Gossip Review: గాసిప్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: మహేష్ యడ్లవల్లి, రాశి సింగ్, విజయ్ ఆదిరాజు, గురు చరణ్, రవి వర్మ
- DIRECTOR: వైభవ్ కౌండిన్య
- MUSIC: శక్తి కార్తిక్
- PRODUCER: ఏతి రేమెళ్ల
ఒక అబద్ధం… ఓ గాసిప్… ఒక అమ్మాయి జీవితాన్ని ఎంతలా మార్చిందో? ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో? అనే లైన్ పై చేసిన సినిమా ‘గాసిప్’. మహేష్ యడ్లవల్లి, రాశి సింగ్ జంటగా నటించిన ఈ సినిమాను వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ పతాకంపై ఏతి రేమెళ్ల నిర్మించారు. వైభవ్ కౌండిన్య కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. విజయ్ ఆదిరాజు, గురు చరణ్, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
గాసిప్ కధ: అజంతా జన్మించిన రోజే ఆమె తల్లి మరణిస్తుంది. అప్పట్నుంచి కూతుర్ని కంటికి రెప్పలా పెంచుతాడు రమేష్ (విజయ్ ఆదిరాజు). మేనమామ ప్రకాశం (రవి వర్మ) సైతం అజంతాయే తన పెద్ద కూతురు అనేలా చూసుకుంటాడు. అయితే అజంతా (రాశి సింగ్)ను తేజ (మహేష్ యడ్లవల్లి) ప్రేమిస్తాడు. ఎప్పుడూ వెంట పడతాడు. తేజ తనను ఫాలో అవుతున్న సంగతి అజంతాకు కూడా తెలుసు, లవ్ ప్రపోజల్ వంటివి చేసుకోలేదు. ఓ రోజు ధైర్యం చేసి అజంతాకు ప్రపోజ్ చేస్తాడు తేజ. ఎప్పట్నుంచో ఎదురు చూసిన మూమెంట్ కనుక ఆమె కూడా హ్యాపీ. అయితే… తండ్రితో చెప్పడానికి కొంచెం తటపటాయిస్తుంది. అయితే తేజ ప్రేమ విషయం చెప్పేలోపు, తండ్రి ప్రవీణ్ (గురు చరణ్) సంబంధం తీసుకొస్తాడు. అజంతా జాతకం చూసి ఆమెకు ఎఫైర్లు ఎక్కువ అని రోనీ స్వామి (30 ఇయర్స్ పృథ్వీ) చెప్పిన మాటలు నమ్మి ప్రకాశం మనసు మారుతుంది. దానికి తోడు కాలనీలో కుర్రాళ్ళ పుకార్లు… వీటన్నిటి మధ్య ఏమైంది? అజంతా జీవితం ఎటువంటి మలుపు తీసుకుంది? అనేది చిత్రకథ.
Also Read
విశ్లేషణ : పని పాట లేకుండా ఇతరుల వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్ చేయడం ఎంత ప్రమాదకరమో చెప్పే సామాజిక సందేశంతో తెరకెక్కిన చక్కటి సినిమా ‘గాసిప్’. దర్శకుడు వైభవ్ కౌండిన్య తొలి ప్రయత్నంలోనే ఆలోచింపజేసే కథను ఎంచుకున్నారు. తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమ, చిన్న చిన్న అలకలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. పుకార్లు, జాతకాల పేరుతో జరిగే మోసాలను కథలో చాలా సహజంగా మేళవించారు. సమాజంలో పుకార్లు వ్యాప్తి చేసే వారి వల్ల జరిగే నష్టాన్ని చాలా స్పష్టంగా చూపించారు. జాతకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై సెటైర్ వేశారు. ఎక్కడా డ్రామా గానీ, అతి గానీ లేకుండా కథలో సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేసేలా తీశారు దర్శకుడు. వైభవ్ కౌండిన్య కథ, డైలాగుల్లో విషయం బావుంది, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. దర్శకుడికి ఇది మొదటి సినిమాలా అనిపించలేదు, అనుభవం ఉన్న దర్శకుడిలా చాలా సీన్స్ సెన్సిబుల్ గా ఉన్నాయి. శక్తికాంత్ కార్తీక్ సంగీతం, సతీష్ ఛాయాగ్రహణం కథకు తోడ్పడ్డాయి. కొన్ని చోట్ల నిర్మాణ విలువలు పరిమితంగా కనిపించినా, కథలోని బలం వాటిని అధిగమిస్తుంది.
రాశి సింగ్ గ్లామర్ కంటే నటనతో ఆకట్టుకుంది. అమాయకురాలిగా, పరిస్థితుల బారిన పడిన యువతిగా ఆమె నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. తండ్రిగా విజయ్ ఆదిరాజు, మేనమామగా రవి వర్మ భావోద్వేగాలను బాగా పలికించారు, తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రోనీ స్వామిగా 30 ఇయర్స్ పృథ్వీ కామెడీతో పాటు ఆయన నటన వల్ల వేణు స్వామిపై వేసిన సెటైర్ కూడా బాగా పేలింది. మహేష్ యడ్లవల్లి, గురు చరణ్ నటన కూడా బావుంది.
ఫైనల్గా: గాసిప్స్ వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయో చెప్పే మంచి మూవీ ‘గాసిప్’.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..