Devagudi Review : దేవగుడి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Abhinay Shaurya, Anu Sree, Raghu Kunche and others
- DIRECTOR: Bellam Ramakrishna Reddy
- MUSIC: Madeen Sk
- PRODUCER: Bellam Ramakrishna Reddy
ఈ మధ్యకాలంలో రియలిస్టిక్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో నిజజీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమాలు ఎక్కువవుతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘దేవగుడి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో రఘు కుంచె కీలక పాత్రలో నటించగా, బెల్లం రామకృష్ణారెడ్డి ఒకపక్క నిర్మాతగా సినిమాని నిర్మిస్తూనే, మరోపక్క దర్శకత్వం కూడా వహించారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
దేవగుడి ప్రాంతానికి చెందిన దేవగుడి వీరారెడ్డి (రఘు కుంచె), ఆ ఊరిలో ఒక ఫ్యాక్షన్ లీడర్. ప్రజలందరినీ బాగా చూసుకునే అతను, కులాల విషయంలో మాత్రం చాలా పట్టింపుతో ఉంటాడు. తన ప్రాణాలు కాపాడే అనుచరులను సైతం ఆ కులం పేరుతో చిన్నచూపు చూస్తుంటాడు. తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని కూడా సహించడు. ఇలాంటి క్రమంలో, తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలుస్తుంది. ధర్మను చంపబోయి, చివరి నిమిషంలో క్షమించి వదిలేస్తాడు. దీంతో ధర్మ ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే అనూహ్యంగా వీరారెడ్డి అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో వీరారెడ్డి అనుచరులను ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత మిస్ అవుతుంది. మిస్సయిన శ్వేత ఏమైంది? ధర్మ తన స్నేహితుడి చెల్లెలితో నిజంగానే ప్రేమలో పడ్డాడా? అసలు వీరిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైంది? వీరిద్దరూ ఒకటయ్యారా లేదా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
విశ్లేషణ:
నిజానికి ఇది కొత్త కథతో చేసిన సినిమా కాదు. కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక రొటీన్ స్టోరీతో సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు ఆ బాండింగ్ పెరుగుతూ వస్తుంది. అబ్బాయిలు ఇద్దరూ స్నేహితులుగా సరదాగా తిరుగుతుంటే, అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని హీరోయిన్ తండ్రి, అతన్ని బయటకు గెంటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం మీద సినిమా రాసుకున్నారు.
ఈ సినిమా కథ వింటుంటే మీకు కచ్చితంగా ‘యజ్ఞం’ లాంటి సినిమాల స్టోరీస్ గుర్తొస్తాయి. ఇది కూడా దాదాపుగా అలాగే సాగింది, కాకపోతే రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. దాదాపుగా ఒకే ఊరిలో సినిమా అంతా షూట్ చేసినట్టున్నారు. కాస్త రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
నిజానికి ఇప్పుడు మనిషి చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నాడు, కానీ ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నాడు. ఏదేమైనా చేయండి కానీ, పెళ్లి విషయంలో, చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన ‘దండోరా’ సినిమా ప్రస్తావిస్తే, మరోసారి ఈ ‘దేవగుడి’ సినిమా కూడా గుర్తు చేసినట్లే చెప్పాలి. ట్రైలర్ కాస్త ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాను కూడా ఎక్కడా బోర్ లేకుండా తెరకెక్కించడంలో డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. అయితే రొటీన్ కథ కావడంతో ప్రేక్షకులు ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. కాసేపట్లో ఏం జరగబోతోంది అనే విషయాన్ని సైతం ప్రేక్షకులు అంచనా వేయగలిగేలా ఉంటుంది. కానీ ఉన్న బడ్జెట్‌లో సినిమాని ఎక్కడా చుట్టేసినట్లు కాకుండా, చాలా రిచ్ విజువల్స్‌తో, మంచి పాటలు, ఫైట్స్ కంపోజ్ చేసి ఒక మంచి కమర్షియల్ సినిమా ఫీల్ తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోగా నటించిన అభినవ్ శౌర్యతో పాటు హీరోయిన్‌గా నటించిన అనుశ్రీ, అలాగే ఆమె సోదరుడి పాత్రలో నటించిన నరసింహ కూడా ఆకట్టుకున్నారు. వీరందరూ కొత్త ముఖాలైనప్పటికీ చాలా ఈజ్‌తో నటించారు. ఇక రఘు కుంచె దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో జీవించారు. అలానే ఈ సినిమాలో నటించిన మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ వంటి వాళ్లు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక టీమ్ విషయానికి వస్తే, మదిన్ అందించిన సంగీతం బాగుంది. కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి, అలాగే తెరమీద కూడా అంతే చక్కగా తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయింది. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. నిడివి కూడా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర బృందం. నిర్మాణ విలువలు అయితే అత్యద్భుతంగా ఉన్నాయి అనిపించింది.
ఫైనల్లీ: దేవగుడి రొటీన్ కథయినా, ఓ సారి ట్రై చేయొచ్చు.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!