాష్ రెడ్డి, ఆ స్థాయిలో సీన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేకపోయారు. సినిమా మొదలయ్యాక కాలేజీ సీన్స్, తన ప్రేమ చెప్పలేక హీరో పడే పాట్లతో ఫస్టాఫ్ ఆసక్తిగా సాగింది కానీ ఆ తర్వాత సాగుతూ వెళ్లి ఎప్పుడెప్పుడు శుభం కార్డు పడుతుందా? అని ఎదురు చూసేలా చేసింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో కృష్ణ వంశీ మొదటి సినిమాకు బరువైన పాత్రకు ఎంపిక చేసుకున్నా మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కొంచెం తడబడినా ఈ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. మొదటి సినిమాకే ఇలాంటి పాత్ర చేయడం ఒక ఛాలెంజ్. హీరోయిన్ మోక్ష ధరణి పాత్రలో ఒదిగిపోయింది. వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికపాటి కామెడీ బాగుంది. సుధ, బ్రహ్మజీ, ప్రమోదిని, కేశవ్ దీపక్, సత్యశ్రీ, స్నేహమాధురి శర్మ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీతం చాలా బావుంది. కెమెరా వర్క్ కూడా సినిమాకి అదనపు ఆకర్షణ. అయితే కథ, కథనంలో కొత్తదనం లేదా ప్రేక్షకులను కనెక్ట్ చేసే అంశాలు మాత్రం లేవు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. చేసిన మొదటి సినిమా ఏదో కమర్షియల్ హంగుల కోసం ఆరాటపడకుండా నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నమే వారి టేస్ట్ ఎలాంటిదో నిరూపిస్తోంది.
ఫైనల్లీ: అలనాటి రామచంద్రుడు ఒక మ్యూజికల్ ఎంటర్ టైనర్.